ఏపీలో అధికారంలోకి వచ్చితీరుతామని పదే పదే చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు.. 2022 ఏం మిగిల్చింది? ఏం ఇచ్చింది? అనే విషయాలను చూస్తే.. రిక్తహస్తాలు.. శుష్క ప్రయత్నాలు అనే చెప్పాల్సి ఉంటుంది. జూన్‌లో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ఆవేశ పూరితంగా చేసిన కొన్ని విషయాలను ఆయనే మరిచిపోయారనే వాదన బలంగా వినిపించింది. అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెస్తానని పవన్ చెప్పారు. వైసీపీ ఓటు బ్యాంకును …
Read More »పడి లేచిన ‘టీడీపీ’.. 2022 మిగిల్చింది ఇదే!
2022వ సంవత్సరం.. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగు దేశం పార్టీకి పెద్ద సానుకూల సంవత్సరమనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన టీడీపీపని అయిపోయిందని.. ఇక, పార్టీ పుంజుకునే పరిస్థితి కూడా లేదని.. జరిగిన ప్రచారానికి ఈ సంవత్సరం చెక్ పెట్టింది. ముఖ్యంగా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రెట్టించిన ఉత్సాహం తో ముందుకు కదిలారు. అధికార పార్టీ వైసీపీ దుర్నీతిని అడుగడుగునా ఎండగట్టారు. …
Read More »2022 జ్ఞాపకాలు: వైసీపీని రోడ్డున పడేసిన రెండు ఘటనలు ఇవే!
కాలం వడివడిగా కదిలిపోయింది.. క్యాలెండర్ గిర్రున తిరిగిపోయింది! 2022 చరిత్రలో కలిసిపోయింది!! కానీ, జ్ఞాపకాల దొంతరలను తరచి చూస్తే.. కొన్ని అనుభూతులు.. కొన్ని అపవాదులు.. మరికొన్ని ఆవేదనలు.. ఇంకొన్ని ఆనందాలు! వ్యక్తిగత జీవితంలో ఎవరికైనా.. ఇవన్నీ సర్వసాధారణం. ‘మనవన్నీ.. ప్రైవేటు బతుకులు’ అంటారు మహాకవి శ్రీశ్రీ!! కాబట్టి.. మన విషయాలు పక్కన పెట్టి మనలను పాలించే వారి గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఏపీలో వైసీపీ పాలనను ఒక్కసారి వెనుదిరిగి చూస్తే.. …
Read More »వైసీపీలో విక్రముడి పరాక్రమం అందరికీ వస్తుందా..!
వైసీపీలో కొందరు ధనవంతులైన ఎమ్మెల్యేలు ఉన్నారు. మరికొందరు మధ్యతరగతికి ఎగువన ఉన్నవారు ఉన్నారు. దీంతో ఎగువ మధ్యతరగతి నుంచి వచ్చిన వారు ప్రభుత్వం ఇచ్చే నిధులపైనే ఆధారపడుతున్నారు. కానీ, కొందరు వ్యాపారులు మాత్రం(ఒకరిద్దరు మాత్రమే) తమ సొంత నిధులతో ప్రజలకు మేలు చేస్తున్నారు. ఇది మంచిదే అయినా.. దీనిని గమనించిన పొరుగు నియోజకవర్గం ప్రజలు వీరిపై ఒత్తిడి తెస్తున్నారనేది టాక్. తాజాగా నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేకపాటి …
Read More »ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే మరో ప్రయత్నం
ఏపీలో అధికార వైసీపీకి ప్రజా వ్యతిరేకత తప్పడం లేదు. ఎమ్మెల్యేలను, మంత్రులను జనం ఎక్కడిక్కడ నిలదీస్తున్నారు. ఇదంతా తెలుగుదేశం చేయిస్తున్న పని అని వైసీపీ అనుమానిస్తోంది. దానితో విపక్షాన్ని డిఫెన్స్ లో పడేసేందుకు, రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు జగన్ పార్టీ తన దగ్గరున్న అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది.. ఈ మధ్య కాలంలో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కూడా వెనుకాడటం లేదు.. ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కావాలి ధర్మాస ప్రసాద రావుకు …
Read More »ఇది.. వైసీపీ విధ్వంస నామ సంవత్సరం: చంద్రబాబు
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి ప్రతి ఏటా విధ్వంసాల సంవత్సరమేనని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ కోల్పోయి శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా క్షోభ అనుభవిస్తున్నారని అన్నారు. నెల్లూరు జిల్లా రాజుపాలెంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘2022కు వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నాం. జగన్ పాలనలో 2022 విధ్వంసాల సంవత్సరంగా మిగిలిపోయింది. వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచీ ప్రతీ ఏడాదీ …
Read More »విధేయుడికి వీరతాడు.. సునీల్ కు ప్రమోషన్ ఇచ్చిన జగన్!
