ఏపీ శాసన మండలిలో మాటల మంటలు రేగాయి. అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. వాస్తవానికి అసెంబ్లీకి రాకపోయినా.. వైసీపీ తన బలం ఎక్కువగా ఉన్న మండలికి మాత్రం వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మంగళవారం మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణకు.. మంత్రి నారా లోకేష్‌కు మధ్య మాటల మంటలు రేగాయి. ముఖ్యంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంటుపై కొన్నాళ్లుగా ప్రశ్నలు సంధిస్తున్న వైసీపీ తాజాగా …
Read More »తొలి పలుకుతోనే అదరగొట్టిన నాగబాబు
జనసేన సీనియర్ నేత, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో కీలక సభ్యుడు, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగేంద్రరావు పెద్దల సభ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై చాలా రోజులే అయ్యింది. అయితే నాగబాబు ఎన్నిక తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరగకపోవడంతో ఆయన పెద్దల సభలో కాలు పెట్టేందుకే చాలా సమయం పట్టింది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సభకు వచ్చిన నాగబాబు… మంగళవారం సభలో …
Read More »ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే: చింతలపూడి చింత తీర్చేశారుగా..!
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం చింతలపూడి. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో సొంగా రోషన్ కుమార్ టీడీపీ తరఫున పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. కీలకమైన ఈ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా తొలిసారి విజయం దక్కించుకున్న ఎమ్మెల్యేలు చాలా మంది పై వివాదాలు, విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. ఇలానే సొంగా రోషన్ కుమార్‌పైనా చిన్నపాటి వివాదాలు ఉన్నాయి. కానీ అవేవీ …
Read More »బొండా ఉమాను కంట్రోల్ చేయాల్సిందే…!
ఫైర్ బ్రాండ్ నాయకులను సీఎం చంద్రబాబు ప్రోత్సహించడం తగ్గించారు. ఎన్నికలకు ముందు కొంత మేరకు వారికి స్వేచ్ఛ ఇచ్చినా, తర్వాత మాత్రం మార్పుదిశగా అడుగులు వేస్తున్నారు. పొరుగు పార్టీల నేతలు నోరు చేసుకుంటున్న దరిమిలా వారిని కట్టడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సొంత పార్టీ నాయకులను కూడా చంద్రబాబు నిలువరిస్తున్నారు. దీంతో గతంలో నోరు చేసుకున్న టీడీపీ నాయకులు ప్రస్తుతం మౌనంగా ఉంటున్నారు. ఒకప్పుడు వివాదాలకు కేంద్రంగా …
Read More »బాబు.. విజన్‌కు జీఎస్టీ టెస్ట్.. !
తాజాగా దేశంలో జిఎస్టి 2.0 సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. ఫలితంగా జిఎస్టి స్లాబులు తగ్గి కొత్త విధానాలు అమలవుతున్నాయి. దీనివల్ల ప్రజలకు ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలకు మేలు జరుగుతుందన్నది కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాట. ముఖ్యంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలకు, చిన్నచిన్న వ్యాపారులకు కూడా మేలు జరుగుతుంది అనేది జీఎస్టీ సంస్కరణల లక్ష్యం. అయితే పన్ను ఆదాయం పై ఆధారపడిన రాష్ట్రాలు ఈ సంస్కరణల విషయంలో మాత్రం తీవ్ర …
Read More »తగ్గేదేలే!… రేవంత్ దీ డబుల్ బొనాంజే!
శరన్నవరాత్రులను పురస్కరించుకుని తొలి రోజు నుంచే సవరించిన నెక్ట్స్ జనరేషన్ జీఎస్టీ 2.0ను ప్రకటించిన మోదీ… ఈ పన్ను విధానం పేదలు, మధ్య తరగతికి డబుల్ బొనాంజేనని ఆయన ఆదివారం ప్రకటించారు. మోదీ కంటే తానేమీ తక్కువ అనుకున్నారో, ఏమో తెలియదు గానీ… తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కూడా శరన్నవరాత్రుల తొలిరోజు అయిన సోమవారం ఓ రెండు కీలక ప్రకటనలు చేశారు. ఈ ప్రకటనలు చూసిన వారంతా తెలంగాణ ప్రజలకు రేవంత్ డబుల్ బొనాంజా …
Read More »విజయవాడ ఉత్సవ్ కు ఇక అడ్డంకుల్లేవ్!
ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కొత్త కొత్త విషయాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు శరన్నవరాత్రి పర్వదినాలను పురస్కరించుకుని విజయవాడలో విజయవాడ ఉత్సవ్ పేరిట ఓ భారీ కార్యక్రమంలో నిర్వహించాలని స్థానిక ఎంపీ కేశినేని చిన్ని, మంత్రి కొల్లు రవీంద్ర, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాంలు అహరహం శ్రమించారు. అయితే వీరి యత్నాలను అడ్డుకునేందుకు అటు విపక్ష వైసీపీతో పాటు కొన్ని హిందూ సంఘాలు యత్నించాయి. …
Read More »మోడీ వ్యూహాత్మక బాణం: ప్రపంచీకరణకే ముప్పు!
ప్రపంచీకరణ(గ్లోబలైజేషన్) అనేది.. 1990ల నుంచి వినిపిస్తున్న మాట. ఇప్పుడు ప్రతి దేశం జపిస్తున్న మాట కూడా. అయితే.. ఒకప్పుడు ప్రపంచీకరణ అనేది దేశాలకు- దేశాలకు మధ్య అనుసంధానం పెంచింది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను కూడా విస్తరించింది. అందుకే.. మన దేశంలో పీవీ నరసింహారావు ప్రధానిగా వచ్చిన తర్వాత.. సంస్కరణల పేరుతో ఆయన గ్లోబలైజేషన్‌కు ద్వారాలు తెరిచారు. ఇక, ఆ తర్వాత తర్వాత.. అనేక మార్పులు వచ్చాయి. ఈ సంస్కరణలు ఎందాకా …
Read More »జీఎస్టీ 2.0: ధరలు తగ్గడమే కాదు.. వాచిపోయేవీ ఉన్నాయి!
దాదాపు ఏడు సంవత్సరాల పాటు.. ప్రజలను పిండేసిన వస్తు-సేవల పన్ను(జీఎస్టీ)లో సంస్కరణలు తీసుకువస్తూ..కేంద్రం చేసి న నిర్ణయం ఆదివారం(21-సెప్టెంబరు) అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. దీనిని మహా గొప్ప నిర్ణయంగా.. దేశ చరిత్రలో సువ ర్ణాక్షరాలతో రాయదగ్గ ఘట్టంగా ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. జాతిని ఉద్దేశించి ఆదివారం సాయంత్రం ప్రసంగించిన ఆయ న జీఎస్టీకి తామే మూలమని పేర్కొన్నారు. అప్పట్లో జీఎస్టీని దేశ అభ్యున్నతి కోసం ప్రవేశ పెట్టామని …
Read More »నోరు విప్పలేరు.. అలాని తెరవలేరు.. షర్మిల సతమతం..!
కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిలకు పెద్ద చిక్కే వచ్చి పడింది. వైయస్ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకునే ఆమె అసలైన కాంగ్రెస్ వాదిగా తనను తాను ప్రాజెక్టు చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమం, పేదల పక్షపాతిగా ఉన్నారని ఆమె చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైయస్ రాజశేఖర్ రెడ్డిని రెండవసారి అధికారంలోకి తీసుకువచ్చేలా చేసిన కీలకమైన పథకం ఆరోగ్యశ్రీ. ఈ పథకమే లేకపోతే …
Read More »ప్రయోగాలు వికటించాయి.. ఇక, వద్దులే: కళ్లు తెరిచిన జగన్ ..!
కొత్తగా వచ్చిన నాయకులకు వైసీపీలో అవకాశం కల్పించారు. మంత్రులుగా, ఎమ్మెల్సీలుగా పదవులు ఇచ్చారు. ముఖ్యంగా నంద్యాల జిల్లాకు చెందిన జకియా ఖానంకు మండలిలో డిప్యూటీ చైర్మన్ గా కూడా జగన్ అవకాశం కల్పించారు. ఇక, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి వీళ్ళందరూ కూడా కొత్తముఖాలే. కారణాలు ఏమైనా వీరందరికీ కూడా జగన్ మంచి మంచి అవకాశాలు ఇచ్చారు. మంచి పదవులు కూడా ఇచ్చారు. సామాజిక వర్గ సమీకరణాలు కావచ్చు, …
Read More »చింతమడకలో ‘సీఎం’ కవిత
తెలుగు ప్రజలకు చింతమడక గ్రామం పేరు గురించి అంతగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఆ గ్రామం బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించిన ఉద్యమకారుడు, రాష్ట్రాన్ని పదేళ్ల పాటు పాలించిన మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) స్వగ్రామం. సిద్దిపేట జిల్లా, అదే మండలంలోని ఓ గ్రామమైన చింతమడక నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన కేసీఆర్ అంచెలంచెలుగా ఎదిగారు. తాజాగా కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్కడికి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates