Political News

రెండు వారాల్లో యుద్ధ‌మే: కోమ‌టిరెడ్డి డెడ్‌లైన్‌

10-15 రోజుల్లో యుద్ధం ప్రకటిస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి డెడ్‌లైన్ విధించారు. మునుగో డు తీర్పు తెలంగాణ మార్పునకు నాంది కావాలని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ భావిస్తే ఉప ఎన్నిక రాదని.. ప్రజలు సిద్ధంగా ఉంటే వస్తుందని ఆయన స్పష్టం చేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడనున్నారనే వార్తలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ఆదేశాల …

Read More »

కొంద‌రు నేత‌లు అంతే.. మార్చ‌లేం మ‌హ‌ప్ర‌భో!!

ఔను.. కొంద‌రు నేత‌లు అంతే.. ఈ మాట‌.. ఏపీలో రెండు కీల‌క పార్టీల మ‌ధ్య జోరుగా వినిపిస్తోంది. వీరిలో వైసీపీ నాయ‌కులు ఉన్నారు. టీడీపీ నేత‌లు కూడా ఉన్నారు. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తుంటే.. చోద్యం చూస్తున్న త‌మ్ముళ్లు.. వైసీపీని రికార్డు స్థాయి లో గ‌ట్టెక్కించి.. తిరిగి అధికారంలోకి రావాల‌ని.. వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తుంటే.. నేత‌లు.. త‌మ‌కు ఏమీ ప‌ట్ట‌న‌ట్టు.. తాము …

Read More »

ఏపీలో ఇదేం మిస్ట‌రీ.. జ‌గ‌న‌న్నా?

శ‌వాలు మాట్లాడుతున్నాయ్‌!!-యండ‌మూరి వీరేంద్ర‌నాథ్ రాసిన‌.. ఒక న‌వ‌ల‌లో.. డైలాగు ఇది! ఇప్పుడు ఇదే డైలాగు.. ఏపీలోనూ వినిపిస్తోంది. అదేంటి? అనుకుంటున్నారా? క‌రోనా మృతుల కుటుంబాలకు చెల్లించాల్సిన నిధుల విష‌యంలో గోల్‌మాల్‌ జ‌రిగింద‌ని.. ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నారు. అందుకే.. శ‌వాలు మాట్లాడితే.. త‌ప్ప‌.. స‌మ‌స్య‌కు ప‌రిష్కారం లేద‌ని.. అంటున్నారు. చాలా చిత్రంగా.. అంత‌కు మించి గోప్యంగా ఉన్న .. ఈ కేసు.. ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఏం జ‌రిగింది.?దేశంలోని …

Read More »

క్యాసినోకి నేను కూడా వెళ్తా.. ఏపీ మాజీ మంత్రి

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక కుదుపు కుదుపుతున్న క్యాసినో అంశంపై.. ఏపీ మాజీ మంత్రి, సీఎం జ‌గ‌న్ కు మేన‌మామ వ‌ర‌స‌య్యే.. బాలినేని శ్రీనివాస‌రెడ్డి స్పందించారు. త‌ను కూడా.. క్యాసినోకు వెళ్తుంటాన‌ని ఆయ‌న చెప్పారు. అయితే.. ప్ర‌వీణ్ చీకోటి అనే వ్య‌క్తి ఎవ‌రో మాత్రం ఆయ‌న‌కు తెలియ‌దని చెప్పడం విశేషం. క్యాసినో విష‌యంపై అడ్డ‌మైన రాత‌లు రాస్తే.. బాగోద‌ని.. మీడియాకు ప‌రోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. “నేను ఎప్పుడైనా క్యాసినోకు పోయి …

Read More »

మంగ‌ళ‌గిరి యూట‌ర్న్.. ఆళ్ల వల్ల కాదట

వైసీపీలో రాజ‌కీయాలు వేడెక్కాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కేదెవ‌రు.. అస‌లు టికెట్ ద‌క్కించు కునేదెవ‌రు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఒక‌వైపు.. రాష్ట్రంలో అన్ని పార్టీలూ.. ఎవ‌రి వ్యూహాలు వారు వేసుకుని ముందుకు సాగుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఎవ‌రి గెలుపైనా అంత ఈజీకాద‌ని అంటున్నారు. సో.. ప్ర‌తి ఒక్క‌రి ప‌రిస్థితి ఇబ్బందిగానే ఉంద‌నేది.. తాజాగా పార్టీ అధిష్టానం చేయించిన స‌ర్వేని బ‌ట్టి తెలుస్తోంది. ఇదిలావుంటే.. ముఖ్యంగా మంగ‌ళ‌గిరిపై వైసీపీ …

Read More »

మళ్ళీ చంద్రబాబు జై తెలంగాణ‌

తెలంగాణ‌లోనూ టీడీపీని ప‌రుగులు పెట్టించాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవాలని సూచించారు. భద్రాచలంలో తెలంగాణ టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. వరద ముంపు ప్రాంతాల్లో సమస్యలపై చర్చించారు. స్థానిక సమస్యలను నేతలు… చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. విలీన గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సెప్టెంబర్‌లో ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరు కావాలని నేతలు …

Read More »

సోముకు షాక్‌… దుమ్ముదులిపేసిన పెద్దాయ‌న‌

క‌ళ్లు మూసుకుని తాగినంత మాత్రాన పిల్లిని ఎవ‌రూ చూడ‌ర‌ని అనుకోవ‌డం త‌ప్పే క‌దా..! అలాగే.. ఏపీ రాజ‌ధాని విష‌యంలో బీజేపీ నేత‌లు.. ముఖ్యంగా కేంద్రంలోని పెద్ద‌లు చేయాల్సిందంతా చేసేసి.. ఇప్పుడు ఏమీ ఎరుగ‌బోమ‌ని.. చేస్తున్న వ్యాఖ్య‌ల‌ పై సామాన్యులు మండిప‌డుతున్నారు. తాము ఏం చేసినా.. ప్ర‌జ‌లు ఏమీ అన‌రు ధోర‌ణి ఇటీవ‌ల కాలంలో నాయ‌కుల‌కు పెరిగిపోయింది. ఎన్నిక‌లు రాగానే.. ఏమీ తెలియ‌ని అమాయ‌కుల్లా ప్ర‌జల ముందు న‌టించేస్తున్నారు. అయితే.. ప్ర‌జ‌లు …

Read More »

నిండా మునిగిపోయిన విద్యార్థులు

వేలాదిమంది వైద్య విద్యార్ధులు నిండా మునిగి పోయినట్లే అనిపిస్తోంది. వీరంతా ఉక్రెయిన్లో వైద్య విద్య చదవటానికి వెళ్ళి తిరిగి వచ్చేసినవారే. ఉక్రెయిన్లో చదువుకునేందుకు ఇండియా నుండి సుమారు 25 వేల మంది వెళ్ళారు. వీరిలో 20 వేలమంది వైద్య విద్యను చదువుతున్నారు. యుద్ధం మొదలవ్వటానికి ముందే వీళ్ళల్లో అత్యధికుల వైద్య విద్య అయిపోయింది. కాకపోతే ఫైనల్ పరీక్షలు జరగాల్సుండగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. కొద్దిరోజుల్లో యుద్ధం అయిపోతుందని తమ చదువు …

Read More »

‘రాజ‌న్న రాజ్యం కావాలంటే.. ష‌ర్మిల ఏపీకి పోవాలి’

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి.. వైఎస్ త‌న‌య ష‌ర్మిల‌పై టీఆర్ఎస్ కీల‌క నాయ‌కుడు, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “రాజ‌న్న రాజ్యం కావాల‌ని ఎవ‌రైనా అనుకుంటే.. వాళ్లు త‌క్ష‌ణం ఏపీకి పోవాలి. ఇది.. రాజన్న‌కు వ్య‌తిరేక రాజ్యం. రాజ‌న్న(వైఎస్‌)తెలంగాణ విష‌యంలో ఏమన్నాడో.. వాళ్లు(ష‌ర్మిల అండ్ కో) మ‌రిచిపోయినా.. తెలంగాణ స‌మాజం మాత్రం మ‌రిచిపోలేదు. ఈ విష‌యాన్ని వారు తెలుసుకుంటే మంచిది. లేకుంటే తెలంగాణ ప్ర‌జ‌లే …

Read More »

కేంద్రంపై నిందలు మొదలుపెట్టిన వైసీపీ !

ఇపుడిదే ఎవరికీ అర్థం కావటం లేదు. రెండు రోజులుగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటు జగన్మోహన్ రెడ్డి అటు విజయసాయిరెడ్డితో పాటు కొందరు ఎంపీలు గట్టిగా మాట్లాడుతున్నారు. కోనసీమ జిల్లాలో వరద బాధితులను పరామర్శించిన సందర్భంగా జగన్ మాట్లాడుతూ పునరావాస ప్యాకేజికి నిధులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే అన్నారు. తాను నరేంద్రమోడీకి కలిసినపుడు ఈ విషయమై నిలదీస్తానని చెప్పారు. కేంద్రం నుండి పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన రు. 20,000 కోట్లు …

Read More »

మునుగోడు ‘రిజ‌ల్ట్’.. ఎవ‌రికి అనుకూలం?

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఇంకా రాజీనామా చేయ‌లేదు. ఆయ‌న బీజేపీ తీర్థం పుచ్చుకోలేదు. కానీ, తెర‌వెనుక .. ఆయ‌న రాజ‌కీయాలు మాత్రం హాట్ టాపిక్‌గా మారిపోయాయి. ఆయ‌న రేపో మాపో.. బీజేపీలోకి చేరిపోవ‌డం ఖాయ‌మ‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. అయితే.. ఆయ‌న బీజేపీ పార్టీలో చేరినా.. ఎమ్మెల్యేగా కొన‌సాగవ‌చ్చు. ఎవ‌రూ ఆయ‌న‌కు అభ్యంత‌రం చెప్ప‌రు. ఎందుకంటే.. …

Read More »

ఈ స‌ర్వేల ప‌ర‌మార్థం ఏంటి? వైసీపీలో ర‌గ‌డ‌

వైసీపీలో స‌ర్వేల‌పై స‌ర్వేలు చేస్తున్నారు. నాయ‌కుల ప‌నితీరును బూత‌ద్దంలో చూస్తున్నారు. ఎవ‌రు ప్ర‌జ‌ల‌తో ఉంటున్నారు? ఎవ‌రు ఉండ‌ట్లేదు..? అనే అంశాల‌ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్నారు. దీంతో నాయ‌కులు ఎక్క‌డిక‌క్క‌డ హ‌డ‌లి పోతున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. చివ‌ర‌కు ఏం జ‌రుగుతుంద‌నేది.. ఎవ‌రికి అర్ధం కావ‌డం లేదు. “ఇన్ని స‌ర్వేలు చేయిస్తున్నారు. మాకు టికెట్ ఇస్తామ‌నో.. ఇవ్వ‌మ‌నో తేల్చేస్తే. మా దారి మేం చూసుకుంటాం” అని ఒక నాయ‌కుడు వ్యాఖ్యానించే వ‌ర‌కు వ‌చ్చిందంటే.. …

Read More »