Political News

నా స‌ల‌హా ఖ‌రీదు.. 11 కోట్లు: పీకే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

పీకే గా ప్ర‌చారంలో ఉన్న రాజ‌కీయ వ్యూహ క‌ర్త‌, బీహార్‌కు చెందిన జ‌న సురాజ్ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న స‌ల‌హా ఖ‌రీదు 11 కోట్ల రూపాయ‌ల‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ద‌క్షిణాది రాష్ట్రాల్లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో(ఏ రాష్ట్ర‌మ‌నేది చెప్ప‌లేదు) ఒక పార్టీకి రెండు గంట‌ల పాటు స‌ల‌హాలు.. సూచ‌న‌లు, వ్యూహాలు ఇచ్చాన‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో ఆ పార్టీ నుంచి తాను 11 కోట్ల …

Read More »

తెలంగాణ స్థానిక ఎన్నిక‌లు రెడీ, వివరాలు ఇవే!

తెలంగాణ స్థానిక సంస్థ‌ల‌కు న‌గారా మోగింది. గ‌త కొన్నాళ్లుగా చ‌ర్చ‌నీయాంశం అయిన‌.. ఈ ఎన్నిక‌ల‌ను హైకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో నిర్వ‌హించ‌క‌త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. తాజాగా రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం.. ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. ఈ స్థానిక స‌మ‌రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణికుముదిని వెల్లడించిన వివ‌రాల ప్ర‌కారం.. +  స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు మొత్తం 5  దశల్లో జ‌రుగుతాయి. …

Read More »

400 కోట్ల ఖర్చు: ఆటో డ్రైవర్లకు ఇంకా కావాలట

రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు సహాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. వచ్చే నెల నాలుగో తేదీన “ఆటో డ్రైవర్ల సేవలో” అనే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. దీంతో ఆటో డ్రైవర్ల ఉపాధిపై పెద్ద ప్రభావం పడింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు కొన్నాళ్లుగా నిరసన …

Read More »

పిక్ ఆఫ్ ద డే!.. పవన్ ఇంట చంద్రబాబు!

సెలవు దినం ఆదివారం హైదరాబాద్ లో ఓ ఆసక్తికర సస్నివేశం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా బాబుకు పవన్ ఎదురేగి స్వాగతం పలకగా, పవన్ ను బాబు ఆత్మీయంగా పలకరించారు. అనంతరం ఇద్దరూ పవన్ ఇంటిలో కూర్చుని కబుర్లలో పడ్డారు. పవన్ కు వచ్చిన వైరల్ ఫీవర్ గురించి …

Read More »

కరూర్ మృతులకు రూ.20 లక్షల పరిహారం

తమిళ వెట్రి కళగం(టీవీకే) పార్టీ అధినేత విజయ్ శనివారం తమిళనాడులోని కరూర్ లో చేపట్టిన ర్యాలీలో 40 మంది దాకా మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో విజయ్ ఒక్కసారిగా డీలా పడిపోయారు. ఘటన జరిగిన తర్వాత ఆయన గట్టి భద్రత మధ్య కరూర్ నుంచి చెన్నై వెళ్లిపోయారు. తాజాగా ఆదివారం ఉదయం కాస్తంత తేరుకున్న విజయ్ చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ఓ …

Read More »

‘ఆటో’వాలా జిందాబాద్‌.. 4నే నిధులు!

ఏపీలోని కూటమి ప్ర‌భుత్వం మ‌రో కీల‌క ప‌థ‌కానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటోడ్రైవ‌ర్ల‌కు.. ఏడాదికి రూ.15000 ఇచ్చే కార్య‌క్ర‌మానికి సంబంధించి సీఎం చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే నెల 4 నుంచి ఈ ప‌థ కాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. దీనికి సంబంధించిన విధి విధానాల‌ను ఇప్ప‌టికే విడుద‌ల చేసిన‌ట్టు చె ప్పారు. ఏ ఒక్క‌రికీ అన్యాయం జ‌ర‌గ‌ద‌ని.. ఆటో డ్రైవ‌ర్ల కుటుంబాల‌ను ప్ర‌భుత్వం అన్ని …

Read More »

క‌రూర్ క‌న్నీటి వెనుక: ‘టైం టు టైం’ ఏం జ‌రిగింది?

త‌మిళ‌నాడులోని క‌రూర్‌లో శ‌నివారం రాత్రి జ‌రిగిన ఘోర తొక్కిస‌లాట‌లో మృతుల సంఖ్య 40కి పెరిగింది. ఇంకా, ప‌దుల సంఖ్య‌లో బాధితులు ఆదివారం ఉద‌యం వ‌ర‌కు కూడా కోలుకోలేని స్థితిలోనే ఉన్నార‌ని.. అధికారిక వ‌ర్గాలు తెలిపారు. మ‌రింత మంది బాధితులు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఇత‌మిత్థంగా చెప్పాలంటే.. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు అప్ప‌టికప్పుడు సీఎం స్టాలిన్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ‌తో విచార‌ణ‌కు క‌మిటీ నియ‌మించారు. …

Read More »

సీపీఐ ప‌ద‌వి నుంచి నారాయ‌ణ ఔట్‌.. రీజ‌నిదే!

కామ్రెడ్ నారాయ‌ణ‌. క‌మ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) జాతీయ కార్య‌ద‌ర్శిగా ఆయ‌న సుదీర్ఘ‌కాలం ప‌నిచేశారు. అయితే.. తాజాగా ఈ ప‌ద‌వి నుంచి ఆయ‌న త‌ప్పుకొన్నారు. తాజాగా ఢిల్లీలో జ‌రిగిన పార్టీ కీల‌క స‌మావేశంలో త‌న ప‌ద‌వికి ఆయ‌న రాజీనామా చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లోనూ కీల‌క నాయ‌కుడిగా వ్య‌వ‌హ‌రించిన నారాయ‌ణ‌.. అన్ని పార్టీల అంశాల‌ను కూడా ప్ర‌స్తావిస్తున్నారు. త‌ద్వారా.. అంద‌రికీ ఆయ‌న సుప‌రిచితుడు అయ్యారు. విష‌యం ఏదైనా.. ఆయ‌న …

Read More »

ఇది లైట్ కాదు.. బాబు పాల‌న‌లో ఫ‌స్ట్ టైమ్‌.. !

ఔను.. సీఎం చంద్ర‌బాబు పాల‌న అంటే.. పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్దపీట వేస్తార‌న్న పేరుంది. బ‌య‌ట ఎలా మాట్లాడినా.. అసెంబ్లీలో మాత్రం ఖ‌చ్చితంగా లెక్క‌లు చూపుతార‌ని అంటారు. అదేస‌మ‌యంలో స‌భ్యులు కూడా చాలా జాగ్ర‌త్త‌గా మాట్లాడ‌తార‌న్న పేరు కూడా ఉంది. కానీ, ఇప్పుడు అదే అసెంబ్లీలో స‌భ్యులు దారి త‌ప్పుతున్నారు. కేవ‌లం స‌భ్యులే కాదు.. మంత్రులు కూడా.. త‌ప్పుడు దారిలో నడుస్తున్నార‌ని స్వ‌యంగా చంద్ర‌బాబు హెచ్చ‌రించే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇది ఆయ‌న పాల‌న‌కు …

Read More »

ష‌ర్మిల దూకుడు.. వైసీపీని దాటేస్తారా ..!

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల దూకుడు పెంచారు. ఒక్క‌సీటు లేక‌పోయినా.. ప్ర‌జ‌ల త‌ర‌ఫున‌, అదేస‌మ‌యంలో రైతుల త‌ర‌ఫున తాము పోరాటం చేస్తున్నామ‌ని చెబుతున్న ఆమె.. శుక్ర‌వారం అచ్చంగా అదే ప‌ని చేశారు. చ‌లో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. రైతులు, ప్ర‌జ‌ల ప‌క్షాన సీఎం చంద్ర‌బాబును నిల‌దీస్తామ‌ని ఆమె పేర్కొన్నారు. అయితే.. పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. చిత్రం ఏంటంటే.. ఈ విష‌యాల‌పై పెద్ద ఫోక‌స్ రాలేదు. అయినా. . కూడా ష‌ర్మిల త‌న …

Read More »

న‌టుడు విజ‌య్ స‌భ‌లో తొక్కిస‌లాట‌.. 39 మంది మృతి

త‌మిళ‌నాడులో ఘోరం జ‌రిగింది. త‌మిళ యువహీరో, త‌మిళ‌గ వెట్రి క‌గ‌ళం(టీవీకే) పార్టీ అధినేత విజ‌య్ నిర్వ‌హించిన ప్ర‌చారం స‌భ‌లో భారీ తొక్కిస‌లాట చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య 39కి చేరింది. ప్రాథ‌మిక స‌మాచారం మేర‌కు.. తొలుత 10 మంది చ‌నిపోయార‌ని అనుకున్నా.. త‌ర్వాత త‌ర్వాత‌.. మృతుల సంఖ్య 39కి పెరిగింది. వీరిలో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్న‌ట్టు అధికారులు తెలిపారు. మ‌రింత మంది ప్రాణాపాయ స్థితిలో ఆసుప‌త్రిలో …

Read More »

అ’భాగ్య న‌గ‌రం’: క‌నీవినీ ఎరుగ‌ని ప‌రిస్థితి!!

భాగ్య‌న‌గ‌రం.. హైద‌రాబాద్‌.. చిన్న చినుకునే ఓర్చుకోలేని ప‌రిస్థితిని ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. ఏ చిన్న‌పాటి వ‌ర్షం కురిసినా… భాగ్య‌న‌గ‌రం వీధుల‌న్నీ జ‌ల‌మ‌యం అవుతున్నాయి. ఇక‌, లోత‌ట్టు ప్రాంతాల్లో మోకాల్లోతు నీరు చేరుతోంది. అయితే.. ఇది ఇప్పుడు ప‌రాకాష్ఠ‌కు చేరింది. ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో భాగ్య‌న‌గ‌రం అభాగ్య న‌గరంగా విల‌పిస్తోంది. అక్క‌డ‌, ఇక్క‌డ అనే తేడాలేకుండా.. దాదాపు అన్ని ప్రాంతాలూ నీట మునిగాయి. జంట జ‌లాశ‌యాల‌కు నీటి వ‌ర‌ద …

Read More »