ఏపీ సీఎం జగన్ పర్యటనలో ఘోర అవమానం ఎదురైంది. ఇప్పటికే కర్నూలులో ఎన్నికల ప్రచారం నిమిత్తం పర్యటించిన సీఎం జగన్కు మహిళలు ఖాళీ బిందెలతో ఎదురొచ్చి తీవ్ర నిరసన తెలిపారు. తాజాగా మరో ఘోరం చోటు చేసుకుంది. ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్న హై సెక్యూరిటీ బస్సుపైకి ఆగంతుకుడు చెప్పులు విసిరాడు. అనంతపురం జిల్లాలో సీఎం జగన్.. ‘మేమంతా సిద్ధం’ పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన …
Read More »నా సెక్యూరిటీ ఆఫీసర్ మాటకు కన్నీళ్లు తిరిగాయి: చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నా సెక్యూరిటీ ఆఫీసర్ నాకో మాట చెప్పాడు. ఆ మాట విన్నాక నా కళ్లలో నీళ్లు తిరిగాయి. జగన్ పాలనలో రాష్ట్రం గంజాయి వనంగా మారిపోయింది. దీనికి బానిసలై.. అనేక మంది యువకులు జీవితాలను పాడు చేసుకుంటున్నారు” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ప్రజాగళం పేరుతో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ …
Read More »వైసీపీ ఊహించని షాక్.. ఈసీ సంచలన ఆదేశాలు!
ఏపీలో అధికార పార్టీ వైసీపీకి కేంద్ర ఎన్నికల సంఘం కలలో కూడా ఊహించని షాక్ ఇచ్చింది. కీలకమైన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల వేళ.. వలంటీర్లను అన్ని విధుల నుంచి తప్పించాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. వలంటీర్లతో అమలు చేస్తున్న పింఛన్ల పంపిణీ సహా.. ఏ కార్యక్రమానికీ అనుమతులు ఇవ్వద్దని అధికారులను ఆదేశించింది. అసలు వలంటీర్లు ఎవరూ ఏ పనీ చేయడానికి వీల్లేదని పేర్కొంది. అంతేకాదు.. వారికి ప్రభుత్వం …
Read More »ముందు లోకేష్ ను కలిసిన BJP చౌదరి గారు
కేంద్ర మాజీ మంత్రి, ఒకప్పటి టీడీపీ నాయకుడు, ప్రస్తుతం బీజేపీలో ఉన్న సుజనా చౌదరి తాజాగాటీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్తో భేటీ అయ్యారు. నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చిన సుజనా చౌదరి.. ఇక్కడే ఉంటున్న నారా లోకేష్ నివాసానికి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోల ను సుజనా చౌదరి తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై …
Read More »‘బుట్ట’లో పడ్డ జగన్!
ప్రస్తుతం ‘మేం సైతం సిద్ధం’ పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎం, వైసీపీ అధినేత జగన్.. చేస్తున్న వ్యాఖ్యల్లో తేడాలు కనిపిస్తున్నాయి. వీటిని నెటిజన్లు, ప్రతిపక్ష నాయకులు కూడా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పర్యటించిన జగన్.. ఇక్కడి వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకను ఆయన ప్రజలకు పరిచయం చేశారు. వాస్తవానికి కర్నూలు ప్రజలకు బుట్టా రేణుకను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. …
Read More »రేవంత్ ను కలిసిన నందమూరి వారసురాలు
నందమూరి కుటుంబం నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన రెండో మహిళ.. నందమూరి సుహాసిని. తొలి మహిళ, ప్రస్తుతం బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి. అయితే.. సుహాసిని తాజాగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. ఆమె నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. రేవం త్ నివాసానికి వెళ్లిన నందమూరి సుహాసిని పుష్పగుచ్ఛం అందించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛా ర్జీ దీపాదాస్ మున్షీ, మంత్రి కొండా …
Read More »కూటమి పార్టీలు తప్పు చేశాయి: రఘురామ
టికెట్ ఇవ్వలేదు. ఇస్తారనే సంకేతాలు కూడా పెద్దగా కనిపించడం లేదు. అయినా కూడా.. నరసాపురం రెబల్ ఎంపీ.. రఘురామకృష్ణ రాజు మాత్రం నమ్మకం పోగొట్టుకోవడం లేదు. తాజాగా కూడా మరోసారి రఘురామ తనకు టికెట్ ఇస్తారని, వస్తుందని చెప్పడం గమనార్హం. తాజాగా రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. కూటమి పార్టీలు తప్పులు చేశాయని చెప్పారు. “కూటమిగా ఏర్పడిన బీజేపీ-జనసేన-టీడీపీలు.. సీట్ల కేటాయింపుల్లో కొన్ని తప్పులు చేశాయి. అయితే.. …
Read More »చూశారా తమ్ముళ్లూ.. చంద్రబాబు కష్టం!
చంద్రబాబు. ఈ పేరు కష్టానికి చిరునామా.. విజన్కు మారుపేరు. రాబోయే 25 ఏళ్ల తర్వాత ఎలా ఉంటానే విషయాన్ని ముందుగానే లెక్కలు వేసుకుని.. దానికి తగిన విధంగా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకునే నాయకుడిగా చంద్రబాబుకు మంచి పేరుంది. ఆది నుంచి ఆయన రాజకీయ జీవితం.. పూల పాన్పుపై ప్రయాణ మైతే కాదు. ‘కష్టం-లక్ష్యం’ అనే ఈ రెండు పట్టాలే ప్రాతిపదికగా.. చంద్రబాబు రాజకీయ ప్రయాణం సాగింది. ఇప్పుడు 75 …
Read More »కేసీయార్ రాజకీయ పయనమెటు.?
అయిపోయింది.. అంతా అయిపోయింది.! ఔను, ‘తెలంగాణ జాతి పిత’ అన్న ట్యాగ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముందర ఇకపై వుండకపోవచ్చు.! తెలంగాణ రాజకీయ తెరపైనుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ఏనాడో కనుమరుగైపోయింది. ఇప్పుడున్నది భారత్ రాష్ట్ర సమితి. ఎప్పుడైతే, పార్టీ పేరు నుంచి ‘తెలంగాణ’ని తొలగించేశారో, అప్పుడే ఖేల్ ఖతం అయిపోయింది.! ఒకరొకరుగా భారత్ రాష్ట్ర సమితిని వీడుతున్నారు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి టిక్కెట్లు దక్కించుకున్న అభ్యర్థులూ పార్టీని …
Read More »గడబిడలో జనసేన.. 3 సీట్లకు అభ్యర్థులను ప్రకటించని పవన్!
జనసేన పార్టీ గడబిడలో ఉందా? కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీల నుంచి తీసుకున్న సీట్లు తక్కువే(21) అయినా..ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదా? అంటే.. ఔననే అంటున్నారు జనసేన నాయకులు. ఇంకా మరో ముగ్గురు అభ్యర్థులను జనసేన ప్రకటించాల్సి ఉంది. దీంతో జనసేన నాయకులు ఏదో కిరికిరి జరుగుతోందనే వాదన వినిపిస్తున్నారు. అంతేకాదు.. తేడా వస్తే.. పార్టీకి రాజీనామా తప్పదని కీలక నేతలు వ్యాఖ్యానించడం గమనార్హం. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి …
Read More »ఆర్థిక దిగ్బంధనంలో కాంగ్రెస్.. 1700 కోట్లు కట్టాలని నోటీసులు
దేశవ్యాప్తంగా తిరిగి పుంజుకుని.. అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న జాతీయ పార్టీ కాంగ్రెస్.. ఆత్మరక్షణలో పడిపోయింది. కీలకమైన ఎన్నికల వేళ.. ఆ పార్టీ పునాదులు కదిలిపోతున్నాయి. ఒకవైపు నేతలు పోతున్నారు. మరో వైపు కేసుల ఉచ్చు బిగుసు కుంటోంది. తాజాగా ఆదాయపు పన్నుకు సంబంధించి కాంగ్రెస్కు మరోసారి ఐటీ నుంచి నోటీసులు అందాయి. 2017-18 నుంచి 2020-21 అసెస్మెంట్ సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీతో సహా దాదాపు రూ.1700 కోట్ల నోటీసును …
Read More »బాలయ్యపై ఒంటిరి పోరుకు సాములోరు రెడీ!
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం హిందూపురం అసెంబ్లీ స్థానం. ఇక్కడ నుంచి వరుసగా ఇప్పటి వరకు నందమూరి బాలకృష్ణ విజయం దక్కించుకున్నారు. గతంలో ఎన్టీఆర్ కూడా ఇక్కడ నుంచి గెలిచారు. ఇక, 2014, 2019లో బాలయ్య గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. ఈ సారి ఆయనపై స్వాములోరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఆయన తాజాగా ప్రకటన కూడా చేశారు. వాస్తవానికి మూడో సారి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates