గౌతం అదానీ. దేశంలోనే అత్యంత రిచ్చెస్ట్ వ్యాపార వేత్త. గుజరాత్‌కు చెందిన ఈయన ఇప్పుడు దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా.. పలు ప్రముఖ వ్యాపారాలు చేస్తున్నారు. ఆయన ఇప్పుడు ఏపీలోనూ తిరిగి వ్యాపారాలు ప్రారంభించేందుకు.. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. దీనిని ఆహ్వానించాల్సిన పరిణామంగానే చూడాలి. గతం తాలూకు పొరపొచ్చాలను వీడి అదానీ బృందం తాజాగా చంద్రబాబును కలుసుకుంది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని పేర్కొంది. …
Read More »షర్మిల ఎఫెక్ట్: జగన్‌కు వైఎస్ సానుభూతి పరుల గుడ్ బై!
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ముఖ్యంగా సెంటిమెంటును ప్రధానంగా నమ్ముకుని రాజకీయాలు చేసేవారు.. ఆ సెంటిమెంటు కొండలు కరిగిపోతే ఓర్చుకోలేరు. వారివారి మార్గాలను వారు చూసుకుంటారు. ఎందుకంటే.. ఏ నాయకుడికైనా. ఏ పార్టీకైనా.. ఎన్ని సిద్ధాంతాలు ఉన్నా.. సెంటిమెంటే ప్రధాన బలం. ఇప్పుడు ఈసెంటిమెంటు వైసీపీకి ప్రమాదంగా మారింది. ఒకప్పుడు ప్రమోదంగా ఉన్న ఈ సెంటిమెంటు.. ఇప్పుడు వైసీపీలో కరిగిపోతోంది. షర్మిల ఆస్తుల వివాదం తెరమీదికి రావడం.. …
Read More »రాక్షస క్రీడ: సీఎం రేవంత్‌పై కేటీఆర్ కామెంట్స్
తెలంగాణ రాజకీయాల్లో జున్వాడ రేవ్ పార్టీ(పోలీసులు చెబుతున్న ప్రకారం) వ్యవహారం తీవ్ర రగడకు దారి తీసింది. రేవ్ పార్టీ అనంతరం జరిగిన పరిణామాలపై మాజీ సీఎం కేసీఆర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక, రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించడం.. ఆయన కోసం పోలీసులు గాలిస్తుండడం కూడా తెలిసిందే. మరోవైపు ఈ కేసులో కొకైన్ తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ తనపై పోలీసులు అక్రమ కేసు పెట్టారని …
Read More »వైసీపీ ‘రహస్యం’ బట్టబయలు!
వైసీపీ రహస్యాలను బట్టబయలు చేసేందుకు కూటమి సర్కారు సిద్ధమైంది. వైసీపీ హయాంలో సుమారు 320కి పైగా రహస్య జీవోలు ఇచ్చారన్న విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. అప్పట్లో టీడీపీ సహా బీజేపీ నాయకులు కూడా.. రహస్య జీవోలపై న్యాయ పోరాటం కూడా చేశారు. హైకోర్టుకు వెళ్లి వైసీపీ సర్కారుపై పిటిషన్లు కూడా వేశారు. అప్పట్లో కోర్టు ఆదేశాల మేరకు కొన్ని జీవోలను అప్పటికప్పుడు ఆన్లైన్ చేసినా.. వందల సంఖ్యలో జీవోలను …
Read More »నారా లోకేష్ ఎంట్రీ.. డ్రైవర్ కథ సుఖాంతం
ఈ రోజుల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ రీల్స్ మోజులో పడుతున్నారు. తమలో దాగి ఉన్న నైపుణ్యాలను చాటేందుకు దీన్ని వేదికగా చేసుకుంటున్నారు. మామూలుగా బిడియస్తులుగా కనిపించే వ్యక్తులు కూడా రీల్స్, షార్ట్స్‌లో రెచ్చిపోవడం చూసి ఆశ్చర్యపోతుంటాం. తాజాగా ఒక ఏపీ ఆర్టీసీ డ్రైవర్ విధుల్లో ఉండగా తన డ్యాన్సింగ్ టాలెంట్ చూపించి సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. కానీ ఆ వీడియో వైరల్ కావడంతో అధికారుల వరకు …
Read More »నియోజకవర్గంలోకి అడుగు పెట్టాలంటే దడదడ!!
వైసీపీ నేతలు కొందరు పార్టీ నుంచి వెళ్లిపోయారు. మరికొందరు తట్టాబుట్టా సర్దుకున్నారు. అయితే.. ఇంకొందరు.. నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. కనీసం నాలుగు మాసాల్లో ఒక్కసారి కూడా నియోజకవర్గాల మొహం చూడని ఫైర్ బ్రాండ్లు ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. వీరిలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మంత్రి.. కొడాలి నాని హైదరాబాద్ వరకు పరిమితం అయ్యారు. ఏదైనా పని ఉండి ఏపీలోకి వస్తున్నా.. ఆయన విజయవాడ వరకు వచ్చి.. ఆ వెంటనే వెళ్లిపోతున్నారు. …
Read More »అందరి చూపూ భారతి వైపు.. రీజనేంటి?
వైసీపీ అధినేత జగన్, కాంగ్రెస్ చీఫ్ షర్మిల మధ్య చోటు చేసుకున్న ఆస్తుల వివాదం రాజకీయ రచ్చగా మారిన విషయం తెలిసిందే. గత వారం పది రోజులుగా ఈ చర్చ జోరుగా సాగుతూనే ఉంది. అంతేకాదు.. ఇరు పక్షాల మధ్య మాటల దాడులు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు అటు జగన్, ఇటు షర్మిల తప్ప.. ప్రధానంగా కుటుంబ సభ్యులు ఎవరూ కూడా.. మీడియా ముందుకు రాకపోవడం గమనార్హం. …
Read More »అధిష్టానం తేల్చదు.. నేతల కల తీరదు
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో నేతలు కుత కుతలాడుతున్నారు. మంత్రివర్గ విస్తరణ వ్యవహారం తెరమీదికి వచ్చినట్టే వచ్చి.. మళ్లీ తెరమరుగు కావడం.. దీనిపై అధిష్టానం తేల్చిందని కొందరు చెబుతుంటే.. మరికొందరు ఇంకా తేల్చలేదని చెబుతున్న దరిమిలా.. అసలు ఏం చేస్తారన్నది ఇప్పటికీ సందేహం గానే ఉంది. అందరూ భావించినట్టుగా అయితే.. ఇప్పటికే మంత్రి వర్గ విస్తరణ జరిగిపోయి ఉండాలి. సుమారు ఆరు నుంచి ఏడుగురికి మంత్రి పదవులు దక్కి ఉండాలి. …
Read More »జగన్ ఆస్తుల వివాదం చావు దెబ్బ: ఏపీ మొత్తం ఇదే టాపిక్
వైసీపీ అధినేత జగన్, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య తారస్థాయిలో చోటు చేసుకున్న ఆస్తుల వివాదాన్ని కూటమి పార్టీలు చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాయి. గత 10 రోజులుగా ఈ ఆస్తుల వివాదం మీడియాలో పెద్ద ఎత్తున హైలెట్ అవుతోంది. ఇది తమకు రాజకీయంగా మేలు చేస్తుందని టీడీపీ నాయకులు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. అన్న మోసంపై ప్రజలు కూడా చర్చించుకుంటున్నారని అంటున్నారు. ఇక, ప్రజలలోకి షర్మిలకు జరిగిన …
Read More »ప్రజల తరఫునే పవన్‌ను ప్రశ్నిస్తున్నా: ప్రకాష్‌రాజ్
తరచుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించే బహుభాషా నటుడు ప్రకాష్‌రాజ్.. మరోసారి పవన్‌పై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన.. పవన్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఫర్వాలేదని.. కానీ, ఆ పార్టీ కౌగిలిలో చిక్కుకుపోతున్నారని అన్నారు. ఇలా చిక్కుకుపోయిన ఏ పార్టీ కూడా.. బతికి బట్ట కట్టలేదన్నారు. ఇదే విషయాన్ని తాను చెబుతున్నానన్నారు. …
Read More »ఇది వైసీపీ కాదు.. కూటమి ప్రభుత్వం జాగ్రత్త: పవన్
“ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఎవరికి నచ్చినట్టు వారు చేయడానికి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు వ్యవహరించడానికి నిధులు దారి మళ్లించడానికి. ఇది కూటమి ప్రభుత్వం అన్న విషయం గుర్తు పెట్టుకోండి. ప్రతి పైసాకు.. లెక్క ఉంటుంది. ప్రతి రూపాయికీ జవాబుదారీ తనం ఉంటుంది” అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. తాజాగా ఆయన పంచాయతీరాజ్ శాఖ అధికారులతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీలకు …
Read More »తమిళనాట మరో ‘జనసేన’..
ఏపీలోని జనసేన తరహా పార్టీ తమిళనాడులోనూ ఆవిర్భవించింది. ప్రముఖ తమిళ హీరో విజయ్.. తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీని కొన్నాళ్ల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన అప్పట్లో తన పార్టీ సిద్ధాంతాలను ప్రకటించలేదు. దీనిపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. కానీ, ఆదివారం సాయంత్రం విల్లుపురం జిల్లాలో నిర్వహించిన టీవీకే పార్టీ తొలి మహానాడులో ఆయన తన పార్టీ సిద్ధాంతాలు సహా భవిష్యత్తును ఆవిష్కరించారు. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టినట్టు …
Read More »