‘ఎక్కడున్నా భారత్‌కు తిరిగొచ్చి విచారణకు హాజరవ్వు. తప్పించుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. ఏ తప్పూ చేయకపోతే.. ఎందుకు భయపడుతున్నావ్? ఎన్ని రోజులు దొంగా పోలీసు ఆట ఆడుతావు..? విదేశం నుంచి వచ్చి విచారణకు సహకరించు’ అని మాజీ ప్రధాని దేవె గౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి విజ్ఞప్తి చేశారు.
కర్ణాటక సెక్క్ స్కాండల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ కు హెడీ దేవెగౌడపై ఏమాత్రం గౌరవం ఉన్నా 48 గంటల్లో స్వదేశానికి తిరిగి వచ్చి సిట్ ఎదుట లొంగిపోవాలని కుమారస్వామి కోరడం విశేషం.
ఏప్రిల్ 26న జరిగిన కర్ణాటక లోక్‌సభ ఎన్నికల తొలి దశకు ముందు ప్రజ్వల్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత అతను విదేశాలకు వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు ప్రజ్వల్‌పై అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు. అయితే, ఇప్పటి వరకూ అతడు భారత్‌కు తిరిగిరాలేదు. పలుమార్లు భారత్ కు టికెట్ బుక్ చేసుకుని ఆఖరు నిమిషంలో రద్దు చేసుకున్నాడు.
తాను బేషరతుగా ప్రజలకు క్షమాపణలు కోరుతున్నానని, అశ్లీల కేసు తమ కుటుంబం మొత్తాన్ని తల దించుకునేలా చేసిందని కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates