Political News

కేసీఆర్‌పై పోరు బాట‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్రంలో తొలిసారి ప్ర‌తిప‌క్ష పార్టీల నుంచి దీటైన స‌వాళ్లు ఎదురవుతున్నాయి. 2014లో రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లోనూ టీఆర్ఎస్‌ను గెలిపించి సీఎం పీఠంపై కూర్చున్న ఆయ‌న‌కు.. ఇన్నాళ్ల‌కూ స‌రైన సెగ త‌గులుతోంది. అటు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌.. ఇటు తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఆయ‌న‌కు పోటీగా నిల‌బ‌డ్డారు. ఇప్పుడేమో తాజాగా రాష్ట్రంలోని బీజేపీ కాకుండా …

Read More »

పంతం నెగ్గించుకున్న సిద్ధూ

క్రికెట్ మైదానంలో సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డి ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌పై పెత్త‌నం చ‌లాయించిన మాజీ క్రికెట‌ర్ న‌వ్‌జోత్ సింగ్ సిద్ధూ.. ఇప్పుడు పంజాబ్ రాజ‌కీయాల్లోనూ అదే దూకుడుతో కొన‌సాగుతూ త‌న ప్ర‌త్య‌ర్థుల‌పై ఇప్పుడ‌దే ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. పంజాబ్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా ఎంపిక‌వ‌డం ద‌గ్గ‌ర నుంచి ఇప్పుడు తాజాగా సీఎంగా అమ‌రీంద‌ర్ రాజీనామా ఆ త‌ర్వాత చ‌రణ్‌జిత్ సింగ్ ముఖ్య‌మంత్రిగా ఎంపిక‌వ‌డం.. ఇలా అన్ని విష‌యాల్లోనూ సిద్ధూ త‌న పంతం నెగ్గించుకున్నారనే …

Read More »

ఆ టీడీపీ సీనియ‌ర్‌కు రెండు సీట్లు కావాల‌ట‌…!

రాయపాటి సాంబశివరావు…ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్‌లో పనిచేసి, పలుమార్లు గుంటూరు ఎంపీగా గెలిచిన రాయపాటి ఎన్నో కీల‌క ప‌ద‌వులు అధిరోహించారు. 2014 రాష్ట్ర విభజన నేపథ్యంలో రాయపాటి టి‌డి‌పిలోకి వచ్చేశారు. ఇక 2014 ఎన్నికల్లో నరసారావుపేట ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికలోచ్చేసరికి రాయపాటి మళ్ళీ పోటీలోకి దిగడానికి కొంచెం తటపటాయించారు. తనతో తన కుమారుడు రాయ‌పాటి రంగారావుకు టికెట్ ఇస్తేనే …

Read More »

ఆ ఎమ్మెల్యేల‌పై ‘విజిటింగ్’ ముద్ర‌..!

అధికార పార్టీ వైసీపీలో కొంద‌రు ఎమ్మెల్యేల‌పై ‘విజిటింగ్‌’ ముద్ర ప‌డింది. ఇప్ప‌టికే వారిని.. ఆయా నియోజకవ‌ర్గాల్లో విజిటింగ్ ఎమ్మెల్యేలుగానే ప్ర‌స్తావిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఇలా విజిటింగ్ ఎమ్మెల్యేలుగా ముద్రప‌డిన వారిలో ఎక్కువ‌మంది కొత్త‌గా గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న వారే కావ‌డం గ‌మ‌నార్హం. అయితే.. వీరు.. గ‌త రెండేళ్లుగా త‌మ సొంత వ్య‌వ‌హారాలు, వ్యాపారాల్లో మునిగి తేలుతున్నార‌నే వాద‌న బ‌లం గా వినిపిస్తోంది. నియోజ‌క‌వ‌ర్గాల‌కు కొత్తే అయినా.. వారు ఏమాత్రం …

Read More »

వాస్తవం చెప్పేసిన ఎంఎల్ఏ

అభివృద్ధి పనులకు సంబంధించి అధికార పార్టీ ఒకరు క్షేత్ర స్ధాయిలోని వాస్తవ పరిస్థితులను జనాలకు వివరించారు. నేను-నా కార్యకర్త అనే కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన నియోజకవర్గంలో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే నగరంలోని 18వ డివిజన్లోని హరినాధపురంలోని ఓ కార్యకర్త ఇంటికి ఎంఎల్ఏ వెళ్ళారు.  విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు వచ్చి ఎంఎల్ఏని కలిశారు. కోటంరెడ్డి తో భేటీ అయిన …

Read More »

మంత్రుల్లో జగన్ హిట్ లిస్ట్ తయారైందా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అధికార వైసీపీ నేత‌లు ఇప్పుడు మంత్రి ప‌ద‌విని మాత్ర‌మే క‌ల‌వ‌రిస్తున్నారు. జ‌గ‌న్ కేబినేట్‌లో చోటు ద‌క్కించుకోవాల‌నే ఆశ‌తో ఉన్న ఎమ్మెల్యేలు ఓ వైపు.. ఇప్ప‌టికే ఉన్న మంత్రి ప‌ద‌విని కాపాడుకోవాల‌నే తాప‌త్రాయంలో ఉన్న నేత‌లు మ‌రోవైపు. ఇలా వైసీపీలో మంత్రి ప‌ద‌వులు చ‌ర్చ జోరుగా సాగుతోంది. అధికారంలోకి వ‌చ్చిన రెండున్న‌రేళ్ల త‌ర్వాత మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని 2019లో జ‌గ‌న్ సీఎం అయిన‌ప్పుడే స్ప‌ష్టం చేశారు. ఇప్పుడా స‌మ‌యం …

Read More »

ముప్పేట దాడి.. బాబు ఫీల్ కాలేదా… ఈ మౌన‌మేంటి..?

నిజ‌మే! ఎప్పుడూ.. మీడియాతో స‌మ‌యం గ‌డిపే టీడీపీ అధినేత‌.. మైకు పుచ్చుకుంటే.. గంట‌ల త‌ర‌బ‌డి.. మాట్లాడే మాజీ ముఖ్య‌మంత్రి, .. చంద్ర‌బాబు.. త‌న ఇంటిపై భారీ ఎత్తున దాడి జ‌రిగిన త‌ర్వాత‌ ప‌న్నెత్తి ఒక్క‌మాటంటే.. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. క‌నీసం ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయ‌లేదు. పూర్తిగా మౌనం వ‌హించారు. ఇదే.. ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అయింది. పోనీ.. ఆయ‌నేమ‌న్నా.. పొరుగు రాష్ట్రంలో ఉన్నారా? …

Read More »

మొత్తానికి షర్మిలను గుర్తించిన కేటీయార్

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను మంత్రి కేటీయార్ మొదటిసారిగా గుర్తించారు. రాజన్న రాజ్యం తెస్తానంటు తెలంగాణాలో కొంతకాలం పర్యటనలు చేసిన షర్మిల ఈ మధ్యనే కొత్త పార్టీ పెట్టారు. అయితే ఆమె పార్టీ పెట్టినా అనుకున్నంత మైలేజీ సాధించలేకపోతున్నారు. అందుకనే పార్టీ ఉనికిని కాపాడుకునేందుకా అన్నట్లుగా నిరుద్యోగ సమస్యలపై అప్పుడప్పుడు నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఆమె ఎంత అవస్థలు పడుతున్నా వైఎస్సార్టీపీ కూడా ఒక రాజకీయ పార్టయేనని, షర్మిలను పార్టీ …

Read More »

కాంగ్రెస్ త‌ప్పు చేసిందా?

దేశంలో ఒక‌ప్పుడు ఆధిప‌త్యం చ‌లాయించిన కాంగ్రెస్ పార్టీ ఆ త‌ర్వాత క్ర‌మంగా ప్ర‌భ కోల్పోతూ సాగుతోంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి ద‌క్కిన ఆద‌ర‌ణ ఓ కార‌ణం కాగా.. కాంగ్రెస్ స్వ‌యంకృతాప‌రాధం కూడా అందుకు మ‌రో కార‌ణం అన్న‌ది కాద‌న‌లేని నిజం. రాష్ట్రాల్లో కీల‌క నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం లోపం.. స‌మ‌స్య‌ల‌ను చ‌క్క‌దిద్ద‌లేని అధిష్ఠానం అస‌మ‌ర్థ‌త‌.. వెర‌సి పార్టీ ప‌రిస్థితి నానాటికీ దారుణంగా మారుతుంద‌నేది కాద‌న‌లేని నిజ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. …

Read More »

క‌ర‌ణంను వ‌ణికిస్తున్న ప‌రుచూరు.. రీజ‌నేంటి..?

గ‌త 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌కాశం జిల్లా చీరాల నుంచి విజ‌యం ద‌క్కించుకున్న టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు క‌ర‌ణం బ‌ల‌రాం త‌ర్వాత కాలంలో రాజ‌కీయ మార్పుల నేప‌థ్యంలో వైసీపీలోకి వ‌చ్చారు. ఇక్క‌డ త‌న‌హవా చ‌లాయిస్తున్నారు. అయితే.. చీరాల విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ ఆల్రెడీ.. వైసీపీకి ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ఉన్నారు. ఆమంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్‌పై ఓడిపోయారు. అయిన‌ప్ప‌టికీ.. పార్టీ కోసం ఆయ‌న ఎంతో ప‌నిచేస్తున్నారు. స్థానికంగా …

Read More »

కిలో బంగాళదుంపలు 3 వేల రూపాయలట

అమెరికా నిష్క్రమణ, తాలిబన్ల దురాక్రమణ తర్వాత ఆప్ఘనిస్ధాన్లోని ప్రజల పరిస్థితి ఎలాగుందో తెలుసా ? జనాల బతుకులు దుర్భరమైయాయి. దేశంలోని కోట్లాది మంది ప్రజలు మూడు పూటల కడుపునిండా తిండి తిని ఎన్నో రోజులైందట. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పిల్లల ఆకలిని తీర్చటానికి యజమానులు, ఇంటి పెద్దలు ఇంట్లోని విలువైన వస్తువులను అమ్మేసుకుంటున్నారు. తమ వస్తువులకు ఎంత ధర వస్తే అంతే చాలన్న ఆత్రంతా ఇంట్లోని వస్తువులన్నింటినీ అమ్మకానికి పెట్టేస్తున్నారు. …

Read More »

పవన్‌కు జనం మూడ్ పట్టట్లేదా?

జనసేనాని పవన్ కళ్యాణ్ తీరు కొన్నిసార్లు ఆ పార్టీ కార్యకర్తలకు, ఆయన అభిమానులకే అంతుబట్టని విధంగా ఉంటుంది. జనాల మూడ్ ఏంటో అర్థం చేసుకోకుండా ఆయన వివిధ అంశాలపై స్పందించే తీరు ఆశ్చర్యపరుస్తుంటుంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజును పురస్కరించుకుని శుక్రవారం ఆయన వేసిన ‘భజన’ ట్వీట్లు జనసేన వాళ్లకే రుచించలేదు. చాలామంది ట్విట్టర్లో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. మోడీని పవన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు …

Read More »