తనకు అనుకూలంగా వ్యవహరించేవారిని అందలం ఎక్కిస్తున్న సీఎం జగన్.. తాజాగా వీర విధేయుడిగా పేరు పొందిన ఐపీఎస్ అధికారి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సునీల్ కుమార్‌కు ప్రమోషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆయన సీఐడీ అదనపు డీజీపీగా ఉన్నారు. అయితే, ఇక నుంచి ఆయన పూర్తిస్థాయి డీజీపీగా ఇదే విభాగంలో పనిచేయనున్నారు. దీంతో అధికారాలతోపాటు.. వేతనం, ఇతర అలవెన్సులు లభించనున్నాయి. అయితే.. సీఐడీ అధికారి సునీల్ కుమార్.. చుట్టూ …
Read More »కేసీఆర్‌కు షాక్.. మరోవైపు నరుక్కొస్తున్న కాంగ్రెస్!!
కేంద్రంలో చక్రం తిప్పాలని ప్రయత్నం మీదున్న తెలంగాణ సీఎం KCRకు భారీ షాక్ ఇచ్చేలా వ్యవహరిస్తోంది.. జాతీయ పార్టీ కాంగ్రెస్. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకం చేయనున్నట్టు తెలిపింది. అంతేకాదు.. ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీయేనని కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. Rahul కేవలం ప్రతిపక్షాల ఫేస్ మాత్రమే కాదని.. ఆయన కాబోయే ప్రధానమంత్రి అని …
Read More »నిజం తెలుసుకుని మాట్లాడు జగన్ రెడ్డీ: చంద్రబాబు వార్నింగ్
ఏపీ సీఎం Jagan కు ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు గట్టి వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు జిల్లా కందుకూరు టీడీపీ సభలో జరిగిన తొక్కిసలాట, మరణాలపై సీఎం జగన్ నర్సీపట్నం సభలో చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు పర్యటనలో డ్రోన్ షో చేస్తున్నారని, అందుకే తొక్కిసలాట జరిగి 8 మంది మరణించారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. చంద్రబాబువి అన్నీ ‘షో’లేనని విమర్శించారు. ఈ నేపథ్యంలో జగన్‌కు కౌంటర్‌గా …
Read More »విశాఖను రాజధాని చేయకపోతే.. రాష్ట్రం చేయండి
ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానిని అంగీకరించేది లేదని.. ఎట్టి పరిస్థితిలో దీనికి తాము ఒప్పుకోబోమని ఆయన వ్యాఖ్యానించారు. “అమరావతినే రాజధాని చేయాలని ఏ పార్టీ అయినా.. అనుకుంటే.. విశాఖను చిన్న రాష్ట్రం చేసి మాకు ఇచ్చేయండి.. మా పాలనేదో మేమే చేసుకుంటాం.. మా బతుకులేవో మేమే బతుకుతాం! రాజధాని కోసం మా కష్టార్జితాన్ని కట్టాల్సిన అవసరం లేదు. పన్నుల రూపంలో దోచుకుని.. ఒక్కచోటే …
Read More »చంద్రబాబు స్క్రిప్టు రాస్తే.. పవన్ కల్యాణ్ యాక్టింగ్ చేస్తాడు
ఏపీ సీఎం జగన్.. చంద్రబాబుపైనా.. పనిలోపనిగా పవన్‌పైనా నిప్పులు చెరిగేశారు. చంద్రబాబు స్క్రిప్టు రాస్తే.. పవన్ యాక్టింగ్ చేస్తాడు.. అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో రాజకీయం అంటే.. ఏంటో కూడా జగనే చెప్పేశారు. రాజకీయం అంటే.. ప్రతి పల్లె అభివృద్ధి చేయడమని.. మూడేళ్లలో అది చేసి చూపించామని జగన్ అన్నారు. సీఎం నుంచి ఎమ్మెల్యే వరకూ అందరూ ప్రజల సేవకులని చెప్పారు. రాజకీయం అంటే ఇదేనని స్పష్టం చేశారు. రాజకీయం …
Read More »ఉద్యోగుల పై అంత నమ్మకం లేదా జగనన్నా?!
ఏపీలో ఉద్యోగులను అన్ని విధాలా వేధిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ప్రభుత్వం తాజాగా మరో సంచలన ఆదేశం జారీ చేసింది. ఉద్యోగులు ఎవరూ కూడా విధులకు వచ్చే సమయంలో తమ వద్ద రూ.500 నుంచి రూ.1000 కి మించి నగదును ఉంచుకోవడానికి వీల్లేదని తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి ఇది ఉద్యోగుల సర్వీసు నిబంధనల్లోనే ఉంది. అయితే.. ఏ ప్రభుత్వం కూడా ఇలా ఎప్పుడూ ఆదేశించ లేదు. …
Read More »