Political News

గాలి పీల్చినా.. జే ట్యాక్స్ క‌ట్టాలా.? లోకేష్ ఫైర్‌

ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కారుపై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్ర‌స్తాయిలో మండిప‌డ్డారు. జగన్ ప్రభుత్వం పెంచిన పన్నులపై విమ‌ర్శ‌లు గుప్పించారు. పన్నులను భారీగా పెంచి.. సామాన్యులపై మోయలేని భారాన్ని వేస్తున్నారని ఆరోపించారు. పన్నుల పెంపును తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్‌ మాటలు వింటుంటే గాలి పీల్చినా… వదిలినా పన్ను వేసేలా ఉన్నారని లోకేశ్‌ ఎద్దేవా చేశారు. ‘కాదేది బాదుడే బాదుడుకు అనర్హం’ అన్నట్టుగా వైసీపీ ప్రభుత్వం …

Read More »

కేసీయార్ ఏమి సాధించినట్లు ?

ఢిల్లీకి పోయి కేంద్రాన్ని నోటికొచ్చినట్లు తిట్టారు. నరేంద్ర మోడిపై యుద్ధాన్ని ప్రకటించారు. అదన్నారు ఇదన్నారు చివరకు యాసంగి ధాన్యం మొత్తాన్ని కొనాలని కేసీయార్ ప్రభుత్వం డిసైడ్ చేసింది. మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో యాసంగి ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే కొనాలని డిసైడ్ చేసినట్లు మీడియా సమావేశంలో కేసీయార్ ప్రకటించారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేయటానికి అవసరమైన రు. 3500 కోట్లను కూడా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయడానికి ఇష్టపడటం లేదని …

Read More »

ఇటు ఫిర్యాదు అటు ప‌ద‌వి.. టీ కాంగ్రెస్ తీరే వేర‌యా..!

తెలంగాణ కాంరెస్ ప‌ట్ల అధిష్ఠానం వ్య‌వ‌హార శైలి వింత‌గా ఉంది. ఎవ‌రికి ఎప్పుడు ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతుందో.. ఎవ‌రిని ఎందుకు అంద‌లం ఎక్కిస్తుందో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది. పార్టీ నేత‌ల‌కు ఒక్కోసారి నెల‌ల త‌ర‌బ‌డి వేచి చూసినా అధిష్ఠానం అపాయింట్మెంట్ ఇవ్వ‌దు. ఇంకొన్ని సార్లు వారు అడ‌గ‌క‌పోయినా అపాయింట్మెంట్ ల‌భిస్తుంది. కొంద‌రిని రాహుల్ క‌లిస్తే మ‌రికొంద‌రు సోనియాతో భేటీ అవుతారు. అధిష్ఠానం వైఖ‌రిని పార్టీలో కొంద‌రు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ముఖ్యంగా రేవంత్ …

Read More »

ప‌వ‌న్ మ‌రో గొప్ప నిర్ణ‌యం

రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రూ ఆదాయ మార్గాల వైపే చూస్తారు. ఉన్న వ్యాపారాల‌ను పెంచుకోవ‌డం, కొత్తగా ఆదాయం పొంద‌డానికి చూడ‌టం.. ఇదే జ‌రుగుతుంటుంది. త‌మ పార్టీ త‌ర‌ఫున ఏవైనా స‌హాయ కార్య‌క్ర‌మాలు చేసినా.. అవి పార్టీకి వ‌చ్చే విరాళాల‌తోనే చేస్తారు. లేదంటే పార్టీలో ఉన్న బిగ్ షాట్ల‌తో ఖ‌ర్చు పెట్టిస్తారు. కానీ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం ఇందుకు భిన్నం. ఆయ‌న సినిమాల ద్వారా సంపాదించిన డ‌బ్బుల‌తోనే పార్టీని …

Read More »

ద‌త్త‌పుత్రుడుపై ప‌వ‌న్ హాట్ కామెంట్స్

2014 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూట‌మికి మ‌ద్ద‌తుగా నిలిచి ఆ పార్టీ అధికారంలోకి రావ‌డానికి తోడ్పాటు అందించాడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఐతే ఇందుకు గాను ప‌వ‌న్ ఎలాంటి ప్ర‌తిఫ‌లం అందుకోలేద‌న్న‌ది స్ప‌ష్టంగానే క‌నిపిస్తుంటుంది. ప్ర‌భుత్వంలో భాగస్వామి కాలేదు. త‌న‌కో, త‌న పార్టీ వాళ్ల‌కో ఎమ్మెల్సీలు, రాజ్య‌స‌భ ప‌ద‌వో ఇప్పించుకోలేదు. ఇక తెర వెనుక డ‌బ్బులు పుచ్చుకునే వాడే అయితే పార్టీ న‌డ‌ప‌డం కోసం ఆస‌క్తి లేకున్నా, …

Read More »

ఇంకా జ‌గ‌న్ పాటే.. మాజీ మంత్రిపై ఆ సామాజిక వ‌ర్గం గుర్రు!

తాజాగా ఏపీలో ఏర్ప‌డిన జ‌గ‌న్ 2.0 కేబినెట్‌లో కీల‌క‌మైన వైశ్య సామాజిక వ‌ర్గానికి స్థానం ద‌క్క‌లేదు. గ‌త కేబినెట్‌లో మాత్రం విజ‌య‌వాడ ప‌శ్చిమ ఎమ్మెల్యే వెలంప‌ల్లి శ్రీనివాస్‌కు అవ‌కాశం క‌ల్పించారు. కానీ, తాజాగా మంత్రి వ‌ర్గంలో ఎవ‌రికీ అవ‌కాశం ఇవ్వ‌లేదు. పోనీ..ఎమ్మెల్యేలు లేరా..అంటే.. కీల‌క‌మైన అన్నా రాంబాబు(గిద్ద‌లూరు), కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి(విజ‌య‌న‌గ‌రం) ఉన్నారు. అయినా.. వీరికి ప్రాధాన్యం లేకుండా పోయింది. దీంతో వైశ్య సామాజిక వ‌ర్గం.. స్వ‌చ్ఛందంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తోంది. …

Read More »

జ‌గ‌న్ ను ఆరాధించండి అన్ని ప‌నులు అవుతాయి మంత్రిగారి భ‌జ‌న‌

జ‌గ‌న్ 2.0 కేబినెట్‌లో చోటు ద‌క్కించుకున్న మంత్రులు త‌లకో ర‌కంగా స్పందిస్తున్నారు. మంత్రి వ‌ర్గ ప్ర‌మాణ స్వీకార స‌మ‌యంలోనే స్వామి భ‌క్తిని, భ‌జ‌న‌ను ప్ర‌ద‌ర్శించిన నాయ‌కులు.. మంత్రులుగా బాధ్య‌త‌లు తీసుకున్నాక‌.. త‌మ విశ్వ‌రూపం చూపిస్తున్నారు. తాము చేస్తున్న భ‌జ‌న చాల‌ద‌న్న‌ట్టుగా.. మీడియాను కూడా భ‌జ‌న చేయాల‌ని.. ప్రోత్స‌హిస్తున్నారు. అంతేకాదు.. జ‌గ‌న్ గురించి.. ఆయ‌న లోపాల గురించి కూడా ఆరా తీయొద్ద‌ని సూటిగా చెబుతున్నారు. అంతేనా.. ఇలా చేస్తే.. మీకు ప‌నులు …

Read More »

మొదలుకానున్న భరోసా యాత్ర

ఈ మద్యనే చెప్పినట్లు జనసేన అధినేత కౌలు రైతుల కోసం భరోసా యాత్ర మొదలు పెడుతున్నారు. తన యాత్రను పవన్ అనంతపురం జిల్లాలోని కొత్తచెరువు నుంచి మంగళవారం ప్రారంభిస్తున్నారు. తన యాత్రలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు పవన్ ఆర్థిక సాయం అందించబోతున్నారు. అలాగే కొత్త చెరువులోని కౌలు రైతులతో గ్రామ సభ కూడా నిర్వహిస్తారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు తలా లక్ష రూపాయల ఆర్ధిక …

Read More »

ప్రతిపక్షాల గోలేమిటో అర్థం కావటం లేదే ?

జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం పై ప్రతిపక్షాల గోలేమిటో అర్థం కావటం లేదు. మంత్రివర్గంలో ఎవరుండాలి ? ఎవరిని తీసేయాలనేది పూర్తిగా జగన్ ఇష్టం. మంత్రివర్గం మార్పులు, చేర్పులనేది నూరుశాతం అధికార పార్టీ అంతర్గత విషయం. సమస్యలు, అసంతృప్తులుంటే అది జగన్, మిగిలిన వాళ్ళు చూసుకుంటారు. ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఇతర పార్టీలకు ఏ మాత్రం లేదు. కానీ ఈ విషయంలో ప్రతిపక్షాలు రెచ్చిపోతున్నాయి. టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు …

Read More »

రోజా 2.0 చూస్తామా

అనూహ్యంగా మంత్రివర్గంలో ఆర్కే రోజా చోటు దక్కించుకున్నారు. మంత్రివర్గం ఆశావహుల జాబితాలో రోజా పేరు కొన్నిసార్లు కనబడి మరికొన్నిసార్లు మాయమైపోయింది. దాంతో తనకు ఇక మంత్రిపదవి యోగం లేదని నిర్ధారించుకున్న నగిరి ఎంఎల్ఏ వెళ్ళి హైదరాబాద్ లో కూర్చున్నారు. అయితే తెరవెనుక ఏమి మార్పులు జరిగిందో ఏమోకానీ చివరి నిముషంలో మంత్రివర్గంలోకి రోజా కూడా చేరిపోయారు. దాంతో రోజా అభిమానులు, రాజకీయాలకు సంబంధం లేని కొంతమంది కూడా హ్యాపీగా ఉన్నారు. …

Read More »

పృథ్వీకో న్యాయం.. అంబటికో న్యాయమా?

ఈ రోజుల్లో అవినీతి ఆరోపణల కంటే కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు రాజకీయ నాయకుల ఇమేజ్‌ను ఎక్కువ డ్యామేజ్ చేస్తుంటాయి. మహిళల్ని లైంగికంగా వేధించినా, శృంగారం జరిపినా.. లేక సరస సంభాషణలు చేసినా.. వాటి తాలూకు ఆడియోలు, వీడియోలు రిలీజయ్యాయంటే అంతే సంగతులు. ఇమేజ్ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. జనాల్లో ఏహ్య భావం కలుగుతుంది. సోషల్ మీడియాకు ఇలాంటి కంటెంట్ దొరికితే పరువు గంగలో కలిసిపోతుంది. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ …

Read More »

సజ్జలే టార్గెట్ అవుతున్నారా ?

అధికార పార్టీలో నేతల దృష్టిలో పాపాల భైరవుడు ఎవరయ్యా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి పేరే వినబడుతోంది. నెగిటివ్ గా ఎవరు టార్గెట్ చేయాలన్నా ముందుగా సజ్జలే టార్గెట్ అవుతున్నారు. మంత్రి పదవుల్లో తమ పేర్లు లేకుండా పోవటానికి సజ్జలే కారణమని కొందరు సీనియర్లు తీవ్ర అసంతృప్తిగా ఉండటమే ఉదాహరణ. గతంలో పీఆర్సీ విషయంలో కూడా ఉద్యోగ సంఘాల నేతలు డైరెక్టుగా సజ్జలపైనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం గుర్తుండే …

Read More »