మ‌ళ్లీ మేమే.. దేశం కూడా ఇదే చెబుతోంది: మోడీ

Hyderabad: Prime Minster Narendra Modi waves at the crowd during a road show, ahead of the Lok Sabha elections, at Malkajgiri in Hyderabad, Friday, March 15, 2024. Union Minister and Telangana BJP chief G. Kishan Reddy is also seen. (PTI Photo) (PTI03_15_2024_000259A)

ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల చేసేందుకు కొంత స‌మ‌యం మాత్ర‌మే ఉంది. కానీ, ఫ‌లితం మాత్రం ఎప్పుడో నిర్ణ‌యం అయిపోయింది. మ‌ళ్లీ మేమేన‌ని ఈ దేశం మొత్తం చాటి చెబుతోంది. ఈ దేశ ప్ర‌జ‌లు మోడీని మ‌రోసారి ప్ర‌ధానిని చేయాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. ఆ స‌య‌మంలో మ‌రెంతో దూరంలో లేదు అని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తెలంగాణ‌లో ప‌ర్య‌టిస్తున్నారు. నాగ‌ర్ క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గంలో భార‌తీయ జ‌న‌తాపార్టీ నిర్వ‌హించిన విజ‌య సంక‌ల్ప స‌భ‌లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మాట్లాడు తూ.. మ‌రికొద్ది సేప‌ట్లో ఎన్నిక‌ల షెడ్యూల్ రానుంద‌ని, అయితే ఇప్ప‌టికే మ‌రోసారి మోడీ ప్ర‌భుత్వ‌మే అధికారంలోకి వ‌స్తుంద‌ని దేశ ప్ర‌జ‌లు నిర్ణ‌యించేశార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇటీవ‌లే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగాయ‌ని, అప్ప‌ట్లోనూ తాను వ‌చ్చాన‌ని తెలిపారు.

బీఆర్ ఎస్ పార్టీపై ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త‌ను తాను స్ప‌ష్టంగా చూశాన‌ని మోడీ అన్నారు. ఈసారి ఎన్డీయే కూట‌మికి 400 సీట్లు రాబోతున్నాయ‌ని తెలిపారు. అదే గాలి తెలంగాణ‌లోనూ వీస్తోంద‌ని చెప్పారు. గ‌త ప‌దే ళ్ళలో తెలంగాణ అభివృద్ధికి ఎన్డీయే ప్ర‌భుత్వం విశేషంగా కృషి చేసింద‌ని తెలిపారు. అయితే.. కాంగ్రెస్‌, బీఆర్ ఎస్ పార్టీలు తెలంగాణ అభివృద్ధిని అడుగ‌డుగునా అడ్డుకున్నాయ‌ని విమ‌ర్శించారు. తెలంగాణ ప్ర‌జ‌ల క‌ల‌ల‌ను ఈ రెండు పార్టీలు ధ్వంసం చేశాయ‌ని విమ‌ర్శంచారు.

మ‌ల్కాజిగిరిలో శుక్ర‌వారం రాత్రి నిర్వ‌హించిన రోడ్ షో అద్భుతంగా జ‌రిగింద‌ని, ప్ర‌జ‌ల నుంచి విశేష స్పం దన ల‌భించింద‌ని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ‌లో కూడా అబ్ కీబార్ 400 పార్ నినాద‌మే వినిపిస్తోంద‌ని చెప్పారు. తెలంగాణ‌ను గేట్ వే ఆఫ్ సౌత్‌గా అభివ‌ర్ణించారు. ఏడుద‌శాబ్దాల పాటు కాంగ్రెస్ ఈ దేశాన్ని దోచుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంద‌ని విమ‌ర్శించారు. అదే రీతిలో తెలంగాణ‌లో బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం కూడా ప్ర‌జ‌ల ఆస్తుల‌ను దోచుకుంద‌ని దుయ్య‌బ‌ట్టారు.