Political News

వైసీపీ అప్పులే కాదు.. జ‌రిమానాలు కూడా క‌డుతున్నాం: చంద్ర‌బాబు

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన త‌ప్పుల కార‌ణంగా ప్ర‌జాధ‌నం వృథా అవుతోంద‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. వైసీపీ హ‌యాంలో అప్పులు చేశార‌ని, లెక్క ప‌త్రం కూడా లేకుండానే అప్పులు తెచ్చార‌ని ఆరోపించారు. అయితే.. ఈ అప్పుల సొమ్మును దేనికి ఖ‌ర్చు చేశారో కూడాతెలియ‌డం లేద‌న్నారు. ఎంత త‌వ్వినా.. అప్పులు వ‌స్తూనే ఉన్నాయ‌ని తెలిపారు. ఒక‌వైపు సంక్షేమం, మ‌రో వైపు అభివృద్ధిని అమ‌లు చేస్తూనే.. ఇంకోవైపు.. వైసీపీ చేసిన అప్పుల‌కు వ‌డ్డీలు క‌డుతున్నామ‌ని.. …

Read More »

చెప్ప‌డం తేలిక‌.. చేస్తే తెలుస్తుంది: ప‌వ‌న్ అస‌హ‌నం

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఎమ్మెల్యేల ప్ర‌శ్న‌లు, వారి సూచ‌న‌ల‌పై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. “చెప్ప‌డం తేలిక‌.. చేస్తే తెలుస్తుంది.. అధ్య‌క్షా!” అని వ్యాఖ్యానించారు. సుమారు 4 నిమిషాల త‌న స‌మాధానంలో ఆయ‌న ఆచి తూచి వ్య‌వ‌హ‌రించారు. తీవ్ర కోపాన్ని కూడా ఆయ‌న త‌గ్గించుకున్న‌ట్టు ప‌లు సంద‌ర్భాల్లో స్ప‌ష్టంగా క‌నిపించింది. “స‌భ్యులు అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని చెబుతున్నారు. అవి ఇప్పుడే వ‌చ్చాయా?” అని ఓ సంద‌ర్భంలో ప్ర‌శ్నించిన …

Read More »

వైసీపీ లేని లోటు తీర్చేస్తున్న త‌మ్ముళ్లు

ఏపీ అసెంబ్లీకి రావాల‌ని.. స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాల‌ని.. మాట్లాడేందుకు స‌మ‌యం ఇస్తామ‌ని చెప్పినా.. వైసీపీ నాయకులు, ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ మంకు ప‌ట్టుప‌ట్టి రాకుండా ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే.. విప‌క్షం లేని లోటును మ‌న వాళ్లే తీర్చాల‌న్న సీఎం చంద్ర‌బాబు సూచ‌న‌ల‌తో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ప్ర‌జ‌ల త‌ర ఫున గ‌ళం వినిపిస్తున్నారు. అనేక స‌మ‌స్య‌ల‌పై వారు స‌భ‌లో స్పందిస్తున్నారు. మంత్రుల‌ను సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు. ఈ క్రమంలో …

Read More »

అమ‌రావ‌తికి మ‌రిన్ని నిధులు: కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం

కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి సంబంధించి.. మ‌రిని నిధులు ఇప్పించేందుకు ముందుకు వ‌చ్చింది. అమరావతి నిర్మాణానికి వరల్డ్‌ బ్యాంక్‌, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌(ఏడీబీ) బ్యాంకుల నుంచి రుణం ఇప్పించేందుకు ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దీని ప్ర‌కారం.. అదనంగా రూ.14,200 కోట్ల రుణం పొందేందుకు అవ‌కాశం ఏర్ప‌డుతుంది. ఈ మేర‌కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అనుమతి ఇచ్చిన‌ట్టు సీఆర్ డీఏ(రాజ‌ధాని ప్రాంత సాధికార …

Read More »

కూట‌మి ప్ర‌భుత్వానికి ‘ఉల్లి’ ఉసురు ఖాయం: ష‌ర్మిల‌

ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కూట‌మి ప్ర‌భుత్వానికి ఉల్లి రైతుల ఉసురు త‌గులుతుంద‌ని ఆమె చెప్పుకొచ్చారు. ఉల్లి రైతులను నిండా ముంచేశారని, కూటమి ప్రభుత్వానికి ఉల్లి రైతుల ఉసురు తగలకపోద ని ష‌ర్మిల అన్నారు. రైతుల కంట కన్నీళ్ళు పెట్టించిన పాపం ముఖ్యమంత్రి చంద్రబాబుదేన‌న్నారు. ఉల్లి ఎండినా నష్టమే..ఇప్పుడు పండినా నష్టమే అన్న‌ట్టుగా ప్ర‌స్తుత ప‌రిస్థితి ఉంద‌ని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. ఎకరాకు రూ.1.20 లక్షల పెట్టుబడి …

Read More »

ఏపీ స‌భా ప‌ర్వం: వైసీపీ దెబ్బ‌తో ప్ర‌జారోగ్యం నాశ‌న‌మైంది!

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల రెండో రోజు శుక్ర‌వారం ప‌లు అంశాల‌పై స‌భ్యులు చ‌ర్చించారు. ప్ర‌ధానంగా ఆరోగ్యశ్రీని ప్రైవేటు ఆసుప‌త్రులు నిలిపివేయడంపై ప‌లువురు స‌భ్యులు ప్ర‌శ్నించారు. దీనిపై మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ను వారు ప్ర‌శ్నించగా ఆయన స్పందిస్తూ, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా రోగులకు సేవలు మరింత మెరుగుపడ్డాయని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో 2023-24లో 12,53,065 మంది రోగులు చికిత్స పొందగా, కూటమి ప్రభుత్వ హయాంలో 2024-25లో 13,42,673 …

Read More »

RRR మహిమ!…అసెంబ్లీలో అమ్మభాష కమ్మదనం!

అప్పుడెప్పుడో ఐదేళ్ల క్రితం నాటి సీఎం జగన్ సర్కారీ స్కూళ్లలో ఇంగ్లీష్ ను ప్రవేశపెడతామని ఓ ప్రకటన చేశారు. ఈ ప్రకటనను విపక్షాల కంటే ముందుగా జగన్ పార్టీ ఎంపీగా ఉండి మరీ ప్రస్తుత ఏపీ అసెంబ్లీ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు ఖండించారు. జగన్ నిర్ణయంతో రాజు గారు పూర్తిగా వైసీపీకి దూరయ్యారు. అయినా తెలుగుపై రాజు గారికి ఇంత ప్రేమ ఎందుకు? పదవులను పోగొట్టుకునే ప్రమాదం కొనితెచ్చుకోవడం అవసరమా? …

Read More »

టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్సీ.. ఆ పదవి కోసమేనా?

వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కొన్నాళ్ల కిందటే పార్టీకి రాజీనామా చేశారు. అదేసమయంలో ఆయన పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. అయితే అప్పటి నుంచి ఏ పార్టీలో చేరాలా అన్న ఆలోచన చేసిన ఆయన తాజాగా సైకిల్‌ను ఎంచుకున్నట్టుగా తెలిసింది. శుక్రవారం సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని మర్రి అనుచరులు చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్ వైఎస్ హయాం నుంచి కూడా …

Read More »

జీఎస్టీ సంస్క‌ర‌ణ‌ల‌ను ప్ర‌జ‌ల్లోకి నేనే తీసుకువెళ్తా: ప‌వ‌న్‌

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన జీఎస్టీ సంస్క‌ర‌ణ‌ల‌పై ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అసెంబ్లీలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంస్క‌ర‌ణ‌లు దేశాన్ని ముందుకు న‌డిపించ‌డంలోనూ.. విక‌సిత్ భార‌త్ ల‌క్ష్యాన్ని సాకారం చేయ‌డంలోనూ.. ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని పేర్కొన్నారు. ఈ సంస్క‌ర‌ణ‌లతో పేద‌లు.. మ‌ధ్య‌త‌ర‌గతి వ‌ర్గాల‌కు ఎంతో మేలు జ‌రుగుతుంద‌న్నారు. ప్ర‌స్తుతం ఉన్న నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల నుంచి దుస్తులు, గృహోప‌క‌ర‌ణాలైన టీవీలు, కంప్యూట‌ర్లు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మిష‌న్లు.. …

Read More »

వైసీపీ లిక్క‌ర్ స్కామ్‌ను ‘ఈడీ’కి అప్ప‌గించారా?

తాజాగా గురువారం మ‌ధ్యాహ్నం నుంచి ఓ సంచ‌ల‌న వార్త‌.. మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తోంది. ఏపీలో వైసీపీ పాల‌నా కాలంలో జ‌రిగిన‌ట్టు ప్ర‌స్తుత‌ ప్ర‌భుత్వం, అధికారులు పేర్కొంటున్న లిక్క‌ర్ కుంభ‌కోణంపై ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్(ఈడీ) అధికారులు పెద్ద ఎత్తున సోదాలు చేస్తున్నార‌నేది వార్త సారాంశం. తెలంగాణ‌, ఏపీ, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, ఢిల్లీల‌లో ఈ దాడులు జ‌రుగుతున్నాయి. అంటే.. దీనిని బ‌ట్టి.. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన‌ట్టు సర్కారు చెబుతున్న మ‌ద్యం కుంభ‌కోణం కేసు విచార‌ణ‌కు …

Read More »

మిథున్‌రెడ్డిని కొట్టకండి: కోర్టు ఆదేశం

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పోలీసుల క‌స్ట‌డీకి అప్ప‌గిస్తూ.. విజ‌య‌వాడ లోని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయ‌న‌ను రెండు రోజుల పాటు విచారించేందుకుఅనుమ‌తి ఇచ్చింది. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణం కేసులో కీల‌క నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి డిస్ట‌రీల నుంచి సొమ్ములు వ‌సూలు చేయ‌డంలోనూ.. టార్గెట్లు నిర్ణ‌యించ‌డంలోనూ ముఖ్య పాత్ర పోషించిన‌ట్టు ఈ కేసును విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు …

Read More »

జ‌గ‌న్ అసెంబ్లీకి రాకుంటే ఎవ‌రికి న‌ష్టం?

ప్ర‌జాప్ర‌తినిధులు బ‌య‌ట ఎన్ని మాట్లాడినా.. అసెంబ్లీలోను, పార్ల‌మెంటులోనూ మాట్లాడేదానికి ఒక విలువ‌.. ఒక రికార్డు ఉంటాయి. అంతేకాదు.. బ‌య‌ట ఎన్ని మాట్లాడినా ప్ర‌భుత్వం బుల్ డోజ్ చేయొచ్చు. కానీ.. అసెంబ్లీ, పార్ల‌మెంటులో మాట్లాడినా.. స‌భ్యులు ప్ర‌శ్న‌లు అడిగినా.. ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌మైన స‌మాధానం చెప్పి తీరుతుంది. ఎందుకంటే.. ఈ రెండు సంస్థ‌లు కూడా రాజ్యాంగ బ‌ద్ధం. సో.. అందుకే.. పార్ల‌మెంటు, అసెంబ్లీల‌కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది.. మ‌న రాజ్యాంగం. మ‌రి అలాంటి …

Read More »