‘నేను 2008లో తొలిసారి రామోజీరావు గారిని కలిశాను. రామోజీ రావు ఎప్పుడూ ప్రజా సంక్షేమం కోణంలోనే మాట్లాడేవారు. ఆయన మాట్లాడే విధానం నన్ను చాలా ఆకర్షించింది. రామోజీరావు మాటల్లో జర్నలిజం విలువలే తనకు కనిపించాయి. పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో రామోజీ వివరించారు’ అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్తుచేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీ సంస్మరణ సభకు ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి రామోజీరావు రాజీలేని పోరాటం చేశారని, ప్రభుత్వంలో ఏం జరిగినా ప్రజలకు తెలియాలని రామోజీరావు అనే వారని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజా సమస్యల గురించే పత్రికలో రాసేవారని పవన్ అన్నారు. రాజధాని అమరావతిలో రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ ఆ సందర్భంగా సూచించారు.
పత్రికా స్వేచ్చ ఎంత అవసరమో రామోజీరావు ఎప్పుడూ చెప్పేవారు, ఎన్ని కష్టాలు, నష్టాలు ఎదురైనా ఆయన జర్నలిజం విలువలను వదల్లేదు అని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates