వల్లభనేని వంశీపై మరో కేసు

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసుతో పాటు పలు కేసుల్లో ఆయన జైలుకు కూడా వెళ్లారు. అయితే, అనారోగ్య కారణాల నేపథ్యంలో వంశీకి అన్ని కేసుల్లో బెయిల్ లభించింది. అయితే, తాజాగా ఆయనపై మరో కేసు నమోదైంది.

విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ లో వంశీపై సునీల్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. గత ఏడాది జులైలో వంశీతోపాటు ఆయన అనుచరులు తనను బెదిరించి దాడికి పాల్పడ్డారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పలు సెక్షన్ల కింద వంశీతో సహా మరో ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

2023లో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి జరిగింది. వంశీతో పాటు ఆయన అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈ దాడిలో అప్పుడు టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్న సత్యవర్థన్ ఆ కేసులో ప్రధాన సాక్షిగా  ఉన్నారు. హర్షవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు ఆ కేసుకు కీలకంగా మారింది. దీంతో, సత్యవర్థన్ ను వంశీ, ఆయన అనుచరులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత హర్షవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.