జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించనున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అయితే.. వాస్తవానికి ఎన్నికలకు ముందు వరకు కూడా.. ఆయన ప్రభు త్వంలో చేరేది లేదన్నారు. పదవులు ఆశించడం లేదని కూడా చెప్పారు.
ముందు పార్టీని బలోపేతం చేసుకుని ఓ పది మంది వరకు ఎమ్మెల్యేలను అసెంబ్లీ గడప దాటిస్తే.. చాలని ఆ తర్వాత.. నెమ్మడిగా పాతికేళ్లలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేద్దామని కూడా చెప్పారు.
అయితే.. అనూహ్యంగా ఆయన చంద్రబాబు ప్రభుత్వం పాత్ర తీసుకున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యత లు తీసుకున్నారు. పైగా.. చంద్రబాబు ఆయనకు తీరిక లేని మంత్రి త్వ శాఖను కట్టబెట్టారు.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలంటే.. ఎంత చేసినా పని ఉంటూనే ఉంటుంది. రోజుకు 24 గంటలు కష్టపడినా.. ఆయా ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించేందుకు సమయం ఉండదని అంటారు. అలాంటి శాఖను తీసుకున్నారు పవన్.
తద్వారా.. రెండు రకాల ప్రయోజనాలను పవన్ నెరవేర్చుకునే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పనితీరు కారణంగా.. ఆయన ప్రజల హృదయాలను కొల్లగొట్టేందుకు.. పార్టీ పరంగా ముందుకు సాగేందు కు అవకాశం ఉంటుంది.
అదేసమయంలో పాలన చేతకాదు.. అన్న విపక్ష నాయకులకు, కొందరు మేధా వులకు కూడా.. తన పనితీరుతో సమాధానం చెప్పేందుకు కూడా.. పవన్ కు పెద్ద అవకాశం దక్కినట్టే భావించాలి. ఇది ఆయన వ్యక్తిగత విషయాన్ని మాత్రమే కాదు.. పార్టీకి కూడా ప్రయోజనం చేకూర్చనుంది.
మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జనసేన పార్టీని బలోపేతం చేసుకుని.. చెరగని ముద్రను వేసుకుం టే.. అది వచ్చే 2029 ఎన్నికల నాటికి వైసీపీ ఓటు బ్యాంకు కూడా.. తనవైపు తిప్పుకొనే పక్కా వ్యూహం తో ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. గ్
రామీణ ప్రాంతాల్లో ఇప్పటిక ఈవైసీపీ బలంగా ఉంది. అందుకే 40 శాతం ఓటు బ్యాంకును పొందింది. ఇప్పుడుజనసేన కనుక డెవలప్ అయితే.. వైసీపీకి పూర్తిస్థాయిలో చెక్ పెట్టేందుకు కూడా పవన్‌కు ఒక పెద్ద అవకాశం వచ్చినట్టుగానే భావించాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates