Political News

బీజేపీ గేలం.. ఎంపీ టికెట్ మందకృష్ణకేనా?

వ‌చ్చే మూడు మాసాల్లో జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి తెలంగాణ‌లో 10 స్థానాల‌పై బీజేపీ క‌న్నేసిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల బీజేపీ అగ్ర‌నాయ‌కుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్ర‌త్యేకంగా హైద‌రాబాద్ కు వ‌చ్చి మ‌రీ.. ఇక్క‌డి బీజేపీ ప‌రిస్థితుల‌పై చ‌ర్చించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న కొన్ని స్థానాల‌పై కొంద‌రు అభ్య‌ర్థుల‌కు సంబంధించి ప్రొఫైల్స్ ను స్వీక‌రించిన‌ట్టు తెలిసింది. ఇదిలావుంటే.. అమిత్‌షాతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ  …

Read More »

షర్మిల గిఫ్ట్ విషయం నన్నడగొద్దు: లోకేష్

క్రిస్మస్ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల క్రిస్ట్ మస్ గిఫ్ట్ పంపిన వైనం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తన సోదరుడు సీఎం జగన్ రాజకీయ ప్రత్యర్థి అయిన లోకేష్ కు గిఫ్ట్ పంపడం…ఆ గిఫ్ట్ పంపిన షర్మిలకు లోకేష్ ధన్యవాదాలు తెలపడం ఏపీ రాజకీయాలలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన లోకేష్ …

Read More »

అమెరికాలో వైసీపీ సోష‌ల్ విభాగం ఏర్పాటు..

ఏపీ అధికార పార్టీ వైసీపీ.. అమెరికాలో సోష‌ల్ విభాగాన్ని మ‌రింత బ‌లోపేతం చేసింది. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను పుర‌స్క‌రించుకుని.. సోష‌ల్ విభాగాన్ని ఏర్పాటు ఏస్తూ.. పార్టీ నిర్ణ‌యించింది. వీరిలో విద్యావంతులు, ఐటీ, వైద్య రంగాల్లోని యువ‌త‌కు ప్రాధాన్యం క‌ల్పించింది. సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్‌, కో క‌న్వీన‌ర్ స‌హా, స‌ల‌హాదారులు, సోష‌ల్ మీడియా మేనేజ్‌మెంట్ స‌భ్యులు, నెట్‌వ‌ర్క్ మేనేజ్‌మెంట్ స‌భ్యులు, డిస్ట్రిబ్యూష‌న్ మేనేజ్‌మెంట్, ప్ర‌భావ‌శీల‌క మేనేజ్‌మెంట్ పేర్ల‌తో క‌మిటీలను …

Read More »

వర్మ వివాదం.. అరెస్టు ఖాయం!

సినీ ద‌ర్శ‌కుడు రాం గోపాల్ వ‌ర్మ‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశార‌న్న అభియోగంపై ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్‌రావు‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ సీఐడీ ప్రత్యేక బృందం హైదరాబాద్‌ను జ‌ల్లెడ ప‌డుతోంది. ఏకంగా ఎనిమిది మంది సీఐడీ అధికారులు నల్లగండ్లలోని అపర్ణ సైబర్ లైఫ్ గేటెడ్ కమ్యూనిటీలో ఉండే కొలికపూడి శ్రీనివాస్‌రావు నివాసానికి చేరుకుని ఆయ‌న‌ను అరెస్టు చేసేందుకు ప్ర‌య‌త్నించింది. అయితే… కొలికపూడి హైదరాబాద్‌లో అందుబాటులో లేక‌పోవ‌డంతో ఆయ‌న …

Read More »

చంద్ర‌బాబు కోసం రంగంలోకి `సీబీఎన్ ఫోరం`

వ‌చ్చే 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబును ముఖ్య‌మంత్రిని చేయాల‌న్న సంక‌ల్పంతో “సీబీఎన్ ఫోరం“ రంగంలోకి దిగింది. ఫోరం ప్రతినిధులు వినూత్న రీతిలో కార్యక్రమాలు చేపట్టేందుకు ప్ర‌ణాళిక రూపొందించుకున్నారు. రాష్ట్రంలో సమస్యలపై అంశాల వారీగా వివరిస్తూ ప్రజలకు సీబీఎన్ ఫోరం అవగాహన కల్పిస్తోంది. తాజాగా ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని నందిగామలో `దళిత గళం` పేరుతో వైసీపీ ప్ర‌భుత్వం దళితులకు చేసిన అన్యాయాన్ని వివరిస్తూ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి …

Read More »

వ‌స్తాడు నా రాజు.. వైసీపీ వెయిటింగ్ బ్రో!

వైసీపీలో ఇదో కొత్త‌రాగం. వ‌స్తాడు నారాజు ఈ రోజు.. అంటూ కీల‌క నేత కోసం పార్టీ ఎదురు చూస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉన్న నాయ‌కుల‌కే టికెట్లు స‌ర్ద‌లేక‌.. అంద‌రి నీ సంతృప్తి ప‌ర‌చ‌లేక పార్టీ స‌త‌మ‌తం అవుతున్న‌ద‌న్న విష‌యం వాస్త‌వం. కానీ, ఇదే స‌మ‌యంలో కొత్త నాయ‌కుడు, పైగా ఒక సామాజిక వ‌ర్గాన్నిప్ర‌భావితం చేయ‌గ‌ల నాయ‌కుడు అనే పేరున్న కీల‌క నేత కోసం వైసీపీ ఎదురు …

Read More »

బ్రేకింగ్: సీఐడీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌లపై హైకోర్టులో టీడీపీ పిటిషన్

ఏపీ సీఐడీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌ల‌పై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ న్యాయ పోరాటానికి దిగింది. వీరి కార‌ణంగా.. టీడీపీ  ఇబ్బందులు ప‌డుతోంద‌ని, పార్టీని లేకుండా చేయాల‌నే ఉద్దేశంతో ప్ర‌భుత్వం చెప్పిన‌ట్టు సీఐడీ, ఇంటెలిజెన్స్‌చీఫ్‌లు ఆడుతున్నార‌ని పేర్కొంటూ టీడీపీ హైకోర్టులో పిటిష‌న్ వేసింది. ఈ క్రమంలో సీఐ డీ అధికారులు స‌హా.. ఇంటెలిజెన్స్ చీఫ్ చేసిన బెదిరింపులకు సంబంధించిన సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచింది. ఈ మేర‌కు టీడీపీ నేత కిలారు రాజేష్ …

Read More »

వైసీపీ అవినీతి.. ప్ర‌ధాని మోడీకి ప‌వ‌న్ లేఖాస్త్రం!

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం అవినీతికి పాల్ప‌డుతోందని.. త‌క్ష‌ణ‌మే రంగంలోకి విచార‌ణ జ‌రిపి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వానికి తాజాగా లేఖ సంధించారు. వైసీపీ హయాంలో గృహ నిర్మాణాల్లో జరిగిన అత్యంత భారీ అవినీతిపై దృష్టి సారించి, వెంటనే సీబీఐతో విచారణ చేయించాలని పవన్ కళ్యాణ్ లేఖ‌లో కోరారు. లేఖ‌లో పేర్కొన్న వివ‌రాలు ఇవీ.. 1.  పేదలకు సొంతిల్లు పేరుతో కేవలం …

Read More »

వైసీపీపై కేసులు.. అవినీతి బ‌య‌ట పెడ‌తా:  ఆర్కే

ఇటీవ‌ల వైసీపీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా ఏక‌కాలంలో రాజీనామా చేసిన మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఉర‌ఫ్ ఆర్కే.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లోనే తాను వైఎస్ ష‌ర్మిల వెంట న‌డ‌వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు చెప్పారు. అయితే.. ఆమె కాంగ్రెస్‌లోకి వ‌స్తేనేనన‌ని చెప్పారు. తాను ఏ పార్టీలో ఉంటాను అనేది కాలం నిర్ణయిస్తుందన్న ఆయ‌న‌.. వైసీపీకి  నేను ఎంత సేవ చేశానో త‌న‌కు తెలుసని వ్యాఖ్యానించారు. నేను సర్వస్వం పోగొట్టుకున్నాను.. అని …

Read More »

కాళేశ్వరం ఫెయిల్యూర్ గా మిగిలిపోవాల్సిందేనా?

కేసీయార్ ఎంతో గొప్పగా ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా మిగిలిపోయేట్లుంది. ప్రాజెక్టును మొదలుపెట్టింది కోట్ల రూపాయలు దోచుకోవటానికే అని మొదటినుండి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. వాళ్ళ ఆరోపణలకు తగ్గట్లే కాళేశ్వరం నిర్మాణంలోని నాణ్యతాలోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు కుంగిపోవటం, బ్యారేజి ప్రాంతంలో చీలిక రావటమంతా కేసీయార్ ఫెయిల్యూర్ కు సాక్ష్యంగా నిలుస్తోంది. తాజాగా మేడిగడ్డ …

Read More »

రాముడు, పెట్రోలు ధరలు!

శ్రీరాముడి పేరుతో ఎన్నికల మాయ చేస్తున్న మోడీ… తాజాగా పెట్రోలు ధరలతో మరో మాయ మొదలుపెట్టారు. మీడియాతో పాటు సోషల్ మీడియాలో పెద్దఎత్తున ఒక విషయం వైరల్ అవుతోంది. అదేమిటంటే పెట్రోల్, డీజల్ ధరలను కేంద్రప్రభుత్వం బారీగా తగ్గించబోతోందని. ధరలు తగ్గించాలని చమురు కంపెనీలు మంత్రిత్వశాఖకు ప్రతిపాదనలు పంపిందట. మంత్రిత్వశాఖ కూడా ఈ విషయమై సానుకూలంగా స్పందించి, కసరత్తు చేసి నరేంద్రమోడీకి ధరల తగ్గింపుపై సిఫారసు చేసినట్లు ఢిల్లీ నుండే వార్తలు  …

Read More »

తెలంగాణా బీజేపీకి షాక్ తప్పదా?

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లోపు తెలంగాణా బీజేపీకి షాక్ తప్పేట్లులేదు. పార్టీలోని ముగ్గురు కీలకమైన నేతలు కాంగ్రెస్ లో చేరబోతున్నారంటు విపరీతమైన ప్రచారం జరుగుతోంది. నిప్పులేనిదే పొగరాదన్నట్లుగానే జరుగుతున్న ప్రచారాన్ని చూడాల్సుంటుంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు మరో ప్రముఖ నేత కూడా బీజేపీకి తొందరలో రాజీనామాలు చేయటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. కాంగ్రెస్ లో చేరబోయే ముగ్గురు నేతలు కూడా పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయటం …

Read More »