Political News

అలా అయితే.. మీరెన్నికోట్లు ఇచ్చారు..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క్రాస్ ఓటింగ్ చేసిన న‌లుగురు ఎమ్మెల్యేల‌కు టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబునాయుడు 10 నుంచి 20 కోట్ల రూపాయ‌లు ముట్ట‌జెప్పార‌ని.. లేక‌పోతే..వారెందుకు ఓట్లువేస్తార‌ని ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, వైసీపీ కీల‌క నాయ‌కుడు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. అయితే..దీనిపై నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే, రెబ‌ల్ నాయ‌కుడు కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. అలా అయితే.. టీడీపీ నుంచి న‌లుగురు, జ‌న‌సేన నుంచి ఒక ఎమ్మెల్యే వైసీపీ …

Read More »

రాహుల్‌ పై వేటు: ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు రాహుల్ గాంధీ.. మోడీ ఇంటిపేరుతో చేసిన వ్యాఖ్య‌ల‌ను క్రిమినల్ నేరంగా ప‌రిగ‌ణిస్తూ.. సూర‌త్ కోర్టు ఆయ‌న‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించ‌డం, ఆవెంట‌నే ఆయ‌న‌పై పార్ల‌మెంటు అనర్హ‌త‌ వేటు వేయ‌డం.. తెలిసిందే. ఈ నేప‌థ్యంలో జాతీయ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. ఒక‌ప్ప‌టి మోడీ శిష్యుడు ప్ర‌శాంత్ కిషోర్ దీనిపై రియాక్ట్ అయ్యారు. పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రెండేళ్ళ జైలు శిక్ష విధించడం సరికాదని …

Read More »

రాహుల్‌కు మోడీ భ‌య‌ప‌డుతున్నారా?

కాంగ్రెస్ అగ్ర‌నేత‌.. రాహుల్ వ్య‌వ‌హారం.. అనేక కీల‌క మ‌లుపులు తిరిగేలా క‌నిపిస్తోంది. ఆయ‌న‌కు స్థానిక‌కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించ‌డం నుంచి ఆయ‌న‌ను పార్ల‌మెంటుకు అన‌ర్హుడిగా ప్ర‌క‌టించ‌డం వర‌కు.. అనేక అంశాల‌పై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అయితే.. ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని.. గ‌మ‌నిస్తే.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. రాహుల్ కు భ‌య‌ప‌డుతున్నారా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. కానీ, ఆయ‌న రాహుల్‌కు భ‌య‌ప‌డ‌డంలేదు. కేవ‌లం రాహుల్ ద‌గ్గ‌ర ఉన్న కీల‌క ఆధారాలు.. …

Read More »

జగనన్న దిద్దుబాటు చర్యలు

Y S Jagan

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో తల బొప్పి కట్టడంతో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్ని కహానీలు చెప్తున్నా జగన్‌కు మాత్రం పరిస్థితులు అర్థమయ్యాయట. దిద్దుబాటు చర్యలు చేపడితే తప్ప నెగ్గుకు రాలేమన్న సత్యం బోధపడి అందుకు తగ్గ ప్రణాళికలు రచిస్తున్నారట. ఆ క్రమంలోనే యువత, ఉద్యోగులు, టీచర్లను బుజ్జగించడానికి, ఆకట్టుకోవడానికి ఏమేం మార్గాలు ఉన్నాయో అన్వేషించాలని ఇప్పటికే తన కోర్ టీమ్‌కు సూచించినట్లు సమాచారం. మొన్నటి పట్టభద్రుల ఎన్నికల్లో ఓటమి.. …

Read More »

చంద్రబాబే వాళ్లను ఆపారా… !

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఆశ్చర్యకరమైన పరిణామాలను ఆవిష్కరించాయి. ఒక్క ఓటు వస్తే గెలుస్తామని లెక్కలేసుకున్న టీడీపీని అనూహ్యంగా రెండో ఓటు కూడా అదనంగా వచ్చేసింది. 23 సెంటిమెంట్ వర్కవుట్ అయి పంచుమర్తి అనురాధ అనూహ్య విజయం సాధించారు. ఇప్పడదే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశమైంది. క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురికి వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. వారిపై వైసీపీ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. రెబెల్స్ ఎమ్మెల్యేలైన నెల్లూరు …

Read More »

ఏకమవుతున్న ప్రతిపక్షాలు…థ్యాంక్స్ టు బీజేపీ

గడచిన తొమ్మిదేళ్ళలో బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని ప్రతిపక్షాలు ఏకమైన ఘటన దాదాపు లేదనే చెప్పాలి. అలాంటిది ఇపుడు అన్నీ ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. అదికూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా. ఇంతకీ విషయం ఏమిటంటే లోక్ సభ ఎంపీగా రాహూల్ గాంధీపై లోక్ సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది. 2019 కర్నాటక ఎన్నికల ప్రచారంలో రాహూల్ మాట్లాడుతు దొంగలకంతా మోడీ ఇంటిపేరే ఎందుకుంటుంది అని సెటైర్లు వేశారు. ఆర్ధిక నేరాలకు పాల్పడి …

Read More »

జ‌నం ఓకే.. ‘లౌక్యం’ ఏది జ‌గ‌న‌న్నా…!

త‌న‌కు ప్ర‌జాబ‌లం ఉంద‌ని.. దీనినే తాను న‌మ్ముకున్నాన‌ని.. ప‌దే ప‌దే చెబుతున్న సీఎం జ‌గ‌న్‌.. లౌక్యాన్ని విస్మ‌రించారు. త‌ను చెప్పిందే వేదం.. తాను గీసిందే ల‌క్ష్మ‌ణ రేఖ అన్న‌ట్టుగా ఆయ‌న ముందుకు సాగుతున్నారు. దీనివ‌ల్ల పార్టీ న‌ష్ట‌పోతోంద‌నే వాద‌న వినిపిస్తోంది. నిజానికి జ‌గ‌న్ పార్టీ వైసీపీ ఏమీ.. తీసేయాల్సింది కాదు. పుల్ల‌పుల్ల పేర్చి పెట్టుకున్న పిచ్చుక గూడు మాదిరిగా.. అనేక క‌ష్ట‌న‌ష్టాల‌కు.. కేసుల‌కు ఓర్చుకుని.. క‌ట్టుకున్న పొద‌రిల్లు లాంటి పార్టీ …

Read More »

రాహుల్ పై వేటు: కేసీఆర్ సంచ‌ల‌న కామెంట్‌

కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు.. రాహుల్ గాంధీ పై పార్ల‌మెంటు వేటు వేయ‌డాన్ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. తీవ్రంగా ఖండించారు. “భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం పై అనర్హత వేటు వేయడం నరేంద్రమోదీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట“ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ద సంస్థలను దురుపయోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును కూడా తమ హేయమైన చర్యలకోసం మోడీ ప్రభుత్వం వినియోగించుకోవడం …

Read More »

జ‌గ‌న్ మార‌క‌పోతే.. పార్టీ భూస్థాపితం.. : మేక‌పాటి

మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థికి వేయాల్సిన ఓటును క్రాస్ చేశార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆయ‌న సంచ‌ల‌నంగా మారారు. తాజాగాఈయ‌న‌పై పార్టీ అధిష్టానం స‌స్పెన్ష‌న్ కొర‌డా ఝ‌ళిపించింది. అయితే.. దీనికి కొద్దిసేప‌టికి ముందు మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి మాట్లాడుతూ.. జ‌గ‌న్ మార‌క‌పోతే.. పార్టీ భూస్థాపితం అవుతుంద‌ని హెచ్చ‌రించారు. వైసీపీ అధిష్టానం తీరుపై ఉదయగిరి …

Read More »

బ‌య‌టకు రాని వారు చాలా మంది వున్నరు

అటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో విజ‌యం.. ఇటు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం.. వెర‌సి టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మాంచి జోష్‌లో ఉన్నారు. తాజాగా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇకపై టీడీపీ అన్‌స్టాపబుల్ అని, గేరు మారుస్తామని, స్పీడు పెంచుతామని అన్నారు. అడ్డు వస్తే తొక్కుకుంటూ వెళ్తామని చంద్రబాబు హెచ్చరించారు. ఎమ్మెల్సీగా పంచుమ‌ర్తి అనురాధ గెలుపు జగన్‌ సర్కార్‌కు చెంపపెట్టని వ్యాఖ్యానించారు. తప్పులు చేయడం.. …

Read More »

‘టీడీపీ ఆదేశిస్తే.. గేట్లు తెరిస్తే.. 50 మంది ఎమ్మెల్యేలు ఫ‌ట్‌’

ఏపీ అధికార పార్టీ వైసీపీ పై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఉర‌ఫ్ ఆర్ ఆర్ ఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ‘మా పార్టీ ఇప్పుడు చిల్లుపడిన నావ.. తెలివి గల రాజకీయ నాయకుడు ఈదుకుంటూ వెళ్ళిపోతారు’ అని వ్యాఖ్యానించారు. వైసీపీ త్వ‌ర‌లోనే మునిగిపోతుంద‌ని చెప్పారు. ముఖ్యమంత్రి కన్నా పెద్ద పదవిలో ఉన్న సజ్జల రామ‌కృష్ణారెడ్డి, సీఎం జగన్.. ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వాలని సూచించారు. 23 ఓట్లతో …

Read More »

ఆ న‌లుగురు స‌స్పెండ్‌.. వేటు వేసిన వైసీపీ

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పార్టీకి వ్య‌తిరేకంగా ఓటేశార‌ని పేర్కొంటూ.. వైసీపీ న‌లుగురు ఎమ్మెల్యేల‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసింది. పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లను సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విష‌యాన్ని ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ లో ప్ర‌భుత్వ‌ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. వీరంతా ప్రతిపక్ష …

Read More »