ఏపీలో వరుస పెట్టుబడులు.. అదే లైన్లో ఒప్పందాల జోరు పుంజుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంలో నూతన సందడి నెలకొంది. గురువారం కీలక కంపెనీ రెన్యూ ఎనర్జీ సంస్థ 82 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో విశాఖలో ఈ ఒప్పందం కుదిరింది. ఇక, ఈ నెలలోనే గూగుల్ సంస్థ కూడా ఒప్పందం కుదుర్చుకుంటోందని మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ …
Read More »కొండా సురేఖకు నాగ్ బిగ్ రిలీఫ్
టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునతోపాటు ఆయన కుటుంబ సభ్యులపై మంత్రి కొండా సురేఖ కొద్ది రోజుల క్రితం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు చేసే క్రమంలో కొండా సురేఖ చేసిన కామెంట్లు టాలీవుడ్ లో కాక రేపాయి. దీంతో, కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. అయితే, అనూహ్యంగా నాగార్జునపై, ఆయన …
Read More »ఆపరేషన్ అరణ్య.. పవన్ వేట షురూ.. !
మంగళంపేట అటవీ ప్రాంతంలో అక్రమ ఆక్రమణలు బహిర్గతం అయ్యాయి. హెలికాప్టర్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీటిని పరిశీలించారు. మాజీ అటవీశాఖ మంత్రి, వైసీపీ నేత పెదిరెడ్డి రామచంద్ర రెడ్డికి సంబంధం ఉన్నట్లు చెబుతున్న 76.74 ఎకరాల అటవీ భూమి అక్రమ ఆక్రమణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఎక్స్ క్లూజివ్ వీడియోను ఈరోజు మధ్యాహ్నం డిప్యూటీ సీఎం ఓ కార్యాలయం విడుదల చేసింది. పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, మంగళంపేటలో …
Read More »అంబటి రాంబాబుపై కేసులు.. ఈసారి అరెస్టేనా?
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరుజిల్లా పట్టాభిపురం పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే.. గతంలోనూపలు కేసులు నమోదైనా.. వాటిలో అరెస్టు చేసే అవకాశం తక్కువగా ఉండడంతో పోలీసులు కేవలం నోటీసులు ఇచ్చి ఊరుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బలమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం గమనార్హం. భారతీయ న్యాయ సంహిత చట్టంలోని 132, 126, 351, 189, రెడ్ విత్ 190 సెక్షన్ల …
Read More »ప్రభుత్వం మారదు.. పెట్టుబడులు పెట్టండి – తేల్చేసిన సీఎం!
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎలాంటి సందేహాలు అవసరం లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా గురువారం ఉదయం ఆయన విశాఖలో యూరప్ దేశాలకు చెందిన పెట్టుబడి దారులతో ఓ హోటల్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతు.. అనేక మందికి రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందేమోనన్న సందేహం ఉందని.. అలాంటి దేమీ జరగదని.. దీనికి తాను గ్యారెంటీ ఇస్తానని తెలిపారు. “ప్రస్తుతం .. ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. వారికి …
Read More »82 వేల కోట్లు పెట్టబోతున్న భారీ కంపెనీ.. సస్పెన్స్ కు తెరతీసిన లోకేష్
రేపు ఉదయం భారీ ప్రకటన అంటూ నిన్న ట్వీట్ చేసి సస్పెన్స్ క్రియేట్ చేసిన లోకేష్.. దానిని రివీల్ చేశారు. అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ కంపెనీ పేరును ప్రకటించారు. 2019లో కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిన ఆ కంపెనీ… రేపు ఆంధ్రప్రదేశ్‌లో దూసుకురానుంది!.. అని లోకేష్ చెప్పినట్లుగానే ఓ భారీ కంపెనీ ఏపీకి తిరిగి రానుంది. ఆంధ్రప్రదేశ్‌లో రీన్యూ కంపెనీ భారీ పెట్టుబడి పెట్టనుంది. ఐదేళ్ల తర్వాత ఏపీలో …
Read More »నాలుగు రోజులూ సీఎం చంద్రబాబు అక్కడే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సంయుక్తంగా నిర్వహిస్తున్న 30వ ‘సి.ఐ.ఐ పార్ట్నర్షిప్ సమ్మిట్-2025’ కోసం విశాఖ సన్నద్ధం అయ్యింది. విశాఖలోని ఆంధ్ర విశ్వ విద్యాలయ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పార్టనర్స్ ఇన్ ప్రోగ్రెస్ – ఇండియాస్ రోడ్ మ్యాప్ టు వికసిత్ భారత్-2047’ థీమ్‌తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. 100కి పైగా విదేశీ ప్రతినిధులు పాల్గొనే …
Read More »లోకేష్ సస్పెన్స్ ట్వీట్: రేపు ఉదయం భారీ ప్రకటన!
ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్లో ఒక పోస్ట్‌తో సస్పెన్స్ క్రియేట్ చేశారు. “ఉదయం 9 గంటలకు భారీ ప్రకటన!” అంటూ ఆసక్తి రేకెత్తించారు. విశాఖలో ఈనెల 14, 15 తేదీల్లో ఏపీ ప్రభుత్వం – సీఐఐ ఆధ్వర్యంలో భాగస్వామ్య సదస్సు నిర్వహించనున్నారు. దేశ, విదేశాల నుంచి వివిధ సంస్థల ప్రతినిధులు హాజరు కానున్నారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెరగడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ ఈ …
Read More »జూబ్లీహిల్స్ రిసల్ట్: అంత మాట అనేశారేంటి కవిత?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరుపై తెలంగాణతో పాటు ఆంధ్రాలో కూడా తీవ్ర ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లు ఈ బైపోల్‌ను చాలా సీరియస్‌గా తీసుకుని ముమ్మరంగా ప్రచారం చేశారు. ఎగ్జిట్ పోల్స్‌లో మెజారిటీ సర్వేలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుండగా, బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇస్తుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ ఉప ఎన్నిక ఫలితంపై …
Read More »ప్రతీ పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేరబోతుంది
రాష్ట్రంలో సొంతిల్లులేని ప్రతి పేద కుటుంబాన్నీ ఆదుకుంటామని సీఎం చంద్రబాబు చెప్పారు. 2029 నాటికి.. రాష్ట్రంలో ఉన్న పేదలను గుర్తించి.. వారికి సొంతగా ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యతను స్వయంగా తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. తాజాగా అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని చిన మండెం అనే గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 3 లక్షల 192 ఇళ్లను పేదలకు ఆయన …
Read More »బహిరంగంగా వాళ్ళిద్దరికీ క్షమాపణ చెప్పిన ప్రవీణ్ ప్రకాశ్
ఏపీ కేడర్‌కు చెందిన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ప్రవీణ్ ప్రకాష్ తాజాగా ఇన్ స్టా గ్రామ్‌లో ఓ పోస్టు చేశారు. దీనికి ఆయన పెట్టిన టైటిల్ `పబ్లిక్ అపాలజీ`(బహిరంగ క్షమాపణ). ఈ సందర్భంగా ఆయన మాజీ ఐపీఎస్ ఏబీవీ వెంకటేశ్వరరావు, మాజీఐఏఎస్ జాస్తి కృష్ణ కిషోర్‌లకు క్షమాపణలు చెప్పారు. వైసీపీ హయాంలో వారిని వేధించారన్న వాదన ఉంది. అంతేకాదు.. ఉద్దేశ పూర్వకంగా వారిపై కేసులు పెట్టారన్న చర్చ సాగింది. దీనివెనుక …
Read More »జాగృతితో పెట్టుకుంటే జాగ్రత్త: కవిత వార్నింగ్ వాళ్ళకేనా?
`తెలంగాణ జాగృతి` అధ్యక్షురాలు.. మాజీ ఎంపీ కవిత అధికార పార్టీ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ నాయకులను తీవ్రంగా హెచ్చరించారు. రాజకీయాల్లో విమర్శలు మంచివేనని.. కానీ, హద్దు మీరి తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. “నేను ఒక్కరి నేనన్న భావన మీకు ఉండొచ్చు. కానీ, నా యాత్రలకు వస్తున్న జనాలను చూడండి. ఈ తెలంగాణ సమాజాన్నిచూడండి.“ అని ఆమె వ్యాఖ్యానించారు. తాజాగా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates