Political News

ఆ ఇద్దరు నేతలు టీడీపీలోకి వస్తారా.. ?

రాజకీయాలంటే విమర్శలు. విపక్షంలో ఉంటే ప్రభుత్వ పథకాలు, విధానాలు, నిర్ణయాలను విమర్శించడమే పనిగా పెట్టుకోవడం. అధికారంలో ఉంటే విపక్షాలకు ఓ విధానం లేదని, ఐనదానికి, కానిదానికి తమను టార్గెట్ చేయాలను చూస్తున్నాయని చెప్పుకోవడం.. ఇదీ సాధారణంగా జరిగేదే. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఖమ్మం టూర్లో మాత్రం తెలంగాణ అధికార పార్టీని పేరు పెట్టి విమర్శించినట్లుగా అనిపించలేదు. రెండు రాష్ట్రాలు మళ్లీ కలవాలంటున్నారని వైసీపీని విమర్శించారే తప్ప…. కేసీఆర్ విధానాలను ఒక్క …

Read More »

వైసీపీ నేతకు టీడీపీలో ఎంపీ టికెట్

మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి పేరు తెలియని వారుండరు. ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆయన తర్వాత బాగా వెనుకబడిపోయారు. కడప జిల్లాకు చెందిన ఆయన ఇప్పుడు మాత్రం అమావాస్యకు, పౌర్ణానికి మీడియా ముందుకు వచ్చి స్టేట్ మెంట్లు ఇస్తుంటారు. ఆయన మాటల్లో రాజకీయాల కంటే రాజకీయ విశ్లేషణలే ఎక్కువగా ఉంటుంటాయి.రవీంద్రా రెడ్డి కూడా ఎంపీ రఘురామ కృష్ణంరాజులాగే తయారయ్యారు. వైసీపీలో ఉంటూ జగన్ ను విమర్శించడం …

Read More »

2019 వ‌ర‌కు ఎక్క‌డున్నారు జ‌గ‌న‌న్నా?

Jagan to pick 50 new candidates for 2024 elections

రాజ‌కీయాల్లో నాయ‌కులు ఏం చెప్పినా.. ఏం మాట్లాడినా.. చెల్లుతుంద‌నే రోజులకు కాలం చెల్లింది. ఎందుకంటే.. ప్ర‌జ‌ల‌కు అన్ని లెక్క‌లు ఇప్పుడు అందుబాటులోనే ఉన్నాయి. ప్ర‌జ‌లు ఇంకా కొన్ని జ్ఞాప‌కాల‌ను మ‌రిచిపోలేదు. గురివింద నీతులు చెబితే.. ఎవ‌రూ ఊరుకోరు కూడా. తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. క‌డ‌ప జిల్లాలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ.. తాను ఏపీ వాడిన‌నే ముద్ర వేసుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ఖ‌మ్మంలో ఇటీవ‌ల చంద్ర‌బాబు నిర్వ‌హించిన స‌భ‌.. ఆయ‌న డైలాగుల‌కు …

Read More »

ఉద‌య‌గిరిలో.. సీఎం జ‌గ‌న్ ఫ్లెక్సీలు చించేసి మ‌రీ..

సీఎం జ‌గ‌న్ వ‌స్తున్నాడంటే.. రెండు రోజుల ముందు నుంచే చేస్తున్న హ‌డావుడి అంతా ఇంతా కాదు.. మ‌రి అలాంటి ప్రొటోకాల్‌లో ఉన్న నాయ‌కుడు.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఫ్లెక్సీల‌ను క‌ట్ట‌డ‌మే కానీ.. చింప‌డం .. తెలియ‌ని.. ఏపీలో ఇప్పుడు అవే ఫ్లెక్సీల‌ను చింపేస్తున్నారు. ధిక్కార‌మున్ సైతువా.. కాదు.. చేస్తున్నారు. వ‌ర్గ‌పోరులో.. సీఎం కూడా ఒక భాగం అయిపోయారు. అది కూడా బ‌ల‌మైన నెల్లూరు జిల్లాలోనే కావ‌డం.. అది కూడా …

Read More »

కేంద్రంపై యుద్ధం.. వెన‌క్కి త‌గ్గిన కేసీఆర్.. రీజ‌నేంటి?

లేస్తే.. త‌గ్గేదేలేదు..! అన్న‌ట్టుగా కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై నిప్పులు చెరిగే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. గ‌తం లోనూ ధాన్యం కొనుగోలు విష‌యంలో త‌లెత్తిన వివాదంతో రోడ్డెక్కారు . సీఎంగా ఉంటూనే.. ఇందిరా పార్కు ద‌గ్గ‌ర నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఇక‌, అదేవిధంగా ఇత‌ర స‌మ‌స్య‌ల‌పైనా కేంద్రాన్ని ఆయ‌న‌ నిలదీస్తున్నారు. తాజాగా కూడా ఉపాధి హామీ ప‌నుల‌కు సంబంధించి కేంద్రం ఇచ్చిన నిధుల‌ను రైతుల క‌ల్లాల‌కు.. సంబంధించి ఖ‌ర్చు చేయ‌డంపైనా.. …

Read More »

రూ.250 పెరిగింది.. 50 వేల పింఛ‌న్లు క‌ట్‌!

ఏపీలో సామాజిక‌ పెన్షన్ పొందే వారికి వైసీపీ ప్ర‌భుత్వం భారీ షాకిచ్చింది. ముఖ్యంగా దివ్యాంగులు.. ఇత‌ర‌త్రా ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి పింఛ‌న్ ఇస్తున్నారు. అయితే.. ఇప్పటి వ‌ర‌కు లేని నిబంధ‌న‌లు వీరికి కూడా వ‌ర్తింప జేస్తూ.. తాజాగా పింఛ‌న్‌ను క‌ట్ చేస్తోంది. 1000 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ ఉన్నా.. 300 యూనిట్లు దాటి విద్యుత్ బిల్లులు కట్టేవారికి పెన్షన్ కట్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేప‌థ్యంలో పెన్షన్‌ …

Read More »

వాళ్ల‌లాగా.. ఈ భార్య కాకపోతే మరో భార్య..

ఏపీ సీఎం జ‌గ‌న్ తీవ్ర‌మైన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌హా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌పై క‌లిపి ఆయ‌న కామెంట్లు సంధించారు. ప్ర‌స్తుతం క‌డ‌ప ప‌ర్య‌ట న‌లో ఉన్న జ‌గ‌న్‌.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. త‌న‌కు ఒక‌టి పోతే.. ఇంకొక‌టి ఆప్ష‌న్ లేద‌ని వ్యాఖ్యానించా రు. తాను ఏపీనే న‌మ్ముకుని ఉన్నాన‌ని చెప్పారు. ఏపీ ప్ర‌జ‌ల‌తోనే త‌న రాజ‌కీయాలు ఉంటాయ‌న్నారు. త‌న‌కు మ‌రో …

Read More »

25-30 సీట్లు ఖాయం.. జ‌న‌సేన‌లో గుస‌గుస‌!

ఏపీలో వ‌చ్చే 2024లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లోనే అధికారంలో వ‌చ్చేస్తామ‌ని జ‌న‌సేన చెబుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. దీనికి విరుద్ధంగా.. పార్టీలో అంత‌ర్గ‌త చ‌ర్చ ఒకటి జ‌రుగుతోంది. ఇప్ప‌టికి ప్పుడు అధికారం రాకున్నా రాక‌పోయినా.. 2029 ఎన్నిక‌ల‌ను టార్గెట్ చేసుకుని.. ఇప్ప‌టి నుంచి పునాదులు బ‌లంగా వేసుకునే వ్యూహాన్ని అమ‌లు చేస్తున్న‌ట్టు నాయ‌కులు గుస‌గుస‌లాడుతున్నారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. రాష్ట్రంలో 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన‌ను పోటీకి పెట్టేందుకు అభ్య‌ర్థులు లేరు. …

Read More »

జ‌గ‌న్ మ‌రిచిపోయిన ‘డిసెంబ‌రు 23’!

తారీకులు.. ద‌స్తావేజులు.. నాకు గుర్తులేవని.. మ‌హాక‌వి శ్రీశ్రీ అంత‌టి వారుచెప్పినా.. నాయ‌కులు సైతం మ‌రిచిపోయినా.. అదేంటో కానీ.. ప్ర‌జ‌లు మాత్రం “మాకు తారీకులూ గుర్తున్నాయి. ద‌స్తావేజులూ గుర్తున్నాయి” అని అంటున్నారు. మ‌రీ ముఖ్యంగా ఏపీ సీఎం జ‌గ‌న్ జాబుల‌కు క్యాలెండ‌ర్ ఇచ్చి.. మ‌రిచిపోకుండా ఉద్యోగాలు ఇస్తామ‌న్నారు. కానీ, మ‌రిచిపోయారు. సంక్షేమ ప‌థ‌కాల‌కు క్యాలెండర్ ఇస్తామ‌న్నారు. ఇచ్చారు. అమ‌లు చేస్తున్నారు. వీటికి గాను అప్పులు కూడా చేస్తు్న్నారు. అయితే.. ఆయ‌న మ‌రిచిపోయింది.. …

Read More »

రాజ‌కీయాల్లో కైకాల మార్క్ ఇదే!

సినీ దిగ్గ‌జంగా ఒక వెలుగు వెలిగిన కైకాల స‌త్య‌నారాయ‌ణ మృతితో తెలుగు సినీ ఇండ‌స్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. సీనీరంగంలో సుదీర్ఘ కాలం అంటే.. దాదాపు 60 ఏళ్ల‌కు పైగానే బంధం ఏర్ప‌రుచుకున్న కైకాల స‌త్య‌నారాయ‌ణ రాజ‌కీయాల్లోనూ అజాతశ‌తృవుగా వ్య‌వ‌హ‌రించారు. రాజ‌కీయాల్లో ఉన్న‌ది చాలా స్వ‌ల్ప కాల‌మే అయినా.. ఆయ‌న నిబ‌ద్ధ‌త‌ను చాటుకున్నారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ ప్రోత్సాహంతో టీడీపీ త‌ర‌ఫున అనేక సంద‌ర్భాల్లో కైకాల ఎన్నిక‌ల ప్ర‌చారం చేశారు. …

Read More »

చిన్న ఎన్టీవోడా.. ఇక వచ్చేయ్యరా..

జూనియర్ ఎన్టీఆర్.. అచ్చం తాతలాగే ఉంటాడు. కెమెరా ముందుకు వచ్చాడంటే నటనను పండించేస్తాడు. నిన్ను చూడాలని, స్టూడెంట్ నెంబర్, ఆది సినిమాల నుంచి ఇప్పటి ట్రిపుల్ ఆర్ దాకా అన్ని సూపర్ హిట్లే. ఒక దశలో జూనియర్ రాజకీయాల వైపు కూడా చూశాడు. తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేశాడు. తర్వాత నటనపై దృష్టి పెట్టేందుకు సైడై పోయాడు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని చాలా మంది కోరుకుంటూనే ఉన్నారు. జూనియర్ …

Read More »

ఒకేసారి 6 వాహనాల్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్న పవన్ కల్యాణ్

ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయానికి వచ్చారు జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆయన రాక సందర్భంగా కాస్తంత సందడి వాతావరణం చోటు చేసుకుంది. ఇంతకూ పవన్ కల్యాణ్ ఆర్టీవో ఆఫీసుకు ఎందుకు వెళ్లినట్లు? అన్నది చూస్తే.. ఆసక్తికర విషయాలు బయటకు వస్తాయి. తాజాగా ఆయన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సుకు అప్లికేషన్ పెట్టేందుకు ఆయన ఆర్టీవో ఆఫీసుకు వచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో పాటు.. తనకు చెందిన ఆరు వాహనాల రిజిస్ట్రేషన్ల …

Read More »