Political News

యూ ట‌ర్న్ తీసుకోవాల్సిందే.. మ‌రో ఆప్ష‌న్ లేదు

త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం నాయ‌కులు పార్టీలు మార‌డం సాధార‌ణ‌మే. సొంత పార్టీలో ప‌ద‌వులు ఊడినా.. స‌రైన ప్రాధాన్య‌త ద‌క్క‌క‌పోయినా అవ‌తలి పార్టీలోకి జంప్ చేయ‌డం కామ‌నే. కానీ ఇత‌ర పార్టీల ప‌రిస్థితి కూడా అంతంత‌మాత్రంగానే ఉంటే ఏం చేస్తారు? ఏం జ‌రిగినా సొంత పార్టీలోనే కొన‌సాగుతారు. ఇప్పుడు ఏపీలో వైసీపీ నేత‌ల ప‌రిస్థితి కూడా అలాగే ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇటీవ‌ల జ‌గ‌న్ కొత్త మంత్రివ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి …

Read More »

సుప్రీం బోనులో జ‌గ‌న్ ! ఈ సారీ నిరాశే !

ఏపీ స‌ర్కారు తీవ్ర ఆర్థిక సంక్షోభాల‌ను చ‌వి చూస్తోంది. అయినా కూడా మొండి ధైర్యంతో వెళ్తోంది. ముఖ్యంగా నిధులు లేక కొన్ని చోట్ల కొన్ని ప‌నులు నిలిపివేసింది. కొన్ని చోట్ల అత్యవ‌స‌రం అనుకుని ఖ‌ర్చు చేయాల్సిన నిధులను ప‌క్క‌దోవ ప‌ట్టిస్తోంది. ఆ మ‌ధ్య ఉపాధి నిధుల‌ను ఇలానే ప‌క్క‌దోవ ప‌ట్టించి అభాసుపాలైంది. అప్ప‌ట్లో కోర్టు జోక్యంతో నిధుల మ‌ళ్లింపు ఆగింది. ఆ త‌రువాత ఉద్యోగుల భ‌విష్య నిధి ఖాతాలోని నిధులు …

Read More »

క్రెడిట్ కోసం బీజేపీ, కాంగ్రెస్ ఆరాటం

తమ వల్లే యాసంగి ధాన్యం కొనుగోలుకు కేసీయార్ ప్రభుత్వం నిర్ణయించినట్లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు క్రెడిట్ కోసం ఆరాటపడుతున్నాయి. ధాన్యం కొనుగోలు ఎవరు చేయాలనే విషయమై గడచిన ఆరు మాసాలుగా కేంద్ర ప్రభుత్వం-రాష్ట్ర ప్రభుత్వం మధ్య పెద్ద వివాదం నడిచిన విషయం తెలిసిందే. ఇదే విషయమై కేంద్రంపై యుద్ధమన్నారు, భూకంపం సృష్టిస్తానని కేసీయార్ భీకరమైన ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ తో పాటు ఢిల్లీలో కూడా కేంద్రానికి వ్యతిరేకంగా …

Read More »

నిధులు లేక‌.. వైసీపీ నాయ‌కుల క‌న్నీళ్లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక ప‌రిస్థితి అధికార వైసీపీ ప్ర‌భుత్వానికి అతిపెద్ద స‌మ‌స్య‌గా మారింది. అప్పుల్లో కూరుకుపోతున్న రాష్ట్రాన్ని గాడిన పెట్ట‌డంలో సీఎం జ‌గ‌న్ విఫ‌ల‌మ‌వుతున్నారంటూ ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. ప్ర‌భుత్వ రోజువారీ కార్య‌క‌లాపాలు సాగించాలన్నా రుణాలు తీసుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి తలెత్తింద‌ని ఆరోపిస్తున్నాయి. సంక్షేమ ప‌థకాల పేరుతో ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు పంచేందుకు ప్రాధాన్య‌త‌నిస్తున్న జ‌గ‌న్‌.. రాష్ట్ర అభివృద్ధిని ఎప్పుడో మ‌ర్చిపోయారంటూ ప్ర‌త్య‌ర్థి పార్టీలు మండిప‌డుతున్నాయి. అస‌లు నిధులు ఉంటేనే క‌దా అభివృద్ధి చేసేద‌ని …

Read More »

ఐఏఎస్ పై హైకోర్టు సీరియస్

హైకోర్టు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై బాగా సిరియస్ అయ్యింది. కోర్టు ధిక్కరణ పిటీషన్ను చాలా సీరియస్ గా తీసుకుంటామని న్యాయమూర్తి శ్రీలక్ష్మిని తీవ్రంగా హెచ్చరించారు. ఇంతకీ విషయం ఏమిటంటే కొన్ని ప్రాంతాల్లో స్కూళ్ళ కాంపౌండ్లలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే దీన్ని చాలెంజ్ చేస్తు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీన్ని విచారించిన కోర్టు వెంటనే స్కూళ్ళల్లో గ్రామ సచివాలయాలను, భరోసా కేంద్రాలను …

Read More »

జ‌గ‌న్ బాదుడుతో జ‌నం విలవిల‌.. చంద్ర‌బాబు ఫైర్‌

ఏపీ సీఎం జ‌గ‌న్‌పైటీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో ఫైర‌య్యారు. జ‌నాల్ని ఇలా బాదేస్తారా? అని నిల‌దీశారు. ముఖ్యమం త్రి జగన్ ‘బాదుడే బాదుడు’ చర్యలతో ప్రజలు విలవిల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ తన అసమర్థ పాలనతో పేదలపై పన్నులు వేస్తూ, ఛార్జీలు పెంచుతూ ప్రజలను పీక్కుతుంటున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే …

Read More »

మంత్రిగా ప‌నికిరానా..? జ‌గ‌న్‌ పై ఎస్సీ ఎమ్మెల్యే ఫైర్‌

ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పెద్ద దుమారం రేపుతోంది. ఆశావహులు చెలరేగిపోతున్నారు. వారిని శాంతింపజేసేందుకు దూతలు చర్చలు జరుపుతున్నారు. అయినా వారిని శాంతింపజేయడం అధికార పార్టీకి తెలనొప్పిగా మారింది. ఈ క్ర‌మంలో విశాఖ జిల్లా పాయ‌క‌రావు పేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు కూడా మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. అయితే.. ఆయ‌న తీవ్ర సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కార్యకర్తల కోసం హింసావాదిగా మారతానని, హింసా రాజ‌కీయాలు చేస్తాన‌ని సీఎం జగన్‌కు అల్టిమేటం జారీ …

Read More »

వెంట్రుక పీక‌లేద‌న్న‌ది.. వాళ్ల నేత‌ల‌నే.. జ‌గ‌న్‌పై జేసీ కామెంట్స్‌

త‌న వెంట్రుక కూడా పీకలేరన్న ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు.. ప్ర‌తిప‌క్షాలను ఉద్దేశించి చేసిన‌వి కావ‌ని.. అవి వైసీపీ ఎమ్మెల్యే లను ఉద్దేశించి చేసినట్లు ఉందని తెలుగుదేశం పార్టీ నేత తాడిప‌త్రి మునిసిపాలిటీ చైర్మ‌న్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఇష్టం వచ్చినట్లు మంత్రివర్గ కూర్పు చేసినా.. ఎవరూ ఏమీ చేయలేరన్నదే జగన్ ఉద్దేశం కావచ్చన్నారు. అయితే విద్యాదీవెన పేరిట విద్యార్థులతో సభ ఏర్పాటు చేసిన సీఎం అక్కడ అలాంటి వ్యాఖ్యలు చేయడం …

Read More »

ఏపీలో బాదుడు నామ సంవ‌త్స‌రం.. కొత్త‌గా ఆర్టీసీ బాదుడు!

ఏపీలో బాదుడు నామ సంవ‌త్స‌రం కొన‌సాగుతోంది. ఈ ఏడాది ఉగాది నుంచి విద్యుత్ చార్జీల‌ను పెంచిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. తాజాగా ఆర్టీసీ చార్జీల‌ను కూడా భారీగా పెంచింది. ఇదంతా కూడా పేద‌లు, దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది. ఇప్ప‌టికే పెట్రోల్ చార్జీల రూపంలో వ్యాట్‌ను ఏమాత్రం త‌గ్గించ‌ని రాష్ట్ర స‌ర్కారు.. ఇలా వ‌రుస పెట్టి చార్జీలు పెంచ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తాజాగా.. డీజిల్ సెస్‌ …

Read More »

జ‌గ‌న్ చెప్పిన‌ట్టు చేస్తా.. మ‌న‌సు విప్పేసిన మంత్రిగారు!

ఏపీలో కొత్త‌గా కొలువు దీరిన మంత్రివ‌ర్గంలో ఒక్కొక్క మంత్రి త‌మ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తున్నారు. ముహూర్తం .. వ‌ర్జ్యం.. ఇలా అన్నీ చూసుకుని త‌మ త‌మ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తున్నారు. అయితే.. ఇలా బాధ్య‌త‌లు తీసుకుంటున్న‌వారు..తమ మ‌న‌సులో ఉన్న మాట‌ల‌ను దాచుకోలేక పోతున్నారు. వెంట‌నే బ‌య‌ట పెట్టేస్తున్నారు. ఎవ‌రు ఏమ‌నుకుంటారో..అనే బాధ కూడా లేకుండా.. ఎలాంటి మొహ‌మాటానికీ తావివ్వ‌ని విధంగా.. సీఎం జ‌గ‌న్‌కు భ‌జ‌న చేస్తున్నారు. నిన్న‌టికి నిన్న స‌మాచార శాఖ మంత్రిగా …

Read More »

త‌మిళిసై వ్య‌వ‌హారం.. కేసీఆర్ ఫైర్‌.. ఏమ‌న్నారంటే!

తెలంగాణలోని కేసీఆర్ ప్ర‌భుత్వానికి, గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైకి మ‌ధ్య ఏర్ప‌డిన వివాదం.. మ‌రింత ముదురుతోంది. తాజాగా జ‌రిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో గవర్నర్ తమిళిసై ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నారని, పర్యటనలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది. మంత్రివర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గవర్నర్‌ అత్యుత్సాహంతో వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నట్లు విశ్వసనీయవర్గాల …

Read More »

గాలి పీల్చినా.. జే ట్యాక్స్ క‌ట్టాలా.? లోకేష్ ఫైర్‌

ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కారుపై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్ర‌స్తాయిలో మండిప‌డ్డారు. జగన్ ప్రభుత్వం పెంచిన పన్నులపై విమ‌ర్శ‌లు గుప్పించారు. పన్నులను భారీగా పెంచి.. సామాన్యులపై మోయలేని భారాన్ని వేస్తున్నారని ఆరోపించారు. పన్నుల పెంపును తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్‌ మాటలు వింటుంటే గాలి పీల్చినా… వదిలినా పన్ను వేసేలా ఉన్నారని లోకేశ్‌ ఎద్దేవా చేశారు. ‘కాదేది బాదుడే బాదుడుకు అనర్హం’ అన్నట్టుగా వైసీపీ ప్రభుత్వం …

Read More »