వైసీపీ అధినేత, సీఎం జగన్ మరో యాత్రకు రెడీ అవుతున్నారు. అదే.. ‘విజయయాత్ర’. ఇదేదో ఎన్నికల పోలింగ్ అయిపోయి.. రిజల్ట్ కూడా వచ్చేసిన తర్వాత.. తీరిగ్గా జూన్ 5న ప్రారంభిస్తారని అనుకుంటున్నారేమో.. కాదు.. కాదు. ఈ నెల 27 నుంచి ఆయన విజయయాత్రకు రెడీ అవుతున్నారు. అది కూడా సుడిగాలి పర్యటనలకు ఆయన సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నిక ల్లో తమ పార్టీ అభ్యర్థుల పక్షాన.. సీఎం జగన్ ఈ విజయయాత్ర చేపట్టనున్నట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే.. సీఎం జగన్ ప్రచారాన్ని ప్రారంభించారు.
మార్చి 5వ తేదీనే.. ఆయన ‘సిద్ధం’ పేరుతో భారీ ప్రచార సభలకు శ్రీకారం చుట్టారు. ఉత్తరాంధ్ర, కోస్తా, సీమ ప్రాంతాల్లో మొత్తం ఆరు సిద్ధం సభలను నిర్వహించారు. వీటిని ఐప్యాక్ టీం.. డిజైన్ చేసిన విషయం తెలిసిందే. అచ్చం ఇలాంటి సభలే మనకు పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ కూడా.. నిర్వహించింది . వీటిని సక్సెస్ చేసుకున్నారు. ఇక, వీటి తర్వాత.. రాష్ట్రంలో సెడ్యూల్ వచ్చేసింది. ఎన్నికలకు అభ్యర్థులను కూడా ప్రకటించా రు. అనంతరం.. సీఎం జగన్ .. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు రెడీ అయ్యారు.
ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కూడా.. గురువారం ముగిసింది పులివెందులలో దీనికి ముగింపు పలికారు. అక్కడ నుంచి నేరుగా తాడేపల్లికి చేరుకున్నారు. ఇక, ఈ నెల 27న ఆయన ‘విజయయాత్ర’ పేరుతో సుడిగాలి పర్యటనలకు రెడీ అవుతు న్నారు. వీటిలో కీలకమైన 45 నియోజకవర్గాల్లో జగన్ రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటించి.. వైసీపీ అభ్యర్థుల పక్షాన ప్రచారం చేయనున్నారు.
ఇప్పటి వరకు సాగిన సిద్ధం, మేమంతా సిద్ధం యాత్రల్లో వచ్చిన ఫీడ్ బ్యాక్.. ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసిన తర్వాత.. ఇక, తమ విజయం ఖాయమనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి “విజయయాత్ర” అని పేరు పెట్టినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విజయ యాత్రలు.. మే 10వ తేదీ వరకు జరుగుతాయి.. ఆ తర్వాత రెండు రోజులకు అంటే.. మే 13న రాష్ట్రం అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఓకే రోజు నిర్వహించనున్న విషయం తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates