రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంగళవారం ఉదయం నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. తెల్లవారు జామునే రంగంలోకి దిగిన ఐటీ అధికారులు కీలకనాయకులు, వ్యాపార వేత్తల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు ప్రారంభించాయి. వీటిలో ఏపీ అధికార పార్టీ నేతలు వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ లు కూడా ఉండడంతో రాజకీయంగా కూడా ఈ దాడులు చర్చకు దారితీశాయి. రెండు రాష్ట్రాల్లోనూ 36 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. …
Read More »ఏపీ రాజకీయాల్లో ‘వెంట్రుక’ లాగిజమ్!
ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతల్లో ప్రస్టేషన్ బాగా పెరిగిపోతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు చేసే సమయంలో పార్టీల అధినేతల మొదలు కింది స్థాయి చోటామోటా నాయకుల వరకు కొన్ని సార్లు బూతు పురాణం అందుకుంటున్నారు. కొంతమంది నేతలైతే వారు మాట్లాడే భాష వినాలంటే చెవులు మూసుకోవాల్సి వస్తోంది. అంతగా నేతలు తమ ప్రత్యర్థులపైన మాట్లాడే సమయంలో కంట్రోల్ తప్పుతున్నారు. ఒకప్పుడు ఒక చిన్న పరుష పదజాలం అనాలంటే …
Read More »చంద్రబాబు బిగ్ స్టెప్… టీడీపీ ఎంపీలతో రాజీనామాలు?
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, విపక్షాలు రెండూ ఎత్తుల మీద ఎత్తులు వేస్తున్నాయి. ఒకరి వైఫల్యాలను మరొకరు ఫుల్లుగా ఓట్లుగా మలచుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఆ క్రమంలోనే టీడీపీ అధినేత బిగ్ స్టెప్ వేస్తున్నట్లు సమాచారం. డిసెంబరు 7 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు ఢిల్లీలో ల్యాండయిన చంద్రబాబు రానున్న సమావేశాలను రాజకీయంగా వాడుకోవాలని మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. 2019లో …
Read More »గుజరాత్ పీఠంపై కమల వికాసం.. ఎగ్జిట్ పోల్స్ ఇవే
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ హవానే కొనసాగనుందా? తిరిగి అదికార పీఠంపై కమల వికాసం జరగనుందా? అంటే.. ఔననే అంటున్నారు ఎగ్జిల్ పోల్స్ నిర్వాహకులు తాజాగా సోమవారం రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన గంటలోనే ఇక్కడ ఎవరు పాగా వేస్తున్నారనే విషయంపై ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఎగ్జిట్ పోల్ నిర్వహించిన మెజార్టీ సంస్థల అంచనాల ప్రకారం.. గుజరాత్లో బీజేపీ మరోసారి అధికారంలోకి రానుంది. ప్రజలు …
Read More »టాలీవుడ్ కి ఏపీ మంత్రి అల్టిమేటం !
ఆంధ్రప్రదేశ్లో అటు ఇటుగా ఒక ఏడాది వ్యవధిలో ఎన్నికలు జరుగుతాయన్న అంచనాతో ఉన్నారు రాజకీయ పరిశీలకులు. ఈసారి ‘రాజధాని’ ఎన్నికల అంశంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గత ఎన్నికలకు ముందు రాజధానిగా అమరావతికి పూర్తి మద్దతు పలికి.. ఆ తర్వాత పూర్తిగా స్టాండ్ మార్చేసిన జగన్ అండ్ కో.. మూడు రాజధానుల పాట అందుకుని దాని చుట్టూ రాజకీయాన్ని రక్తి కట్టించే ప్రయత్నం చేస్తోంది. అటు ఉత్తరాంధ్ర జనాలను.. ఇటు రాయలసీమ …
Read More »గర్జన సభలో జగన్ బదులు చంద్రబాబు!
ఏపీ అధికార పార్టీ వైసీపీ ప్రతిష్టాత్మకంగా భావించిన రాయలసీమ గర్జన సభ సక్సెస్ అయిందా.. ఫెయిల్ అయిందా.. అనే విషయాలను పక్కన పెడితే.. దీనిలో కొన్ని ఆసక్తికర పరిణామాలు అందునా వైసీపీ నేతలకు తల బొప్పికట్టే సంగతులు చోటు చేసుకున్నాయి. దీంతో వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయింది. భారీ ఎత్తున సభకు జనాలను తరలించినా వైసీపీ నేతలకు మనశ్శాంతి లేకుండా పోయింది. పాపం.. ఎన్నో సొమ్ములు ఖర్చు చేసి.. …
Read More »అలా మాట్లాడటం వల్ల పార్టీకి నష్టమా…? లాభమా… ?
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్మొహమాటంగా మాట్లాడతారు. నిజాల్ని నిర్భయంగా ఒప్పుకుంటారు. ఈమధ్య హైద్రాబాద్ లో సీఏ విద్యార్థులతో నిర్వహించిన సెమినార్ లో ” నేనో ఫెయిల్యూర్ పొలిటీషియన్ని” అనేశారు. ఆ తర్వాత విజయం కోసం పోరాడతాను అని దానికి కంటిన్యుటీ ఇచ్చారు కానీ.. అక్కడ “ఫెయిల్యూర్ పొలిటీషయన్” అనే పదమే హైలైట్ అయింది. ఇప్పుడే కాదు గతంలో కూడా పవన్ ఇలా నిజాయితీగా మాట్లాడిన సందర్భాలు చాలానే …
Read More »బాబు బ్యాలెన్స్ తప్పుతున్నారా..?
నాలుగు దశాబ్దాల సుధీర్ఘ రాజకీయ అనుభవం.. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత.. విజన్ 2020 ప్రణాళికను రూపొందిం చిన మేథావి.. టెక్నాలజీని కొత్తపుంతలు తొక్కించిన సవ్యసాచి… ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గొప్పతనాలు చాలానే ఉన్నాయి. అలాంటి సీనియర్ పొలిటీషియన్ ప్రవర్తనపై ఈమధ్య అనుమానాలొస్తున్నాయి. మారిన బాబు బిహేవియర్ గురించి సమాన్య జనాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చ నడుస్తోంది. అసలేం జరుగుతుంది..? చంద్రబాబు ఎందుకలా …
Read More »ఎన్నికల వేళ.. మోడీ విన్యాసాలు
అత్యంత కీలకమైన ఎన్నికలు. గుజరాత్ పీఠం ఎవరిదో తేల్చేసే పోలింగ్ జరుగుతున్న వేళ… ప్రధాని మోడీ చేసిన విన్యాసం అనేక విమర్శలకు దారితీస్తోంది. గుజరాత్ రెండో దశలో 93 నియోజకవర్గాలకు ఈ రోజు ఉదయం పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం గుజరాత్ అదికారాన్ని ప్రజలు ఎవరికి, ఏ పార్టీకి దక్కించాలో ఈ ఎన్నికల్లోనే తేలిపోనుంది. అయితే, ఈ ఎన్నికల్లో మరో కీలక విషయం ఏంటంటే.. పటల్ వర్గానికి చెందిన బలమైన …
Read More »నువ్వా-నేనా.. నిలిచేదెవరు.. గెలిచేదెవరు?
వచ్చే ఎన్నికలకు సంబంధించి ఏపీలో పొలిటికల్ మ్యాచ్ జోరుగా సాగుతోంది. క్రికెట్లో సెమీస్ మాదిరిగా.. రాజకీయంగా కూడా ఏపీలో సెమీస్లోకి అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీలు చేరిపోయాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అధికార పార్టీ.. రెండు కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఒకటి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా.. ప్రజలను కలిసేలా.. నేతలను సీఎం జగన్ …
Read More »బీజేపీ అలా.. జీవీఎల్ ఇలా.. వాటీజ్ దిస్ బాస్!!
కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఒక విధంగా వ్యవహరిస్తుంటే.. రాష్ట్రంలోని కీలక నాయకుడు జీవీఎల్ నరసింహారావు మాత్రం తన రూటే సెపరేటు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇటీవల ఓ సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు బాగా జరిగాయని, కానీ, తాను ఆనాడు చూడలేక పోయానని అన్నారు. దీనికి కారణం.. అప్పట్లో కేంద్ర జల శక్తి …
Read More »మా ప్రభుత్వాన్ని పడగొడతామన్నోళ్లను బొక్కలో ఏశాం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నవారిని ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇటీవల మునుగోడు ఎన్నికల సమయంలో తామంతా ఎన్నికల హడావుడిలో ఉన్న సమయంలో దొడ్డిదారిలో వచ్చి.. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొందరు ప్రయత్నించారని ఆయన చెప్పారు. అయితే, వాళ్లందరినీ అరెస్టులు చేసి జైళ్లకు తరలించిబొక్కలో చిప్ప కూడు తినిపిస్తున్నామని వ్యాఖ్యానించారు. మహబూబ్ నగర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న …
Read More »