కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం ఇప్పుడు సులభతరంగా మారింది. టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు చేపట్టిన సరికొత్త చర్యల వల్ల వేలాది మంది భక్తులకు ఇప్పుడు కేవలం గంటల వ్యవధిలోనే స్వామి వారి దర్శన భాగ్యం కలుగుతోంది. వెరసి గతంలో గంటల తరబడి క్యూ లైన్లలో నిలవాల్సిన పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. అదే సమయంలో దూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు విడిది సౌకర్యం లభ్యత కూడా …
Read More »కేంద్రంలో వైసీపీ వాయిస్ కట్…?
కేంద్రంలోను.. ఢిల్లీ రాజకీయాల్లోనూ ఇప్పటి వరకు వైసీపీ కొంత మేరకు హవా చెలాయిస్తున్న విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా.. అదేవిధంగా వ్యవహరిస్తోంది. దీనికి కారణం.. రాజ్యసభలో బలం ఎక్కువగా ఉండడమే. అయితే.. ఇప్పుడు ఆ బలం సగానికిపైగా తగ్గిపోనుంది. దీంతో కేంద్రంలో వైసీపీ వాయిస్ పెద్దగా వినిపించే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీకి రాజ్యసభలో వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, …
Read More »అదే చెక్కకుర్చీ… అదే టేబుల్… ఐదోసారి సీఎం!
దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయకుడు అయినా.. ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే కాన్వాయ్ వరకు.. అట్టహాసంగా ఉండాల్సిందే.. అదిరిపోవాల్సిందే.. అనే రీతిలో వ్యవహరిస్తారు. ఏమాటకు ఆమాట చెప్పాల్సి వస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు కూడా ఇలాంటి ఆడంబరాలకు అతీతంకాదు. లెక్కకు మిక్కిలిగా సమావేశ మందిరాలు.. వాటిలో ఏర్పాటు చేసేందుకు ఫారిన్ కుర్చీలు, సోఫాలు!. ఇక, కేసీఆర్‌హయాంలో …
Read More »“రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు!“
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు. వదిలి పెట్టదు అని రాసిన పోస్టర్లు.. దాదాపు తిరువనంతపురంలోని అన్ని కూడళ్లలోనూ కనిపించాయి. ముఖ్యంగా వయనాడ్ ప్రజలు ఇచ్చిన తీర్పు కూడా మీరు పట్టించుకోవడం లేదని కొందరు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మీకు సంచులు మోసే కేసీ వేణుగోపాల్ కూడా మిమ్మల్ని కాపాడరు.. అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఏం జరిగింది? …
Read More »పవన్ చెప్తే చేస్తాడండోయ్
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు ఉదాహరణగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఓ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నూతన భవనం నిలుస్తోంది. అప్పుడప్పుడో అల్లూరి జిల్లాలో పర్యటించిన సందర్భంగా పాడుబడిన ఆ పాఠశాలను సందర్శించిన పవన్.. అక్కడి పిల్లలు, ఉపాధ్యాయుల కోరిక మేరకు నూతన భవనం నిర్మించి ఇస్తామని …
Read More »విచారణకు భగీరథ్ డుమ్మా
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో మే 8న పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం భగీరథ్ పరారీలో ఉన్నారని, ముమ్మరంగా గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అదే సమయంలో ఈ రోజు భగీరథ్ పోలీసు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులిచ్చారు. వాస్తవారిని ఆ నోటీసులు బండి సంజయ్ నివాసంలో ఇవ్వాల్సి ఉంది. …
Read More »బల పరీక్షలో నెగ్గిన విజయ్… కానీ…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్ ఫిగర్ కు 10 సీట్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో, విజయ్ కాంగ్రెస్ తో పాటు వీసీకే, సీపీఐ వంటి చిన్న పార్టీల మద్దతులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అయితే, సినీ ఫక్కీలో పొలిటికల్ థ్రిల్లర్ మూవీని తలపించేలా విజయ్ బల పరీక్ష ఎపిసోడ్ నడిచింది. ఎట్టకేలకు అందరినీ …
Read More »తప్పు త్వరగా తెలుసుకున్న సీఎం విజయ్
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో మద్యం షాపులు తీసివేయాలన్న విజయ్ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇక, బ్యానర్లు, ఫ్లెక్సీలు అంటూ ప్రజలకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు చేయొద్దంటూ టీవీకే ఎమ్మెల్యేలకు హుకుం జారీ చేసిన విజయ్ రీల్ లైఫ్ మాదిరే రియల్ లైఫ్ లో పాలన సాగిస్తారని అంతా భావించారు. అయితే, తన …
Read More »అనంతబాబుకు `జైలు అనంతం`.. బెయిల్ రద్దు!
వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ కూడా అయిన అనంతబాబు ఇక, సుదీర్ఘ కాలం ఊచలు లెక్క పెట్టాల్సి ఉంటుంది. వైసీపీ హయాంలో తన మాజీ కారు డ్రైవర్, దళితుడు సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హత్య చేయించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు.. ప్రభుత్వ అధికారాన్ని అడ్డు పెట్టుకుని తనను ఎవరు ప్రశ్నిస్తారులే.. అన్న ధోరణితో శవాన్ని డోర్ డెలివరీ కూడా చేశారు. ఈ ఘటన ఆనాడు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే.. వైసీపీ హయాంలో …
Read More »మరోసారి పొన్నం గందరగోళం
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ లో భిన్న వాదనలు వినిపించాయి. ఈ కేసులో మున్నూరు కాపు సంఘాలు కలుగజేసుకుని భగీరథ్ తో బాలికకు వివాహం జరిపించేలా ఓ రాజీ మార్గాన్ని చూడాలంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఖండించారు. రాజీ వ్యాఖ్యలు పొన్నం వ్యక్తిగతమన్న మహేశ్… ఆ …
Read More »చంద్రబాబు నిర్ణయమే.. తెలంగాణకు ఊపిరా?!
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుకు తేల్చి చెప్పింది. ఇదే జరిగితే.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు ఉండే అవకాశం లేదని కూడా స్పష్టం చేసింది. అయితే.. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు ఏపీ ఆది నుంచి విభేదిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు కారణంగా.. 70 టీఎంసీల కృష్ణానది నీటిని.. …
Read More »ఏపీలో ఎన్నికల కోలాహలం.. ఎప్పుడైనా?!
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీల కాలపరిమితి.. గత 2 నెల కిందటే ముగిసింది. ఇక, స్థానిక సంస్థల అధికారం కూడా గతనెలలోనే ముగిసింది. దీంతో ప్రత్యేక అధికారుల పాలనలో మునిసిపాలిటీలు.. గ్రామ పంచాయతీలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత వేగంగా ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల హైకోర్టు తేల్చి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates