Political News

ఒక్కసారి కాదు.. వందసార్లు కేసీఆర్ కాళ్లు మొక్కుతా

కొవిడ్ టైంలో తెలంగాణ‌లో బాగా పాపుల‌ర్ అయిన అధికారుల్లో రాష్ట్ర హెల్త్ డైరెక్ట‌ర్ గ‌డ‌ల శ్రీనివాస‌రావు ఒక‌రు. క‌రోనా ప్ర‌భావం మొద‌ల‌య్యాక ఆయ‌న దాదాపు ప్ర‌తి రోజూ మీడియాలో క‌నిపించేవారు. కొవిడ్ అప్‌డేట్స్ ఇవ్వ‌డంతో పాటు సూచ‌న‌లూ చెప్పేవారు. ఐతే ఈ మ‌ధ్య శ్రీనివాస్ రాజ‌కీయ కార‌ణాల‌తో వార్త‌ల్లో వ్య‌క్తి అవుతుండ‌డం విశేషం. ఆయ‌న అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న‌ట్లు తెలుస్తోంది. భ‌ద్రాద్రి-కొత్త‌గూడెం జిల్లా నుంచి …

Read More »

ఇది.. అతి జాగ్ర‌త్త‌కు ప‌రాకాష్ఠ‌!!

Jagan to pick 50 new candidates for 2024 elections

అధికారంలో ఉన్న‌వారికి అంతో ఇంతో వ్య‌తిరేక‌త ఉంటుంది కాబ‌ట్టి జాగ్ర‌త్త ప‌డ‌తారు. అయితే, ఏపీ సీఎం జ‌గ‌న్ వ్య‌వ‌హారాన్ని చూస్తే అతి జాగ్ర‌త్త క‌నిపిస్తోంద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయ‌న న‌రసాపురంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌కోసం రోడ్డుకు ఇరువైపులా గంట‌ల త‌ర‌బ‌డి వేచి ఉన్న ప్ర‌జ‌ల‌ను క‌నీసం ప‌న్నెత్తి ప‌ల‌క‌రించ‌లేదు. అంతేకాదు.. అతి పెద్ద బ‌స్సులో ఫ్రంట్ కూర్చుని అతి చిన్న అద్దంలోనే చిరున‌వ్వులు చిందిస్తూ.. ఎత్తిన …

Read More »

జ‌గ‌న్ స‌భ‌లో మ‌హిళ‌ల‌ చున్నీలు తీయించేసిన పోలీసులు

ఏపీ సీఎం జగన్ తాజాగా న‌ర‌సాపురంలో ప‌ర్య‌టించారు. మ‌త్స్యకార దినోత్స‌వం సంద‌ర్భంగా ఇక్క‌డ ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాల‌కు శంకు స్థాప‌న చేశారు. అయితే, ఈ సభలో మహిళలకు తీవ్ర అవమానం జరిగింది. నల్ల చున్నీలు ధరించివచ్చిన మహిళలను గేట్‌ వద్దే ఆపేశారు. వారి చున్నీలను బలవంతంగా తీయించివేశారు. దీనిపై మహిళలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. పోలీసులు చర్యను ప్రతిఘటించారు. అయినప్పటికీ పోలీసులు ససేమిరా అంటూ పోలీసులు తమ మాటనే నెగ్గించుకున్నారు. …

Read More »

కుటుంబ రాజకీయాల‌కు వ్య‌తిరేకం అంటూనే.. బీజేపీ నిర్వాకం ఇదీ!

బీజేపీ నాయ‌కులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటీవ‌ల కాలంలో కుటుంబ రాజ‌కీయాల‌ను త‌రిమి కొట్టాలి.. మేం కుటుంబ రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకం అంటూ కామెంట్లు చేస్తున్న విష‌యం తెలిసిందే. పాపం.. సామాన్యులు న‌మ్మేసి ఉంటారు. కానీ, ఇదే బీజేపీ గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో ఏం చేస్తోందంటే.. ఈ శ్రీరంగ నీతుల‌కు యూట‌ర్న్ ఇచ్చి.. అక్క‌డ వార‌సుల‌కు టికెట్లు ప్ర‌క‌టించింది. ఒక‌టి అరా అయితే, ఎవ‌రూ ప‌ట్టించుకోరు. ఏకంగా తొలిద‌శ ఎన్నిక‌ల్లో ఏడు స్థానాలు, …

Read More »

ఎమ్మ‌ల్యేను త‌రిమి కొట్టిన జ‌నాలు

దేశంలోనే కాదు, ప్ర‌పంచంలో ఎక్క‌డ ఏ ఘ‌ట‌న జ‌రిగినా అది ఆస‌క్తి అనుకుంటే నెటిజ‌న్లు నిర్మొహ‌మాటంగా త‌మ అభిప్రాయం వెల్ల‌డిస్తున్నారు. చేతిలో సెల్ ఫోన్ ఉండ‌డం, డిజిట‌ల్ మీడియా విస్తృతంగా అందుబాటులోకి రావ‌డంతో ఇప్పుడు ప్ర‌జ‌ల స్పంద‌న గ‌తంలో మాదిరిగా కాకుండా ఓ రేంజ్‌లో ఉంది. తాజాగా క‌ర్ణాట‌క‌లో ఓ ఎమ్మెల్యేను ప్ర‌జ‌లు త‌రిమి త‌రిమి కొట్టారు. ఎన్నాళ్లుగానో తాముఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను స‌ద‌రు ఎమ్మెల్యే ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆగ్ర‌హించిన జ‌నాలు.. …

Read More »

మెగాస్టార్‌కు.. మోడీ గేలం మామూలుగా లేదుగా!

ఔను! రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు, ముఖ్యంగా బీజేపీలో ఉన్న ఇప్ప‌టి త‌రం నేతలు ఏంచేశార‌న్నా.. వారికి అర్ధం ప‌ర‌మార్థం ద‌క్క‌కుండా ఏదీ చేయ‌రు. అది ఏదైనా కావొచ్చు. అటు పార్టీకి, లేదా వారికి ఉపయో గం ఉంటుందంటేనే అడుగుతీసి అడుగు వేస్తారు. ఇప్పుడు మెగాస్టార్ విష‌యంలోనూ అదే జ‌రుగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం చిరంజీవి రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల కాంగ్రెస్ స‌భ్య‌త్వాన్ని పున‌రుద్ద‌రించుకోవాల‌ని సూచించినా ఆయ‌న ప‌ట్టించుకోలేదు. …

Read More »

జగన్ పై ఫైర్ అయిన సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉన్న‌ది ప్ర‌జాప్ర‌భుత్వ‌మేనా? ఇంకేమైనా ఉందా? అని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో కార్మికులు, ప్రజా సమస్యలను ప్ర‌శ్నిస్తున్న వారిపైనా, నిర‌స‌న తెలుపుతున్న వారిపైనా తీవ్ర‌స్థాయిలో నిర్బంధ కాండ కొన‌సాగుతోంద‌ని, దీనిని చూస్తుంటే ఏపీలో ఉన్న‌ది ప్రజా ప్రభుత్వమేనా? అన్న అనుమానంగా ఉందని అన్నారు. తిరుపతిలో సిఐటియు ఆధ్వర్యంలో “ప్రజా ఉద్యమాలు-నిర్బంధం”పై రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ …

Read More »

చెప్ప‌కుండా బ‌య‌ట‌కు వెళ్లింద‌ని కూతురిని చంపేసి..

క‌న్న‌కూతురుపై అమానుషంగా ప్ర‌వ‌ర్తించాడు ఓ తండ్రి. తనకు చెప్పకుండా బయటికి వెళ్లిందనే కోపంతో క‌న్న పేగును హతమార్చాడు. అనంతరం కుమార్తె మృతదేహాన్ని ట్రాలీ బ్యాగులో పెట్టి ఉత్తర్ప్రదేశ్ మథురలోని ఓ రోడ్డు పక్కన పడేశాడు. పోలీసులు దర్యాప్తులో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. ఉత్తర్ప్రదేశ్ మథురలో పరువు హత్య కలకలం రేపింది. ట్రాలీ బ్యాగులో 21 ఏళ్ల యువతి మృతదేహం కనిపించడం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. నవంబరు 17న జరిగిన …

Read More »

ఏసేశాడు.. జ‌గ‌న్ ఫుల్‌ గా ఏసేశాడు.. !

ఏసేశాడు.. జ‌గ‌న్‌.. బాగా ఏసేశాడు! ఇదీ.. ఇప్పుడు హాట్ టాపిక్ . తాజాగా టీడీపీ డిసెంబ‌రు 1 నుంచి ప్ర‌తిష్టా త్మ‌కంగా ప్రారంభించాల‌ని భావిస్తున్న ‘ఇదేం ఖ‌ర్మ‌’ కార్య‌క్ర‌మాన్ని జ‌గ‌న్ ఆడేసుకున్నారు. తాజాగా న‌ర‌సాపురం ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మ‌త్స్య‌కారుల‌కు సంబంధించిన ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించిన జ‌గ‌న్ అనంత‌రం.. జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌ పై విరుచుకుప‌డ్డారు. …

Read More »

జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న అంటే మామూలుగా వుండదు మరి

ఏపీ సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న అంటేనే ప్ర‌జ‌లు బెంబేలెత్తుతున్నారు. ప్ర‌తిప‌క్షాలేమో.. ఆయన తాడేప‌ల్లి ప్యాలెస్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. దీంతో సీఎం జ‌గ‌న్ ఏదో ఒక కార్య‌క్ర‌మం పెట్టుకుని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నారు. అయితే, ఈ ప‌ర్య‌ట‌న‌ల‌తో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీఎం స‌ర్ వ‌స్తున్నారంటే చాలు.. దుకాణాలు బంద్‌, ర‌హ‌దారులు బంద్‌, హోట‌ళ్లు బంద్‌, చివ‌ర‌కు పాఠ‌శాల‌ల‌కు కూడా తాళాలు వేసేస్తున్నారు. తాజాగా …

Read More »

ఆ హత్య వెనుక డేటింగ్ యాప్

పేర్లు వినడానికి ఆహ్లాదంగా ఉన్నా డేటింగ్ యాప్స్ ప్రాణాంతకంగా తయారవుతున్నాయి. డేటింగ్స్ యాప్స్ అనర్థాలకు కూడా దారితీస్తున్నాయి. అత్యాచారాలు, హత్యలు, ఆత్మహత్యలు, నేరాలకు కారణమవుతున్నాయి. తొలుత సమ్మోహనం.. తర్వాత వెగటు… చివరకు నేరమన్నట్లుగా డేటింగ్స్ యాప్స్ పరిచయాలు విషాదాంతమవుతున్నాయి.. బంబుల్ తో శ్రద్ధాకు పరిచయమైన అఫ్తాబ్ ఢిల్లీలో తీవ్ర సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ హత్య కేసుకు….. ఒక డేటింగ్ యాప్ కు ఉన్న లింకు తర్వాత బయటపడింది. బంబుల్ …

Read More »

జ‌న‌సేన‌ను డిక్టేట్ చేస్తున్న బీజేపీ?

ఏపీలో చిత్ర‌మైన రాజ‌కీయాలు తెర‌మీద‌కి వ‌చ్చాయి. ప్ర‌శ్నిస్తానంటూ పార్టీ పెట్టిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇప్పుడు ప్ర‌శ్న‌ల చిక్కుల్లో చిక్కుకుపోయారు. ఎందుకంటే.. పార్టీ పెట్టుకున్న‌ది ఆయ‌న‌.. పార్టీని బ‌లోపేతం చేస్తున్న‌ది ఆయ‌న‌.. కానీ, పార్టీని, ఆయ‌న‌ను కూడా బీజేపీ న‌డిపిస్తోందా? అనేలా ఆ పార్టీ నాయ కులు ప్ర‌య‌త్నించ‌డం.. ప్ర‌వ‌ర్తించ‌డం కూడా ఇప్పుడు ఆశ్చ‌ర్యంగా మారింది. దీనిపై చ‌ర్చ కూడా సాగుతోంది. అస‌లు జ‌న‌సేనతో బీజేపీకి ఉన్న సంబంధం …

Read More »