Political News

సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్.. సీబీఐపై సుప్రీం ఆగ్ర‌హం!

ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో భారీ రిలీఫ్ ద‌క్కింది. ఆయ‌న‌పై సీబీఐ న‌మోదు చేసిన కేసులో బెయిల్ ఇస్తూ.. కోర్టు శుక్ర‌వారం ఉద‌యం ఫ‌స్ట్ కేసులోనే ఆదేశాలు జారీ చేసింది. వాస్త‌వానికి ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో ఈడీ న‌మోదు చేసిన అభియోగాల‌తో కేజ్రీవాల్ జైలు పాల‌య్యారు. కొన్ని నెల‌లుగా ఆయ‌న జైల్లోనే ఉన్నారు. అయితే.. ఢిల్లీ ముఖ్య‌మంత్రిగా ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు అంగీక‌రించ‌లేదు. ఇక, ఈ విష‌యంలో …

Read More »

కౌశిక్ వ‌ర్సెస్ గాంధీ.. పెద్ద గొడవే ఇది

ప్ర‌జా ప‌ద్దుల క‌మిటీ(పీఏసీ) చైర్మ‌న్ ప‌ద‌వి తెచ్చిన తంటా.. రాజ‌కీయంగా తెలంగాణ‌ను కుదిపేస్తోంది. బీఆర్ ఎస్ నుంచి గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో అరిక‌పూడి గాంధీ విజ‌యం ద‌క్కించుకున్నారు. శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. పార్టీ ఫిరాయించి.. ఈ ఏడాది జూలై 24న ఆయ‌న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ వెంట‌నే ఈ నెల 9న ఆయ‌న‌ను పీఏసీ చైర్మ‌న్‌గా నియ‌మిస్తూ.. సీఎం రేవంత్ …

Read More »

  `కొడాలి` మాయం… వెనిగండ్ల సేఫ్

టీడీపీ నేత‌, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నియోజ‌కవ‌ర్గం ప్ర‌జ‌ల‌తో భేష్ అని అనిపించుకుంటున్నారు. ప్ర‌స్తు తం ఆయ‌న అమెరికాలో ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఇక్క‌డ వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌కు అందుతున్న సేవ‌ల‌ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్నారు. త‌న టీంను ఇక్క‌డ ఏర్పాటు చేసిన ఆయ‌న‌.. అమెరికాలో ఉంటూనే వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నెల 4న రాము అమెరికా ప‌ర్య‌ట‌నకు వెళ్లారు. ఇది ముందస్తుగా నిర్ణ‌యించుకున్న షెడ్యూల్ కావ‌డంతో ర‌ద్దు …

Read More »

రిప‌బ్లిక‌న్ల‌కు షాక్‌.. డెమొక్రాట్ల ఆశ‌లు స‌జీవం!

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో త‌మ గెలుపు ఖాయ‌మ‌ని భావించిన రిప‌బ్లిక‌న్ల‌కు.. భారీ షాక్ త‌గిలింది. తాజాగా జ‌రిగిన అధ్య‌క్ష అభ్య‌ర్థుల డిబేట్‌లో రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థి.. దూకుడు నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ డొనాల్డ్ ట్రంప్ బాగా వెనుక‌బ‌డి పోయారు. ప్రత్య‌ర్థి మాట‌ల్లో చెప్పాలంటే.. ట్రంప్ ఒక‌ర‌కంగా డ‌మ్మీ అయ్యారు. అనేక ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న త‌డ‌బ‌డ్డారు. అంతేకాదు.. ఆయ‌న‌పై డెమొక్రాటిక్ అభ్య‌ర్థి క‌మ‌లా హ్యారిస్ అనూహ్య‌మై న పైచేయి సాధించారు. అచ్చం భార‌త్‌లో …

Read More »

‘అప్ప‌టి మంత్రి ర‌జ‌నీకి.. 2 కోట్ల క‌ప్పం క‌ట్టాను.. ఇప్పించండి’

అధికారంలో ఉండ‌గా.. ఏం చేసినా చెల్లుతుంద‌ని భావించేవారు చాలా మంది ఉన్నారు. ఆ త‌ర్వాత ఎవరు మాత్రం ప‌ట్టించుకుంటారు.. అధికారం ఉండ‌గానే నాలుగు రాళ్లు వెనుకేసుకుందామ‌ని భావిస్తున్నారు. న‌యానో భ‌యానో.. ఇలా కోట్ల రూపాయ‌లు పోగేసుకున్న‌వారు.. చాలా మంది ఉన్నారు. అయితే.. ఇప్పుడు ప్ర‌భుత్వం మార‌డంతోపాటు.. త‌మ‌కు ల‌భిస్తున్న భ‌రోసా కార‌ణంగా.. నాటి బాధితులు నేడు న్యాయం కోసం క్యూ క‌డుతున్నారు. ఇలాంటి వారిలో గుంటూరు జిల్లా య‌డ్ల‌పాడుకు చెందిన …

Read More »

ప‌రారీలో రిటైర్డ్ ఐపీఎస్‌.. రీజ‌నేంటి?

కొన్నాళ్ల కింద‌ట రిటైర్ అయిన‌.. సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ప‌రారీలో ఉన్న‌ట్టు ఏపీ ప్ర‌భుత్వం తెలిపింది. అంటే.. ఇది బ‌హిరంగంగా ప్ర‌క‌టించ‌క‌పోయినా.. అంత‌ర్గ‌తంగా పోలీసులు చెబుతున్న మాట‌. ఆయ‌న కోసం.. ఇప్పుడు పోలీసులు న‌లుచెర‌గులా వెతుకుతున్నారు. ఎందుకు? ఏమిటి? అంటే.. దీని వెనుక చాలానే ఉంద‌ని కూడా అంటున్నారు. గ‌తంలో వైసీపీ ఎంపీగా ఉన్న ర‌ఘురామ‌కృష్ణ రాజును నిర్బంధించిన విష‌యం రెండు తెలుగురాష్ట్రాల్లోనూ సంచ‌ల‌నం సృష్టించింది. దీనిలో అనేక మంది …

Read More »

బెదిరింపు రాజ‌కీయాలు ఎందాకా? జ‌గ‌న్ స‌ర్‌!!

ఒక ఓట‌మి నుంచి అనేక పాఠాలు నేర్చుకోవాలి. ఒక మైన‌స్ నుంచి అనేక మార్పులు చోటు చేసుకోవాలి. ఇది రాజ‌కీయ నాయ‌కుల‌కు ఉండాల్సిన ప్ర‌ధాన ల‌క్ష‌ణం. పైగా.. ప్ర‌జ‌ల‌కు ఎంతో చేశాన‌ని చెప్పినా.. ఘోరంగా ఓడిపోయిన జ‌గ‌న్‌.. అండ్‌కో.. మ‌రింత ఆత్మ విమ‌ర్శ చేసుకోవాలి. కార‌ణాలు వెతుక్కోవాలి. లేదా.. క‌ళ్ల ముందు క‌నిపిస్తున్న‌వాటిని ఒప్పుకోవాలి. స‌రిదిద్దుకోవాలి. కానీ, ఆదిశ‌గా అధినేత కానీ.. నాయ‌కులు కానీ.. అడుగులు వేస్తున్న ప‌రిస్థితి క‌నిపించ‌డం …

Read More »

కూట‌మి స‌ర్కారు… స‌వాళ్ల ప‌య‌నం.. !

కూట‌మి ప్ర‌భుత్వం ప‌గ్గాలు చేప‌ట్టి.. నేటికి(సెప్టెంబ‌రు 11) 90 రోజులు పూర్త‌య్యాయి. సాధార‌ణంగా.. తొలి వంద రోజులు ప్ర‌శాంతంగా జ‌రిగిపోవాల‌నిఏ ప్ర‌భుత్వ‌మైనా కొరుకుంటుంది. ఫీల్‌గుడ్ భావ‌న ల‌భించాల నే ఆశిస్తుంది. వ‌చ్చిన తొలి రోజుల్లోనే ప్ర‌భుత్వం ఏదైనా చేయ‌డం ద్వారా ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర మార్కులు కొట్టే యాల‌ని చూస్తుంది.త‌ద్వారా.. త‌ర్వాత పాల‌న ఎలా ఉన్నా.. తొలి 100 రోజుల పాల‌న‌ను చివ‌రి వ‌ర‌కు చెప్పుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. కానీ, చిత్రంగా గ‌తంలో …

Read More »

ప‌వ‌న్‌-పంచాయ‌తీ- వితౌట్ పాలిటిక్స్!!

ఏపీలోని గ్రామ పంచాయ‌తీల్లో పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది. గతానికి భిన్నంగా ఇంకో మాట‌లో చెప్పాలంటే.. గ‌డిచిన ఐదేళ్ల కాలంలో తొలిసారి పంచాయ‌తీలు.. ల‌క్ష రూపాయ‌లు క‌ళ్ల చూస్తున్నాయి. వాస్త‌వానికి బ్లీచింగ్ కొనుగోలు చేసేందుకే నిధులు లేక అల్లాడుతున్న ప‌రిస్థితిలో పంచాయ‌తీలు కునారిల్లు తున్నా యి. ఇలాంటి ప‌రిస్థితి నుంచి ఇప్పుడు కొంత మేర‌కు కోలుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. జ‌గ‌న్ పాల‌న కాలంలో కేంద్రం నుంచి వ‌చ్చిన 600 కోట్ల రూపాయ‌ల‌ను …

Read More »

నెల్లూరు కోటపై కోటంరెడ్డి గురి !

శాసనసభ ఎన్నికల్లో నెల్లూరును తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు నెల్లూరు కార్పోరేషన్ మీద టీడీపీ జెండా ఎగిరేసేందుకు పావులు కదుపుతున్నాడట. నెల్లూరు కార్పోరేషన్ చైర్మన్ గా ప్రస్తుతం స్రవంతి కొనసాగుతున్నది. కోటంరెడ్డి కోటరీకే చెందిన స్రవంతి కోటంరెడ్డితో పాటే టీడీపీ కండువా కప్పుకుంది. ఆయితే ఎన్నికలకు ముందు ఆదాల ప్రభాకర్ రెడ్డి పిలుపుతో ఆమె తిరిగి వైసీపీ …

Read More »

రేవంత్ తోపు అనుకున్నాం కానీ కాదు – బండి

మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌పై కేంద్ర మంత్రి, బీజేపీ నాయ‌కుడు బండి సంజ‌య్ నిప్పులు చెరిగారు. ఇదేస‌మ‌యం లో రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వంపైనా ఆయ‌న ఫైర‌య్యారు. రేవంత్‌రెడ్డి స‌ర్కారుకు కేసీఆర్‌ను డీల్ చేయ‌డం చేత‌కావ‌డం లేద‌ని.. అదే తాము అధికారంలో ఉంటే.. కేసీఆర్ కుటుంబానికి అంకుశం సినిమాలో మాదిరిగా చుక్కలు చూపించి ఉండేవార‌మ‌ని చెప్పారు. “రేవంత్‌రెడ్డి తోపు అనుకున్నం. కానీ, ఆయ‌న‌కు చేత‌కావ‌డం లేదని అర్థ‌మైంది. కేసీఆర్‌ను ఎప్పుడో …

Read More »

  ఒక నేర‌స్తుడిని మ‌రో నేర‌స్తుడు ఓదార్చాడు:  టీడీపీ

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. పార్టీ నేత‌, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను బుధ‌వారం గుంటూరు జైల్లో ప‌రామ‌ర్శించారు. అనంతరం ఆయన బుడ‌మేరు వ‌ర‌ద‌, ప్ర‌భుత్వ సాయం.. చంద్ర‌బాబు వ్య‌వ‌హార శైలిపై విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. ఈ ప‌రిణామాల‌పై టీడీపీ నాయ‌కులు తీవ్రంగా స్పందించారు. “ఒక నేర‌స్తుడు మ‌రో నేర‌స్తుడిని క‌లిశారు. ఆయ‌న‌ను ఈయ‌న‌, ఈయ‌న‌ను ఆయ‌న ఓదార్చుకున్నారు“ అని సెటైర్లు వేశారు. విజ‌య‌వాడ‌లో మంత్రి నిమ్మ‌ల రామానాయుడు మాట్లాడుతూ.. జ‌గ‌న్ …

Read More »