‘ఆమంచి’ వ్యూహం ప‌సిగ‌ట్టిన జ‌గ‌న్‌ !

బాప‌ట్ల జిల్లాలోని మాజీ ఎమ్మెల్యే ఫైర్‌బ్రాండ్ ఆమంచి కృష్ణ మోహ‌న్ వ్య‌వ‌హారం దాదాపు కొలిక్కి వ‌చ్చింద‌ని అంటున్నారు. పార్టీ ప‌రంగా ప‌రిస్థితి ఎలా ఉన్నా.. మాన‌సికంగా ఆమంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కంచుకోట చీరాల నుంచే పోటీ చేయాల‌ని దాదాపు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్టు తెలుస్తోంది. పార్టీ ప‌రంగా చూసుకుంటే.. ప్ర‌స్తుతం ఆయ‌న ప‌రుచూరు ఇంచార్జ్‌గా ఉన్నారు. సామాజిక స‌మీక‌ర‌ణ‌ల ప‌రంగా ఆమంచికి ప‌రుచూరు సూట్ అవుతుందా ? అంటే ఎస్ అని చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇక్క‌డ రెండుసార్లు వ‌రుస‌గా టీడీపీ నుంచి గెలిచిన ఏలూరి సాంబ‌శివ‌రావు మ‌రోసారి పోటీకి రెడీ అవుతున్నారు.

త‌న బ‌లం, బ‌లంగం ఉన్న చీరాల‌ను కాద‌ని ప‌రుచూరులో యేడాదిన్న‌ర కాలంగా ఆమంచి ఇష్టంలేని రాజ‌కీయ‌మే చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీ చీరాల టికెట్ నే త‌న‌కు కేటాయించాల‌ని ఇప్ప‌టికీ ఆయ‌న ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. దీంతో పార్టీ కూడా.. ఆలోచ‌న‌లో ప‌డింది. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసినా.. చీరాల విష‌యాన్ని మాత్రం పెండింగులో పెట్టింది. మ‌రో వైపు.. చీరాల ఎమ్మెల్యేగా ఉన్న క‌ర‌ణం బ‌ల‌రాం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న వార‌సుడు వెంక‌టేష్‌ను ఇక్క‌డ నుంచి పోటీ చేయించాల‌ని చూస్తున్నారు.

క‌ర‌ణం ఎంత ప‌ట్టుబ‌డుతున్నా జ‌గ‌న్ క‌ర‌ణం ఫ్యామిలీపై పూర్తిగా ఆశ‌ల్లో లేరు. క‌ర‌ణం కుటుంబాన్ని అద్దంకి పంపాల‌ని ట్రై చేసినా వ‌ర్క‌వుట్ కాకే అక్క‌డ పాణెం హ‌నిమిరెడ్డికి ఇన్‌చార్జ్ బాధ్య‌త‌లు ఇచ్చారు. ఇక అధిష్టానం ఆలోచ‌న ఎలా ఉన్నా ఆమంచి త‌న ప్లాన్‌లో తాను ఉన్నారు. పార్టీ టికెట్ ఇస్తే.. వైసీపీ జెండాపై ఆయ‌న పోటీకి దిగ‌నున్నారు. ఒక‌వేళ ఇవ్వ‌కోయినా.. స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా అయినా ఇక్క‌డ నుంచి రంగంలోకి దిగాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. ఈ విష‌యంలో ఎవ్వ‌రికి ఎలాంటి డౌట్లు లేవు.

మ‌రోవైపు ఆమంచి వ్యూహాన్ని వైసీపీ కూడా ప‌సిగ‌ట్టింది. దీంతో క‌ర‌ణంను అద్దంకికి పంపించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే అద్దంకి ఇంచార్జ్‌గా ఉన్న హ‌నిమిరెడ్డిని మార్చేందుకు వైసీపీ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు స‌మాచారం. అద్దంకిలో హ‌నిమిరెడ్డికి బాధ్య‌త‌లు ఇచ్చినా పార్టీ గ్రాఫ్ పెర‌గ‌లేద‌న్న‌ది వైసీపీ అంచ‌నా. దీంతో అద్దంకికి క‌ర‌ణం ఫ్యామిలీని పంపించే వ్యూహం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

దీనికి క‌ర‌ణం కుటుంబం ఒప్పుకొంటే స‌రి. లేక‌పోతే, సీఎం జ‌గ‌న్ ఏకంగా వీరిని ప‌క్క‌న పెట్టిన ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు. ఇవ‌న్నీ.. ఒక‌వైపు చ‌ర్చ‌గా ఉంటే త‌న‌కు టికెట్ ఇచ్చినా.. ఇవ్వ‌క పోయినా.. బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దులుకునేందుకు ఆమంచి సిద్ధంగా లేర‌ని తెలుస్తోంది. 2014 మాదిరిగా ఆయ‌న స్వ‌తంత్రంగా అయినా.. పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకోవాల‌ని చూస్తున్నారు. దీంతో ఆయ‌న ఇక్క‌డ పోటీ ఖ‌రారైన‌ట్టే..!