తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ఉండాలని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల అనుకుంటున్నారు. నిత్యం ఎవరోకరి మీద ఆరోపణలు చేస్తూ వార్తల్లో కొనసాగేందుకు వైస్సార్ బిడ్డ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె రాష్ట్రంలోని అన్ని పార్టీలపై దుమ్మెత్తి పోస్తున్నారు. సీఎం కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారు. ఇద్దరు మహిళామణుల మధ్య నువ్వా నేనా అన్న ఫైట్ నడుస్తోంది. లిక్కర్ స్కాంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు కవితను …
Read More »పవన్ మాటతో డిష్యుం డిష్యుం
జనసేనాని పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాపు నేతల సమావేశం సందర్భంగా ఏపీలో కాపులందరూ ఏకతాటిపైకి రావాలని.. జనసేనకు మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునివ్వడం.. మునుపెన్నడూ లేని విధంగా కాపులకు చేరువ అయ్యేలా వ్యాఖ్యలు చేయడం పెద్ద చర్చకే తావిచ్చాయి. ఇవన్నీ ఒకెత్తయితే.. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు విషయమై పవన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పటికే కొన్ని …
Read More »రాబిన్ టీం టీడీపీని ఇంత ముంచేస్తుందా!
రాజకీయాల్లో వ్యూహకర్తల కాలం నడుస్తోంది. ఎవరు కాదన్నా.. ఔనన్నా.. ప్రస్తుతం వ్యూహకర్తలే కీలకంగా మారారు. గత 2014 తర్వాత.. రాజకీయాల్లో చోటు చేసుకున్న మార్పుల కారణంగా.. వ్యూహకర్తలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఉత్తరాది నుంచి దిగుమతి చేసుకుని మరీ..ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు. ఆదిలో వైసీపీ అధినేత జగన్ ప్రశాంత్ కిశోర్ బృందాన్ని తెచ్చుకుని.. 2019 ఎన్నికల్లో విజయానికి బాటలు వేసుకున్నారు. ఇక, జగన్ విషయంలో పీకే వచ్చాక.. పీకేకి ముందు.. అన్నట్టుగా …
Read More »యూత్ ఫార్ములానే కాంగ్రెస్ నమ్ముకున్నదా ?
రాబోయే ఎన్నికలకు సంబంధించి తెలంగాణా కాంగ్రెస్ యూత్ ఫార్ములాను నమ్ముకున్నట్లుంది. 25 శాతం టికెట్లను యూత్ కే కేటాయించాలని ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి ప్రపోజల్ పంపారట. దానికి ఖర్గే కూడా ఓకే చెప్పారని పార్టీవర్గాల సమాచారం. పార్టీలో దశాబ్దాలుగా ఉన్న నేతల్లో చాలామంది గుదిబండలుగా మారారనే ఆరోపణలు ఎప్పటినుండో వినబడుతున్నదే. పార్టీలోకి కొత్త నీటిని ఆహ్వానించాలనే డిమాండ్లు కూడా పెరిగిపోతున్నాయి. ఎంతసేపూ …
Read More »అన్న తిరుగుబాటు తమ్ముడు సస్పెన్షన్
నెల్లూరు వైసీపీలో వింతలు జరుగుతున్నాయి. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బజారున పడి తిట్టుకుంటున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయిన రెబెల్ స్టార్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అనిల్ ఇలాకాలో హల్ చల్ చేసేందుకు కోటంరెడ్డి ప్రయత్నిస్తున్నారు. శ్రీధర్ రెడ్డిపై సీరియస్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైసీపీ అధిష్టానం సీరియస్‌గా ఉంది. పార్టీ నుంచి పూర్తిగా …
Read More »కాపు నేతలు పెద్దన్నలు కావాలి: పవన్ పిలుపు
ఏపీ అధికార పార్టీ వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. తన దగ్గర వెయ్యి కోట్లు లేవని..పార్టీని ఏకబిగిన నడపలేనని వ్యాఖ్యానించారు. నేతలను కూడా కొనుగోలు చేసే శక్తి తనకు లేదన్నారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో వరుసగా రెండో రోజు జరిగిన కాపు సంక్షేమ సేన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎవరితోనూ లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకోనన్నారు. వాస్తవిక ధోరణి ఎలా ఉందో దృష్టిలో పెట్టుకునే వ్యవహరిస్తానని …
Read More »కాంగ్రెస్‌కు మాజీ సీఎం నల్లారి రిజైన్
గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చే నిజమైంది. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి త్వరలోనే బీజేపీలోకి చేరతారంటూ.. పెద్ద ఎత్తున చర్చ సాగిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన బీజేపీలోకి చేరతారో.. లేదో.. లైన్ క్లియరైందో లేదో.. అనే సందేహాలు మాత్రం వెంటాడాయి. తాజాగా దీనికి కూడా ఒక స్పష్టత వచ్చిందని అంటున్నారు పరిశీలకులు. దీనికి కారణం.. తాజాగా నల్లారి కాంగ్రెస్ పార్టీ …
Read More »జగన్ పోవాలి.. పవన్ రావాలి…
సైకో పోవాలి సైకిల్ రావాలి…. ఈ నినాదం చాలా రోజులుగా వినిపిస్తున్నదే. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించి టీడీపీని గెలిపించాలన్న ఉద్దేశంతో జనంలోకి ఆ నినాదాన్ని తీసుకెళ్లారు. ప్రాస పరంగా క్యాచీగా ఉండటంతో సైకో పోవాలి నినాదం సగటు ఓటర్లకు బాగానే ఎక్కింది. టీడీపీ ఎవరితో కలిసి పోటీ చేస్తుందో, పొత్తు భాగస్వాములు ఎవరో ఇంకా తెలియలేదు. జనసేనతో పొత్తు పెట్టుకోవడం ఖాయమనిపిస్తున్నప్పటికీ ఆ దిశగా చర్చలు జరగలేదు. ప్రకటనలు …
Read More »రాజయ్యా.. బుద్ధి మారదాయ్యా..!!
ఒక మనిషి ఒకసారి తప్పు చేస్తారు.. సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేస్తారు. మరి నాయకులు.. చేయరాని తప్పులకు కడు దూరంగా ఉండాలి. ఒకవేళ చపలచిత్తంతో చేసినా.. సరిదిద్దుకునే ప్రయత్నం అయినా చేయాలి. కానీ, బీఆర్ ఎస్ నాయకుడు, వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాత్రం తన బుద్ధి మార్చుకోవడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. మహిళల విషయంలో నాయకులు చాలా అప్రమత్తంగా ఉండాలి. కానీ, …
Read More »సందడి లేని వైసీపీ ‘ఆవిర్భావం’!
ఏపీ అధికార పార్టీ వైసీపీ ఆవిర్భవించి నేటికి 12 ఏళ్లు పూర్తయ్యాయి. నిజానికి వైసీపీలో ఏదైనా కార్యక్రమం అంటే.. పార్టీ నాయకులు.. అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేస్తారు. బాణాసంచా కాల్చి.. మిఠాయిలు పంచుకుని..కేకులు కట్ చేసి.. అబ్బో పెద్ద ఉత్సవాలే నిర్వహిస్తారు. అలాంటి ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో ఎక్కడా సందడి కనిపించడం లేదు. ఎవరూ మాట్లాడడమే లేదు. ఆఖరుకు సీఎం జగన్ కూడా ఓల్డ్ వీడియో ఒకటి ట్విట్టర్‌లో …
Read More »ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో భారీ ట్విస్ట్!
దేశాన్ని కుదిపేస్తున్న ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో వరుస ట్విస్టులు తెరమీదికి వస్తున్నాయి. ఈ కుంభకోణంలో సౌత్ గ్రూప్ పాత్ర ఉందని.. 100 కోట్లు ఈ గ్రూప్ .. ఆప్‌కు చేరవేసిందని ఈడీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఎమ్మెల్సీ కవితకు అరుణ్ రామచంద్ర పిళ్లయే బినామీ అని కూడా చెప్పింది. దీని ఆధారంగానే కవితను విచారించేందుకు కూడా రెడీ అయింది. అయితే.. అనూహ్యంగా పిళ్లయ్.. తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుని.. …
Read More »భాస్కరరెడ్డి వచ్చారు.. సీబీఐ రాలేదు
ఏపీ సహా దేశంలో సైతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆదివారం కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని సీబీఐ విచారించాల్సి ఉంది. ఈ కేసులో తీవ్ర దూకు డు ప్రదర్శిస్తున్న సీబీఐ.. అవినాష్‌తో పాటు ఆయన తండ్రిని కూడా అరెస్టు చేస్తామని.. ఇటీవల తెలంగాణ కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో తాజాగా భాస్కరరెడ్డి విచారణ అంశం.. పతాక స్థాయిలో చర్చకు వచ్చింది. ఏం …
Read More »