2019 ఎన్నికలకు ముందు నవరత్నాలు అంటూ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. గత ఎన్నికలలో ఇచ్చిన హామీలే పూర్తిగా అమలు కాలేదని, అమలు చేసిన హామీల కోసం లెక్కకు మించి అప్పులు చేశారని జగన్ పై విమర్శలున్నాయి. దీంతో, పాత హామీలు కొనసాగించడం మినహా కొత్త హామీలు ఇచ్చే పరిస్థితిలో జగన్ లేరని అంతా అనుకుంటున్నారు. దీంతో, ఈ సారి ఎన్నికలకు ముందు జగన్ ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు అన్న సందిగ్దత ఏర్పడింది. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ అధినేత జగన్ తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.
2024 లో మరోసారి వైసీపీని గెలపిస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాల జాబితాను వెల్లడించారు. కిందటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, ప్రస్తుతం అమలు చేస్తున్న కార్యక్రమాలపే కొనసాగిస్తామని చెప్పారు. గతంలో మాదిరిగానే నవరత్నాలు టైపులో 9 ప్రధాన హామీలు ఇచ్చారు జగన్.
మేనిఫెస్టోలోని 9 ప్రధాన హామీలు
పెన్షన్ రూ.3,500 (రెండు విడతల్లో) పెంపు
వైఎస్సార్ చేయూత పథకం ద్వారా అందిస్తున్న మొత్తాన్ని 8 విడతల్లో రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షలకు పెంపు
అమ్మ ఒడి పథకం కింద అందిస్తున్న మొత్తాన్ని 2 వేలు పెంచి రూ. 17 వేలు అందిస్తామని హామీ
వైస్సార్ రైతు భరోసా రూ.16 వేలు.. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపు
వైఎస్సార్ కాపు నేస్తం లబ్దిదారులకు ఇప్పుడిస్తున్న రూ.60 వేలను నాలుగు విడతల్లో రూ.1.20 లక్షలకు పెంచుతామని వెల్లడి
ఈబీసీ నేస్తం కింద ఇప్పుడిస్తున్న రూ. 45 వేల మొత్తాన్ని రూ.1.05 వేలకు పెంపు (నాలుగు దఫాల్లో)
వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల రుణం.. అర్హులైన పేదవాళ్లకు ఇళ్లు
వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా, విద్యాకానుక పథకాల కొనసాగింపు
లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింపు.. రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా
Gulte Telugu Telugu Political and Movie News Updates