ఏపీ సీఎం జగన్.. నీరో చక్రవర్తిని తలపిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ సంచ లన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు దేశం తగలబడుతుంటే.. నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నా డని.. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కూడా ఇలానే చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తాజాగా విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల పోలింగ్ అనంతరం.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అల్లర్లు చెలరేగాయని.. దీంతో అసలు ఏం జరుగుతోందో కూడా అర్ధం కాని పరిస్థితి ఏర్పడిదని అన్నారు.
ఇలాంటి సమయంలో పాలన చేయాల్సిన ముఖ్యమంత్రి జగన్.. దానిని గాలికి వదిలేసి విదేశాలకు వెళ్లిపోవడం ఏంటి? అని ప్రశ్నించారు. అంతేకాదు.. ఆయనేమన్నా ప్రతిపక్షంలో ఉన్నారా? బాధ్యతలేదని అనుకున్నారా? అని ప్రశ్నించారు. వివిధ ప్రాంతాల్లో గత వారం రోజులుగా అల్లర్లు జరుగుతున్నాయని.. నాయకులు తప్పించుకుని కార్యకర్తలను ఇరికిస్తున్నారని.. ఆవేదన వ్యక్తం చేశారు. నాయకుల వలలో చిక్కుకుంటే ఇలానే జరుగుతుందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో ఒకవైపు వ్యవసాయ సీజన్.. మరోవైపు.. విద్యాసంవత్సరం ప్రారంభం అవుతున్న సమయంలో రైతులు, విద్యార్థులకు మేలు చేయాల్సిన దిశగా నిర్ణయాలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా వారాల తరబడి విదేశాల్లోమకాం వేయడంఏంటని జేడీ నిలదీశారు. ఇలాంటి సమయంలోనే ముఖ్యమంత్రి అనే నాయకుడు రాష్ట్రంలో ఉండి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని.. ప్రజలకు భరోసా ఇవ్వాలని అన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన జగన్.. తన కుటుంబంతో సహా విహార యాత్రకు వెళ్లడంసరికాదని పెదవివిరిచారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates