కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలన ప్రారంభించి 11 ఏళ్లు అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే రాజ్యాంగ బద్ధమైన సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) శనివారం సంచలన నివేదికను విడుదల చేసింది. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన 10 సంవత్సరాల్లో దేశంలో అప్పులు ఏ విధంగా పెరిగిపోయాయో పూస గుచ్చినట్టు వివరించింది. అంతేకాదు.. 2014 …
Read More »వైసీపీ నేత పిన్నెల్లికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్!
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి గురించి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిందే. గత ఎన్నికల సమయంలో బ్యాలెట్ బాక్సులను నేలకు విసిరికొట్టి.. పోలింగ్ బూత్‌లో అరాచకం సృష్టించిన కేసులో ఆయన ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. మాచర్ల నియోజకవర్గం నుంచి ఐదు సార్లు విజయం దక్కించుకున్న పిన్నెల్లి.. ఒక దశలో చెలరేగిపోయారు. అయితే.. తాజాగా ఈ నియోజకవర్గంలో పర్యటించిన సీఎం చంద్రబాబు.. పిన్నెల్లి కేంద్రంగా గట్టి వార్నింగ్ …
Read More »శ్రీవారి పరకామణి: మరో రాజకీయ వివాదం!
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు అనేక వ్యయప్రయాసలకు ఓర్చుకుని వచ్చే భక్తులు తమ శక్తి కొలది స్వామికి మొక్కులు చెల్లించుకుంటారు. దీనిలో కీలకమైంది ఆర్థిక మొక్కు. ఎంత కటికపేద వాడైనా శ్రీవారిని దర్శించుకున్నాక పరకామణి (శ్రీవారికి నగదు కానుకలు ఇచ్చే చోటు)ని చూడకుండా, దానిలో కనీసం రూపాయి అయినా వేయకుండా కొండ దిగడు. ఇక శ్రీమంతుల సంగతే చెప్పనక్కర్లేదు. కోట్లకు కోట్ల కానుకలు శ్రీవారికి సమర్పించుకుంటారు. …
Read More »‘నిన్నే తెలియదని చెప్పా.. మళ్లీ అడుగుతారెందుకు’
వైసీపీ నాయకుడు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని వరుసగా రెండో రోజూ ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విజయవాడలో విచారించారు. రాజమండ్రి జైలులో ఉన్న మిథున్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. నిజానికి శుక్రవారం కూడా మిథున్ రెడ్డిని విచారించారు. రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న అధికారులు వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన పలు అంశాలపై ఆరాతీశారు. ప్రధానంగా డిస్టిలరీలకు నిధుల టార్గెట్ పెట్టడం, కమిషన్లను …
Read More »‘రాజకీయాల్లో తొక్కుకుంటూ ఎదగాల్సిందే’
బీఆర్ఎస్కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎదగాలంటే ఎవరిపైనో ఆధారపడాల్సిన అవసరం లేదని, ఆధారపడినా ఎవరూ ప్రోత్సాహం ఇవ్వరని చెప్పారు. రాజకీయాల్లో పైకి రావాలంటే పరిస్థితులను తట్టుకుని కాదు, వాటిని తోసుకుంటూ, అవరోధాలను తొక్కకుంటూ పైకి రావాలన్నారు. అయితే, ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారన్న విషయంపై క్లారిటీ లేదు. కానీ బీఆర్ఎస్తో ఉన్న విభేదాల నేపథ్యంలోనే ఈ …
Read More »బాబు మార్క్ సంక్షేమం.. పశువులకూ హాస్టళ్లు
నిజమే… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంక్షేమంలో తనదైన ప్రత్యేకతను చాటుతున్నారు. గతంలో పాలనా సంస్కరణలు, పాలనలో సాంకేతికత వినియోగం, ప్రజల వద్దకే పాలన తదితర అంశాలపై దృష్టి సారించిన చంద్రబాబు… ఈ దఫా కూటమి సర్కారులో సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. సూపర్ సిక్స్ పేరిట ఇచ్చిన హామీలను ఇప్పటికే అమలు చేస్తున్న బాబు…పీ4 పేరిట పేదల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించి అందరినీ ఔరా …
Read More »స్థానిక ఎన్నికలపై రేవంత్ వెనకడుగు.. రీజనేంటి?
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై నిన్న మొన్నటివరకు హడావుడి చేసిన సీఎం రేవంత్ రెడ్డి అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూస్తామన్నారు. అయితే, సుప్రీంకోర్టు తీర్పు తాజా ఎన్నికలకు సంబంధం ఏమిటనేది ప్రశ్న. స్థానిక సంస్థల ఎన్నికలను 90 రోజుల్లో పూర్తి చేయాలని హైకోర్టు గడువు ఇచ్చింది. ఈ గడువు ఈ నెల 30తో ముగుస్తుంది. ఇప్పటికే స్థానిక అధికారులు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు …
Read More »21 అర్థరాత్రి కల్లా అమెరికా లోకి వెశ్శిపోవాలి
పాలన పరంగా పేరు తెచ్చుకున్న అమెరికా అధ్యక్షులు ఎంతో మంది ఉన్నారు. వారు తీసుకొచ్చిన సంస్కరణలతో ప్రపంచ దేశాలను మెప్పించిన వారు కూడా ఉన్నారు. కానీ, తమ నిర్ణయాలతో సంచలనాలకు వేదికగా మారిన వారు ఒకరే. జార్జ్ బుష్ తరువాత ఆ స్థానాన్ని ఆక్రమించిన ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పాలన ఎలా ఉన్నా, పరిస్థితి ఎలా ఉన్నా, తన నిర్ణయాలు దుందుడుకు చేష్టలతో అమెరికన్లకే కాకుండా ప్రపంచ దేశాలకు …
Read More »పెద్దిరెడ్డి.. జగన్‌ను పక్కన పెట్టేశారా?
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో సీనియర్ నాయకుడు. మాజీ మంత్రి. జగన్ పట్ల అత్యంత గౌరవం, మర్యాదలున్న నేత. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పనిచేశారు. మంత్రిగా కూడా వ్యవహరించారు. అంతేకాదు, వైఎస్ కుటుంబంతోనూ అవినాభావ సంబంధాలు ఉన్న నాయకుడు. జగన్ హయాంకు వచ్చినప్పటికీ ఆయన ప్రభావం ఏమీ తగ్గలేదు. అదే విధంగా కొనసాగింది. జగన్ కూడా తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఐదు సంవత్సరాలు …
Read More »వారిపై ‘అనర్హత వేటు’ వేయించండి: జగన్
వైసీపీ అధినేత జగన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పార్టీ తరఫున ఎమ్మెల్సీలుగా ఉండి.. తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్న ముగ్గురు అభ్యర్థులపై వేటు వేయించాలని ఆయన.. మాజీ మంత్రి, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణను ఆదేశించినట్టు తెలిసింది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని సోమవారమే మండలిలో ప్రవేశ పెట్టాలని.. వేటు వేయించే వరకు వదిలి పెట్టవద్దని కూడా తేల్చి చెప్పినట్టు తాడేపల్లి వర్గాలు తెలిపాయి. నిజానికి …
Read More »ఇంటి ఆడబిడ్డపై నలుగురు దాడి చేశారు: రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ, ఆ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన కవిత విషయంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఇంటి ఆడబిడ్డపై నలుగురు కలిసి దాడి చేశారు” అని అన్నారు. అయినా.. కవిత వ్యవహారం రాజకీయాలకు సంబంధించిన విషయం కాదన్న ఆయన, కేవలం కుటుంబం, ఆస్తికి సంబంధించిన విషయమేనని తేల్చి చెప్పారు. కుటుంబ వ్యవహారంతో రాష్ట్ర ప్రజలకు, ఇతర పార్టీలకు ఎలాంటి సంబంధం ఉండదని అన్నారు. …
Read More »అసెంబ్లీకి వెళ్తే… జగన్‌కు `మూడు` విధాల మేలు..!
రాజకీయాల్లో పట్టుదలలకు, పంతాలకు చోటు ఉండదు. ఎందుకంటే ప్రజా కోణంలో చూసినప్పుడు నాయకులు కొన్ని కొన్ని సందర్భాల్లో అవమానాలను ఎదురుకోవాలి. అదే సమయంలో విమర్శలు కూడా తట్టుకోవాలి. ఈ రెండిటికీ సిద్ధంగా లేనప్పుడు రాజకీయాల్లో ఉండడమే వేస్ట్. ఈ మాట వైసీపీ నాయకుల నుంచే వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం అసెంబ్లీకి వెళ్లకుండా జగన్ మారం చేయటం. అదే విధంగా తనకు సీఎంతో సమానంగా మైకు ఇవ్వాలని పట్టుబట్టడం. ఈ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates