వైసీపీ నేతలంటే నేతలే. ముఖ్యంగా సీమ ప్రాంత నేతలైతే.. మరింత ఘాటు! వారిని ఎవరూ ప్రశ్నించ కూడదు. ప్రశ్నిస్తే.. ఇంతకు ముందు తిట్లవరకే పరిమితం అయ్యారు. ఇప్పుడు ఎన్నికలు ముంచుకు వస్తున్న వేళ వారిలోనూ ఆవేశం, ఆగ్రహం.. అన్నీ తరుముకొస్తున్నాయి. దీంతో ఏకంగా చేయిచేసుకుంటు న్నారు. చితక్కొట్టేస్తున్నారు వారి అనుచరులతో కొట్టిస్తున్నారు కూడా! రాజోలి జలాశయం భూసేకరణ పరిహారంపై ప్రశ్నించిన రైతులపై జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే తన అనుచరులతో దాడి …
Read More »వడ్డీతో సహా న్యాయం చేస్తా: చంద్రబాబు
ఏపీ సీఎం జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనను సైకోగా అభివర్ణించారు. బీసీల పై కపట ప్రేమ కురిపిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తమ హక్కుల కోసం.. బీసీలు నోరు విప్పలేని పరిస్థితిని కల్పించింది.. జగన్ కాదా? అని ప్రశ్నించారు. బీసీలు మాట్లాడితే.. సైకో ముఖ్యంమంత్రి వారిని జైలులో పెట్టే పరిస్థితిని తీసుకువచ్చారు.. అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 26మంది బీసీలను పొట్టనపెట్టుకున్నారని చంద్రబాబు అన్నారు. తాను ముఖ్యమంత్రి …
Read More »లోకేష్ పాదయాత్రకు బ్రేకిస్తే.. మనకే తంటా.. వైసీపీ గుసగుస
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ జనవరి 27 నుంచి పాదయాత్ర చేయనున్నట్టు ప్రక టించారు. యువగళం పేరుతో ఆయన పాదయాత్రకు రెడీ అవుతున్నారు దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. అదేసమయంలో పతాకాన్ని కూడా ఆవిష్కరించారు. మొత్తం 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల దూరాన్ని నడవాలని నిర్ణయించుకున్నారు. దీనికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక, రూట్ మ్యాప్ మాత్రం సిద్ధం కావాల్సి ఉంది. అయితే.. ఇంతలోనే.. వైసీపీ మంత్రి …
Read More »జగన్ మాయ: ఏడాదికి ఎకరానికి వెయ్యి ఆద్దె ఇస్తే చాలు!
గతంలో టీడీపీ ఆఫీస్ కోసం.. చంద్రబాబు హయాంలో స్థలం కేటాయించడాన్ని తీవ్రస్థాయిలో దుయ్యబట్టిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు అదే పనిచేశారు. వైసీపీ కార్యాలయాల నిర్మాణం కోసం 3 జిల్లాల్లో 55 కోట్ల రూపాయల విలువైన 4.75 ఎకరాల భూములను కేటాయించేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఈ జీవో ప్రకారం.. కడప, కోనసీమ, అనకాపల్లి జిల్లాల పరిధిలో అత్యంత విలువైన భూమిని అధికార వైసీపీకి కేటాయించారు. …
Read More »పవన్ కల్యాణ్ భార్యల పై మళ్లీ నోరు పారేసుకున్న జగన్
జనసేనాని పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపైన వైసీపీ విమర్శల వర్షానికి అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా సీఎం జగన్ మరోసారి పవన్ భార్యల గురించి నోరు పారేసుకున్నారు. నర్సీపట్నంలో రూ.986 కోట్ల ప్రాజెక్టులను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన మరోమారు చంద్రబాబు, పవన్ కల్యాణ్లు లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ‘ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం, ఈ ప్రజలు కాకపోతే ఆ …
Read More »బాబు ‘ఏజ్’ పై సీఎం జగన్ కామెంట్లు
టీడీపీ అధినేత Chandrababu వయసుపై వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ’73 ఏళ్ల ముసలాయన’ అంటూ.. కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పర్యటించారు. జోగునాథునిపాలెం వద్ద 9 వందల 86 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జోగినాథునిపాలెంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మీ ప్రేమానురాగాలకు రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. …
Read More »నాణ్యమైన బ్రాండ్లు తక్కువ ధర..బాబు ప్రామిస్
మందు కొట్టకుండా సమాజంలో చాలా మంది ఉండలేరు. సాయంత్రమైతే తెలుగు రాష్ట్రాల్లో బ్రాందీ షాపులు కస్టమర్లతో కళకళలాడుతుంటాయి. రకరకాల బ్రాండ్ల మద్యం మార్కెట్లో కనిపిస్తుంది. కొన్ని కొత్త బ్రాండ్లు కూడా ఇప్పుడు మద్యం దుకాణాల్లో కనిపిస్తున్నాయి. మద్యం వ్యాపారంలో విపరీతమైన ఆదాయం ఉంటుంది. అందుకే బ్రాందీ షాపుల కాంట్రాక్టులు చేజిక్కించుకునేందుకు సిండికేట్లుగా ఏర్పడి మరీ లాలూచీ పడిన రోజులు ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు విధించినా.. మద్యం వ్యాపారులు అడ్డదారులు …
Read More »అమ్మ మాట నిలబెట్టుకున్న మోడీ.. ఏ ప్రధానీ చేయని పని!
ప్రధాన మోడీ మంత్రి మాతృమూర్తి హీరాబెన్ శుక్రవారం తెల్లవారు జామున 3.30గంటల సమయంలో అహ్మ దాబా ద్లోని ఓఆసుపత్రిలో మృతి చెందారు. సాధారణంగా ఎవరి ఇంట్లో అయినా.. ఇలాంటి విషాదాలు చోటు చేసుకుంటే.. ఆ కుటుంబంలోని వారంతా.. ఇతరపనులు పక్కన పెట్టి.. ఈ కార్యక్రమాల్లో ఉండిపోతా రు. అయితే.. ప్రధాని మోడీ మాత్రం తన షెడ్యూల్ను మార్చాలేదు. తన పనికి ఆటంకంగా భావించలేదు. ప్రధానిగా ఆయన నిర్ణయం తీసుకున్న షెడ్యూల్ …
Read More »ఆ ‘నాలుగు’ చుట్టూ.. టీడీపీలో హాట్ టాపిక్!
ఔను.. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలపై ఆ జిల్లా TDP తమ్ముళ్ల మధ్య హాట్ టాపిక్ నడుస్తోంది. ఇవి ఎవరికిస్తారు? ఇస్తే.. ఎవరు పోటీ చేస్తారు? పోటీ చేస్తే.. గెలుస్తారా? అసలు మనకు ఛాన్స్ ఉందా? ఇదీ.. ఇప్పుడు ఆ నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలను వేధిస్తున్న నాలుగు ప్రశ్నలు. ఆ నియోజకవర్గాలే.. తెనాలి, సత్తెనపల్లి, ప్రత్తిపాడు గుంటూరు తూర్పు. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటుందని.. …
Read More »టీడీపీ అభ్యర్థిగా కొలికిపూడి?
తెలుగుదేశం పార్టీలో అనధికార సభ్యుడిగా కొనసాగుతున్న కొలికిపూడి శ్రీనివాసరావుకు వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా సోషల్ మీడియా బ్యాచ్ కోడై కూస్తోంది. అందులోనూ టీడీపీ పట్టున్న, ప్రతిష్టాత్మకమైన నందిగామ సీటును కేటాయిస్తారని చెబుతున్నారు. దీనిపై పార్టీ వర్గాలు మాత్రం పెదవి విప్పడం లేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసిన కొలికిపూడి.. ఇప్పుడు ఐఎఎస్ …
Read More »ప్రధాని మోడీకి మాతృవియోగం.. హీరా బెన్ కన్నుమూత
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ ఇకలేరు. ఈ రోజు తెల్లవారు జామున 3 గంటల 30 నిమిషాల సమయంలో అహ్మదాబాద్ లోని మెహతా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ నెల 28న అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరిన హీరాబెన్ ఆరోగ్యం కుదుటపడిందని త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి వైద్యులు గురువారం ప్రకటించారు. కానీ.. ఇంతలోనే హీరాబెన్ ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. కాగా… గుజరాత్లోని మెహసానాలో ఉన్న వాద్నగర్ …
Read More »కొత్త ఏడాదిలో అమిత్ షా దండయాత్ర
ఆంధ్రప్రదేశ్పై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలన్న వ్యూహంతో ముందుకెళ్తోంది. ఒక పక్క పొత్తుల కసరత్తు చేస్తూనే మరో పక్క సొంత బలాన్ని అంచనా వేసుకుంటోంది. ఎప్పటికప్పుడు రాష్ట్ర నేతలను ఢిల్లీ పిలిపించుకుంటూ, సమీక్షలు నిర్వహిస్తోంది. అయితే బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పుడు రూటు మార్చిందని చెబుతున్నారు… జనవరి 8న రాక కేంద్రం హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఏపీ పర్యటనకు వస్తున్నారు. కొత్త సంవత్సరంలో …
Read More »