Political News

పార్టీల్లో పెరుగుతున్న టెన్షన్

ఎన్నికలంటేనే చిత్ర, విచిత్రమైన పరిస్దితులుంటాయి. భారీ పోలింగ్ జరిగినా సమస్యే, పోలింగ్ చాలా తక్కువగా జరిగినా సమస్యే. మొదటి దశ పోలింగ్ తర్వాత పశ్చిమబెంగాల్లో రాజకీయపార్టీలన్నింటిదీ ఇదే పరిస్ధితిగా తయారైంది. శనివారం బెంగాల్లోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొదటిదశ పోలింగ్ జరిగింది. కడపటి సమాచారం అందే సమయానికి దాదాపు 80 శాతం ఓటింగ్ జరిగింది. అంటే మామూలు పరిస్ధితుల్లో అయితే జరిగిన పోలింగ్ బాగా ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే అధికార …

Read More »

ఆర్కే మాటలు వింటే.. ‘అల వైకుంఠపురం’ సీన్ గుర్తుకు వస్తుంది

ఏడాది క్రితం వచ్చిన సూపర్ హిట్ మూవీ అల వైకుంఠపురం సినిమాను అంత త్వరగా మర్చిపోలేం. అందులో.. హీరో తండ్రి కంపెనీ మీద కన్నేసిన ఒక పోర్టు యజమాని.. ఎంతలా భయపెడతారో.. కంపెనీని సొంతం చేసుకోవటానికి ఎంత వరకు వెళతాడో చూసిందే. అంతలా కాకున్నా.. రక్తం చిందకుండానే మాటలతోనో.. చేతల్లో ఉన్న పవర్ తోనో సొంతం చేసుకుంటున్న వైనం ఈ మధ్యన ఎక్కువ అవుతుందా? అంటే… అవునన్న మాటను చెబుతున్నారు …

Read More »

ఎంఎల్ఏని చితక్కొట్టేసిన రైతులు

మూడు వ్యవసాయ చట్టాల రద్దుకోసం చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారుతోందా ? క్షేత్రస్ధాయిలో తాజాగా జరిగిన ఘటన చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. పంజాబ్ లో బీజేపీ ఎంఎల్ఏపై రైతులు దాడిచేసి బాగా కొట్టారు. అంతేకాకుండా ఆయన బట్టలను చీలికలు పీలికలుగా చించేయటం సంచలనంగా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే కేంద్రం రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుసంఘాలు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. చిన్న ఆందోళనగా మొదలైన …

Read More »

మా నాయ‌కుడికి టైం క‌లిసి రావ‌డం లేదు

ఔను! ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఇదే మాట వినిపిస్తోంది. “మా నాయ‌కుడికి టైం క‌లిసి రావ‌డం లేదు”.. -ఇదే మాట సీనియ‌ర్ల నుంచి జూనియ‌ర్ల వ‌ర‌కు వినిపిస్తోం ది. వ‌రుస‌గా జ‌రుగుతున్న ప‌రిణామాల‌తో వైసీపీ నేత‌లు ఉక్కిరిబిక్కిరికి గుర‌వుతున్నారు. ఓ వైపు.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం న‌మోదు చేశాం.. ప్ర‌జ‌లంతా త‌మ వెంటే ఉన్నార‌ని నాయ‌కులు మురిసిపోతూ.. తాము చేయాల‌ని అనుకున్న ప‌నుల‌ను ఒక్కొక్కటిగా.. …

Read More »

సైన్యం రెచ్చిపోయింది..114 మంది చనిపోయారు

మయున్మార్లో సైన్యం రెచ్చిపోయింది. సైనికపాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజాందోళన చివరకు హింసాత్మకంగా మారిపోయింది. ప్రజలకు, సైన్యానికి మధ్య జరిగిన ఘర్షణ చివరకు తారాస్ధాయికి చేరుకున్నది. సహనం కోల్పోయిన సైన్యం జరిపిన కాల్పుల్లో 114 మంది మరణించటం అంతర్జాతీయస్ధాయిలో సంచలనంగా మారింది. సైన్యం కాల్పుల్లో ఇంతమంది ఒకేరోజు చనిపోవటం బహుశా ఇటీవల కాలంలో ఇదే అతిపెద్ద హింసా ఘటనగా చెప్పుకుంటున్నారు. చాలా కాలంగా మయున్మార్ సైనికపాలనలోన మగ్గుతోంది. జరిగిన ఎన్నికలను కూడా …

Read More »

జగన్ ఆశలపై నీళ్ళు

ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగ ఏర్పాటు చేయాలన్న జగన్మోహన్ రెడ్డి ఆశలపై నీళ్ళు చల్లినట్లయ్యింది. కనీసం మరో ఏడాదిపాటు కొత్త జిల్లాల ఏర్పాటుకు నిరీక్షణ తప్పేట్లులేదు. దీనికి కారణం ఏమిటంటే భారత రిజిస్ట్రార్ కార్యాలయం జారీచేసిన నిబంధనలే. దేశవ్యాప్తంగా జనగణన జరిగేంతవరకు ఇపుడున్న జిల్లాల భౌతిక సరిహద్దులు మార్చవద్దని రిజిస్ట్రార్ కార్యాలయం దేశవ్యాప్తంగా అన్నీ రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. నిజానికి జనగణన దాదాపు ఏడాది క్రిందటే మొదవ్వాల్సింది. అయితే …

Read More »

విషాదం.. బద్వేలు వైసీపీ ఎమ్మెల్యే కన్నుమూత

అనుకోని విషాదం ఎదురైంది. ఈ రోజు (ఆదివారం) ఉదయం కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే 62 ఏళ్ల డాక్టర్ వెంకట సుబ్బయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన ఇటీవల హైదరాబాద్ లో చికిత్స తీసుకొని కడపకు చేరుకున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ చురుకుగా పాల్గొన్నారు. అయితే.. మరోసారి అనారోగ్యానికి గురైన ఆయన కొద్దిరోజులుగా కడపలోని అరుణాచలం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు …

Read More »

టీఆర్ఎస్ వ్యూహం..కాంగ్రెస్‌ను తొక్కేయ‌డ‌మే ల‌క్ష్య‌మా?

KCR

ఇటీవ‌ల కాలంలో ఎన్న‌డూ లేనంత‌గా.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. మాజీ ప్ర‌ధాని దివంగ‌త పీవీ న‌ర‌సింహారావు భ‌జ‌న‌లో మునిగితేలుతున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పీవీ శ‌త‌జ‌యంతి వేడుక‌ల‌ను రాష్ట్ర పండుగ‌లా నిర్వ‌హిస్తున్న ఆయ‌న‌.. ఇటీవ‌ల పీవీ కుమార్తె సుర‌భి వాణీదేవికి.. ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వ‌డంతోపాటు.. గెలిపించుకున్నారు. అయితే.. పీవీ వ్య‌వ‌హారంలో కేసీఆర్ ఇంత‌టితో ఆగిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. మ‌రిన్ని మేళ్లు చేయ‌డం ద్వారా.. తెలంగాణ‌లో ముఖ్యంగా.. ప‌లు కీల‌క జిల్లాల్లోను, …

Read More »

షర్మిలపై కేసు ఉపసంహరణకు టీ సర్కారు సిద్ధం!

అనూహ్య పరిణామాలకు వేదిక అవుతోంది తెలంగాణ రాష్ట్రం. కలలో కూడా ఊహించని రీతిలో దివంగత మహానేత వైఎస్ కుమార్తె వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధం కావటం ఒక సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆమె కొత్త పార్టీ వెనుక టీఆర్ఎస్.. బీజేపీలు ఉన్నాయన్న మాట బలంగా వినిపిస్తోంది. అలాంటిదేమీ లేదని.. అవన్నీ ఉత్త మాటలుగా షర్మిల ఖండిస్తున్నారు. ఆ ప్రచారాన్ని నమ్మొద్దని ఆమె ఒకటికి నాలుగుసార్లు చెబుతున్నారు. …

Read More »

ఏపీ సీన్ రివ‌ర్స్‌.. హీటెక్కిస్తున్న‌ కేసీఆర్ కామెంట్లు

ఈ విష‌యంపై చ‌ర్చించే ముందు.. కొంచెం లోతుగా ప‌రిశీలించాల్సి.. ఈ క్ర‌మంలో అస‌లు ఇప్పుడున్న ప‌రిస్థితికి.. కొన్నాళ్ల కింద‌ట‌కి ఏం జ‌రిగిందో చూద్దాం..రెండేళ్ల కింద‌ట‌:హైద‌రాబాద్ నుంచి వ‌చ్చే పారిశ్రామిక వేత్త‌లు, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల‌తో గుంటూరు, విజ‌య‌వాడ‌, రాజ‌మండ్రి, విశాఖ హోట‌ళ్లు కిట‌కిట‌లాడాయి. ఎక్క‌డ చూసినా.. భూముల ధ‌ర‌ల‌కు రెక్క‌లు వ‌చ్చాయి. ఎవ‌రిని క‌దిలించినా.. మా భూమికి మంచి ధ‌ర వ‌చ్చిందండి! అనే మాట త‌ప్ప‌.. మేం న‌ష్ట‌పోయాం అనే …

Read More »

రంగంలోకి సీబీఎన్ ఆర్మీ..

తిరుప‌తి ఉప ఎన్నిక‌ను టీడీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్క‌డం ద్వారా పార్టీలో నెల‌కొన్న నైరాశ్యాన్ని పార‌దోలాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన పంచాయ‌తీ, స్థానిక‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో పార్టీకి ఎదురు దెబ్బలు త‌గిలాయి. అయితే.. వీటి నుంచి వెంట‌నే కోలుకున్న పార్టీ అధిష్టానం.. ఓట‌మికి దారితీసిన ప‌రిస్థితుల‌పై యుద్ధ ప్రాతిప ‌దిక‌న చ‌ర్చించి.. వెంట‌నే వ్యూహాల‌కు రెడీ అయింది. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ ఆయా …

Read More »

జ‌గ‌న్ వ్యూహానికి గ‌వ‌ర్న‌ర్ అడ్డుక‌ట్ట‌!

రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ నియామ‌కానికి సంబంధించి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వ్యూహానికి భారీ ఎదురు దెబ్బ త‌గిలింద‌ని తెలుస్తోంది. ఈ విష‌యంలో గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ తీసుకున్న నిర్ణ‌యం.. సీఎం జ‌గ‌న్ చేసిన సిఫార‌సుకు మ‌ధ్య వైరుధ్యం స్ప‌ష్టం గా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం జ‌గ‌న్ తీసుకుంటున్న ఏ నిర్ణ‌య‌మైనా.. ఎన్నిక‌ల‌తో ముడిప‌డి ఉంటున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ వేసే ప్ర‌తి అడుగు కూడా ఎన్నిక‌ల కోణంలోనే ఉంటోంద‌న్న విష‌యం …

Read More »