వైసీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్.. తన పార్టీ ఎమ్మెల్యేలను ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి ‘గడపగడపకు మన ప్రభుత్వం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లకు పంపించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, బటన్ నొక్కుడు ద్వారా అందుతున్న నగదు.. వంటి విషయాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. దీని వల్ల ఎన్నికల్లో మేలు జరుగుతుందని ఆశించారు. కానీ, ఎన్నికల్లో వైసీపీకి ఎలాంటి ఫలితం వచ్చిందో …
Read More »విజయసాయి రెడ్డి కుమార్తె అక్రమ నిర్మాణాన్ని కూల్చేయాలన్న హైకోర్టు
గడిచిన కొంతకాలంగా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన విజయసాయి రెడ్డి కుటుంబానికి చెందిన ఒక అక్రమ నిర్మాణంపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే న్యాయస్థానానికి వెళ్లారు. విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డికి చెందిన కట్టడంపై అభ్యంతరాలు ఉన్నాయి. భీమిలి బీచ్ సముద్రానికి అతి సమీపంలో.. సీఆర్ జెడ్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాన్ని కూల్చేసేందుకు అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ …
Read More »నందిగం సురేష్‌పై మర్డర్ కేసు.. ఏం జరిగింది?
వైసీపీ మాజీ ఎంపీ, ఎస్సీ నాయకుడు నందిగం సురేష్‌పై తాజాగా మర్డర్ కేసు నమోదైంది. ఇప్పటికే ఆయనపై టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను పోలీసులు అరెస్టు చేయడం, 14 రోజులు జైల్లో ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇదే కేసులో పోలీసుల కస్టడీకి కూడా ఆయనను తీసుకున్నారు. కూలంకషంగా ఈ కేసును విచారించారు. మొత్తానికి ఈ కేసులో నందిగం …
Read More »మహిళలకు దీపావళి బొనాంజా: చంద్రబాబు కానుక
ఏపీలో మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి బొనాంజా ప్రకటించారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పింఛన్లను రూ.1000 చొప్పున పెంచి అమలు చేస్తున్నారు. ప్రతి నెలా 1వ తేదీనే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మరీ అందిస్తున్నారు. ఇదే సమయంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీ అన్న క్యాంటీన్లను పునరుద్ధరించడం. దీనిని కూడా చంద్రబాబు …
Read More »తిరుమల లడ్డూపై బాబు కామెంట్స్.. వైసీపీ నేతల రియాక్షన్
తిరుమల శ్రీవారి పవిత్ర ప్రసాదం లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా మంటపుట్టించాయి. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి సహా.. ప్రస్తుత రాజ్యసభ సభ్యులు క్షణాల్లోనే స్పందించారు. నిజానికి వైసీపీపై చేస్తున్న విమర్శలకు ఇటీవల కాలంలో ఇంత వేగంగా ఎవరూ స్పందించలేదు. కానీ, తాజాగా మాత్రం మాజీ మంత్రి అంబటి రాంబాబు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, మాజీ సీఎం జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి వెంటనే …
Read More »వలంటీర్లు-సచివాలయాలపై ఏపీ సర్కారు సంచలన నిర్ణయం
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు కీలక వ్యవస్థలను ప్రభుత్వ శాఖల్లో కలిపేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ హయాంలో వలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఎన్నికల సమయంలో ఈ వ్యవహా రం వివాదంగా మారింది. దీంతో వారిని ఎన్నికలకు ముందు పక్కన పెట్టారు. అదేవిధంగా జగన్ హయాంలోనే ప్రతి 2 వేల ఇళ్ల పరిధిలో ఒక గ్రామ, వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో ప్రభుత్వంలోని …
Read More »`10 టు 10`.. ఇదీ ఏపీ లిక్కర్ పాలసీ!
ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపారు. ఈ నూతన మద్యం విధానంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీని ప్రకారం.. ఇక నుంచి మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. వాస్తవానికి ఇప్పటి వరకు ఉన్న విధానం మేరకు ఉదయం 11 …
Read More »‘శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారు’
అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి.. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులను వైసీపీ ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి ప్రసాదంలో కొన్ని జంతువుల కొవ్వును కలిపి.. భక్తుల మనోభావాలను మంటగలిపిందని వ్యాఖ్యానించారు. తాజాగా బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు విషయాలను చంద్రబాబు ప్రస్తావించారు. ఆయన మాటల్లోనే.. తిరుమల ఎంత …
Read More »జమిలికి జై! కేంద్ర కేబినెట్ ఓకే!!
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు పదే పదే చెబుతున్న జమిలి ఎన్నికలకు తాజాగా మరింత ముందడుగు పడింది. జమిలి ఎన్నికలకు తాజాగా జరిగిన మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి వర్గం జై కొట్టింది. దీనికి సంబంధించిన చర్చకు ఓకే చెప్పింది. జమిలి ఎన్నికలను ముక్తకంఠంతో కేంద్ర కేబినెట్ స్వాగతించింది. “వన్ నేషన్-వన్ ఎలక్షన్” నినాదాన్ని అందిపుచ్చుకుంది. ప్రధాని గత ఆగస్టు 15న ఎర్రకోటపై చేసిన ప్రసంగంలో జమిలి ప్రస్తావన తీసుకువచ్చారు. …
Read More »వైసీపీకి బాలినేని రాజీనామా.. సుతిమెత్తని ఉత్తరం!
వైసీపీలో మరో కీలక వికెట్ పడిపోయింది. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో మరింత బలంగా తెరమీదికి వచ్చాయి. ఎన్నికల సమయంలో బాలినేని వర్సెస్ వైసీపీ మధ్య తీవ్ర యుద్ధం చోటు చేసుకోవడం, ఎన్నికల అనంతరం కూడా పార్టీ తరఫున ఆయనకు సరైన ప్రాధాన్యం దక్కలేదన్న భావన వంటివి బాలినేనిని వైసీపీకి …
Read More »‘జగన్ తెచ్చింది ఒక దిక్కుమాలిని జీవో’
గత కొన్ని రోజులు ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం వివాదంగా మారింది. తన హయాంలో కేంద్రం నుంచి తీసుకువచ్చిన మెడికల్ సీట్లను ఇప్పుడు కాదంటూ చంద్రబాబు తిప్పిపంపుతున్నారని.. ఇటీవల మాజీ సీఎం జగన్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. మొత్తంగా 8 పాయింట్లతో కూడిన ట్వీట్‌ను ఆయన పోస్టు చేశారు. తాము ఎంతో కష్టపడి మెడికల్ సీట్లు తెచ్చామని.. దీని వల్ల పేదలకు ఎంతో మేలు జరుగుతుందని.. వైద్య కళాశాలలతోపాటు.. …
Read More »సుప్రీం ఆదేశాలు.. హైడ్రాకు పగ్గాలు వేసినట్టేనా?
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జరిగిన చెరువుల ఆక్రమణలు, నాలాలను ఆక్రమించి చేసిన నిర్మాణాలపై గత రెండు మాసాలుగా హైడ్రా కొరడా ఝళిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖుల నివాసాలు.. కట్టడాలను కూడా కూల్చేసిన సంగతి తెలిసిందే. దీనిని అడ్డుకునేందుకు పలువురు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఈ కేసు హైకోర్టు పరిధిలో ఉంది. అయితే.. తాజాగా సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. అది కూడా హైడ్రా తరహాలోనే జరుగుతున్న …
Read More »