ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన అనగానే.. కొన్నిమార్కులు కనిపిస్తాయి. క్రమశిక్షణకు ఆయన మా రు పేరు. అంతేకాదు.. ఒక పనిని గంట సమయంలో చేయాల్సి ఉంటే.. దానిని పదినిమిషాల ముందుగా ఎందుకు చేయకూడదు? అనే తత్వం చంద్రబాబుది. అంతేకాదు.. పనిసమయానికి పూర్తి చేయడంతొ పాటు.. ఫ్యూచర్‌పైనా దృష్టి పెట్టాలనే విధంగా ఆయన మార్కు కనిపిస్తుంది. ఉద్యోగులను, ఉన్నతాధికా రులను కూడా ఆయన పరుగులు పెట్టించారు.
అదేవిధంగా ధర్నాలు, నిరసనలు అంటే చంద్రబాబుకు ఒకింత పడవు. ఎందుకంటే ఏ సమస్యనైనా శాంతి యుతంగా పరిష్కరించుకోవాలని చూసే తత్వం ఆయనది. అందుకే ఆయన హయాంలో ధర్నాలు నిరసనలు చేపట్టిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి.. తోకలు కట్ చేస్తా.. అంటూ కామెంట్లు చేశారు. ఉద్యోగులను సమయానికి రాకపోతే.. వేతనంలో కోతలు పెడతామంటూ.. హెచ్చరించారు. పనిని సమయానికి చేయాల్సిందేనని తేల్చి చెప్పేవారు.
అయితే.. ఇప్పుడు ఇలాంటి పరిణామాలు తగ్గుతాయనే తెలుస్తోంది. తన వరకు తాను క్రమశిక్షణగా ఉంటూ.. తన టీంను కూడా.. అలానే చూసుకునే అవకాశం ఉన్నా.. ఉద్యోగులపై గత ఒత్తిళ్లను ప్రదర్శించేందుకు.. ఆయన వెనుకాడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా పలు ఉద్యోగ సంఘాల నాయకులు చంద్రబాబును కలిసినప్పుడు.. ఒత్తిడి పెంచొద్దు సర్! వారు విన్నవించినప్పుడు.. “నాకు తెలుసు. నేను కూడా ఒత్తిడి భరించలేక ఇబ్బంది పడ్డాను. అయితే.. సమయానికి మాత్రం పని పూర్తి చేయండి చాలు” అని తేల్చి చెప్పారు.
అదేవిధంగా నిరసనలు, ధర్నాల విషయంలోనూ ఈ లిబరల్‌గానే చంద్రబాబు ఉండనున్నారు. ఎందుకంటే.. గత నాలుగు సంవత్సరాల్లో చంద్రబాబు స్వయంగా అనేక ధర్నాలు, నిరసనల్లో పాలు పంచుకున్నారు. అయితే.. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా చూసుకునేలా నే ప్రభుత్వ పాలనను ఆయన చక్కదిద్దనున్నారు. ఒకవేళ ఏదైనా చేయిదాటి పోయే పరిస్థితి వస్తే.. శాంతి యుతంగా చర్చించేందుకు కూడా ఆయన సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు. సో.. ఇక నుంచి ఒత్తిడి, పరుష పదాలు.. హెచ్చరికలు వంటివి చంద్రబాబు లేకుండానే తన పాలనను సజావుగా ముందుకు తీసుకువెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates