పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన పాలన. అదే పని చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. పిఠాపురం కాలనీల్లో నడుచుకుంటూ వెళ్లి డ్రైనేజీ, చెత్త సమస్యలను స్వయంగా పరిశీలించారు. ప్రజలు చెప్పిన ఇబ్బందులను విని, వెంటనే పరిష్కారం కావాలని అధికారులకు స్పష్టం చేశారు. పిఠాపురంలో కాలనీల్లో పేరుకుపోయిన చెత్త, శుభ్రం కాని డ్రైనేజీ ప్రజల …
Read More »విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ తరహా వాతావరణం మరింత ఎక్కువగా ఉంటుంది. ఒకరు ఒకటంటే మరొకరు నాలుగంటారు. కానీ దీనికి భిన్నంగా మంత్రి నారా లోకేష్ మాత్రం తన పనితీరుతోనే విమర్శలకు సమాధానం చెబుతూ విమర్శకుల నోటికి తాళం వేస్తున్నారు. తాజాగా ఆయన ప్రతిష్టాత్మక వీక్ పత్రిక ముఖ చిత్ర కథనంలో మెరిసిన విషయం …
Read More »రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య గొడవలు, ఘర్షణలు లేకుండా తెలుగు వారు ప్రశాంతంగా జీవించాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సమస్యలను కలిసి కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా ఈ …
Read More »అమెరికా 500 శాతం పన్ను… భారత్ ఏమంటోంది?
అమెరికా తీసుకోబోతున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు ఇండియాను టెన్షన్ పెడుతోంది. రష్యా దగ్గర నుంచి తక్కువ ధరకే ఆయిల్ కొంటున్న దేశాలపై కక్ష్యతో 500 శాతం పన్నులు వేసే బిల్లును అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. దీనిపై భారత విదేశాంగ శాఖ (MEA) స్పందిస్తూ తాము పరిస్థితిని క్షుణ్ణంగా గమనిస్తున్నామని క్లారిటీ ఇచ్చింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నా కూడా భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు రష్యా నుండి …
Read More »‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు బయలుదేరారని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. కొందరు రాయలసీమ ఎత్తిపోతల పేరుతో వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నాకు గొడవలు కాదు.. తెలుగు జాతి ప్రయోజనాలే కావాలి అని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం పూర్తి అయితే తెలంగాణ రాష్ట్రం కూడా ఆ నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. …
Read More »అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2 కోట్లను విడుదల చేసింది. రాజధాని ప్రాంతం ఒకప్పుడు బౌద్ధులకు ఆరామంగా ఉండేది. అనేక బౌద్ధ కార్యక్రమాలు కూడా ఇక్కడ జరిగాయి. ఈ నేపథ్యంలో 2014 నుంచి 2018 మధ్య అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో ‘జ్ఞాన బుద్ధ’ పేరుతో భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఇందులో బౌద్ధ ఆరామానికి …
Read More »చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తరచుగా జగన్ మళ్లీ వస్తే అనే మాట ప్రస్తావిస్తున్నారు. మళ్లీ రానివ్వొద్దంటూ చంద్రబాబు ప్రజలకు చెబుతున్నారు. ఇక వైసీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి అధికారంలోకి రాకుండా చేస్తానని పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేస్తున్నారు. కూటమిని ఎలా ముందుకు …
Read More »ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జగన్ పై బాబు సీరియస్
వైసీపీ అధినేత జగన్‌పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు. ఆ పరిస్థితిని తిరిగి గాడిలో పెట్టేందుకు రెండేళ్ల సమయం పట్టిందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దడంలోనే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చిందని తెలిపారు. తన పాలనలో చేసిన తప్పుడు పనులను ఇప్పుడు తమపై నెట్టే ప్రయత్నం జరుగుతోందని చంద్రబాబు విమర్శించారు. తూర్పుగోదావరి …
Read More »అమరావతిపై జగన్‌కు 5 ప్రశ్నలు..!
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో జగన్ మనసులో ఉన్నదే బయట పెట్టారని ప్రత్యర్థి పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో, గతంలో రాజధాని రైతులను తూలనాడి ఇప్పుడు వారి తరఫున వాదిస్తున్నట్టు జగన్ మాట్లాడటం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద జగన్ తాజా వ్యాఖ్యలతో ఐదు కీలక ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. 1) …
Read More »జగన్ రోడ్డున పడేస్తే.. కూటమి ఆదుకుంది!
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి డాక్టర్ సుధాకర్‌ను వేధించిన విషయం తెలిసిందే. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సుధాకర్ ఎన్ 90 మాస్క్‌ను కోరిన ఘటన అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసింది. కరోనా తీవ్రంగా ప్రబలిన సమయంలో విధుల్లో పనిచేయాలంటే భయంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో డాక్టర్ …
Read More »కోనసీమకు ప్రభుత్వం గుడ్ న్యూస్
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ వస్తున్న విశిష్టమైన ఉత్సవం. ఏకాదశ రుద్రులతో కూడిన ప్రభలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, భుజాలపై ఎత్తుకుని నిర్వహించే ఈ వేడుకకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ ప్రభల తీర్థాన్ని దర్శించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు కోనసీమకు తరలివస్తుంటారు. ఉమ్మడి తూర్పుగోదావరి …
Read More »పిఠాపురంలో పిచ్చి పిచ్చి వేషాలేస్తే…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి వేషాలేస్తే.. ఏరేస్తాం అంటూ.. తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తన సొంత నియోజకవర్గంలో ఏ ఇంటి పై కాకి వాలినా.. రాజకీయం చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. ఏ చిన్న ఘటన జరిగినా.. దానిని చిలవలు పలవలు చేసి ప్రచారం చేస్తున్నారని.. ఇక ముందు అలా జరిగితే.. ఊరుకునేది …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates