ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారని పేర్కొంటూ.. వైసీపీ నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లను సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. వీరంతా ప్రతిపక్ష …
Read More »ఈ గెలుపు.. టీడీపీకి ఎలా మేలు చేస్తుందంటే..!
ప్రస్తుతం వరుస విజయాలతో టీడీపీ దూకుడుగా ఉంది. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల లో టీడీపీ మద్దతుదారులుగా ఉన్నవారు మూడు ప్రాంతాల్లోనూ విజయం దక్కించుకున్నారు. ఉత్తరాంధ్ర , పశ్చిమ రాయలసీమ, తూర్పు సీమల పరిధిలో మొత్తంగా.. టీడీపీ విజయం దక్కించుకుంది. అయితే.. ఆ విజయంతోనే.. పార్టీ పుంజుకుందని అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఇప్పడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలతో మరింతగా పార్టీ దూకుడు ప్రదర్శించిందనే చెప్పాలి. అసలు ఏమాత్రం …
Read More »పాపం.. వైజాగ్ రాజకీయ దురదృష్టవంతుడు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి పాలైన వైసీపీ నేత కోలా గురువులను రాజకీయాల్లో దురదృష్టం వెంటాడుతోంది. విశాఖపట్నాన్ని రాజధాని చేసి, తాను కూడా అక్కడి నుంచే పాలన సాగిస్తానని జగన్ చెప్తున్నా అక్కడి బలహీనవర్గాల నాయకుడికి మాత్రం న్యాయం చేయలేకపోయారు. 151 మంది సొంత పార్టీ ఎమ్మల్యేలు, ఇతర పార్టీల నుంచి ఫిరాయించిన మరో అయిదుగురు ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 156 మంది బలగం ఉన్నప్పటికీ విశాఖపట్నం దక్షిణ …
Read More »ఎన్నాళ్లకెన్నాళ్లకు.. చంద్రబాబు ముఖంలో విజయానందం
72 ఏళ్ల వయసులో పోరాట పటిమ ఎంత ఉంటుంది? అంటే.. ఆ వయసులో ఏం చేస్తారు చెప్పండి? అంటూ ప్రశ్నిస్తారు ఎవరైనా. కానీ.. ఈ విషయం మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా టీడీపీ అదినేత చంద్రబాబుకు మాత్రం మినహాయింపుగా చెప్పాలి. రాజకీయాల్లో కిందిస్థాయి నుంచి మొదలైన ఆయన ప్రయాణం అంత ఈజీగా సాగింది కాదు. ఎన్నో ఆటుపోట్లు.. ఎదురుదెబ్బలు ఆయన తిన్నారు. తెలుగు రాజకీయాలు తీవ్రమైన మార్పులు చేసుకుంటున్న …
Read More »టీడీపీకి ఆక్సిజన్ పెరుగుతోందా ?
సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నైతికంగా బలం పుంజుకుంటోందా ? అంటే అవుననే చెప్పాలి. మొన్ననే మూడు పట్టభద్రుల ఎంఎల్సీల సీట్లను గెలుచుకోవటం, తాజాగా ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికలో ఒక సీటు గెలుచుకోవటం అంటే పార్టీకి ఆక్సిజన్ పెరుగుతున్నట్లే అనుకోవాలి. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీలో బాగా నైరాశ్యం పెరిగిపోయింది. ఎందుకంటే ఎన్నిక ఏదైనా ఓటమి మాత్రమే ఎదురవుతోంది. పార్టీ నేతల్లో …
Read More »ఎవరా నలుగురు.. ఏరా నలుగురు: వైసీపీ తేల్చేసింది!!
వైసీపీలో ఏ ఇద్దరు కలిసినా.. గతంలో అన్నగారు ఎన్టీఆర్ సినిమాలో పాడిన పాట ‘ఎవరా నలుగురు.. ఏరా నలుగురు.. ‘ అనే పాట పాడుతున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడు స్థానాలను ఏకగ్రీవం చేసుకోవాలని భావించిన వైసీపీకి భారీ ఎదురు దెబ్బతగిలింది. కీలకమైన ఎన్నికల్లో అనూహ్యంగా.. ఆపార్టీ ఒక స్థానాన్ని కోల్పోయింది. దీనికి నలుగురు ఎమ్మెల్యేలే కారణమని తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఆనలుగురు ఎవరనేది ఇప్పుడు వైసీపీలో చర్చకు …
Read More »23 వర్సెస్ 175
ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీలో అధికార వైసీపీకి ఝలక్ ఇచ్చాయి. మూడు పట్టభద్రుల స్థానాల్లో పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఆ షాక్ నుంచి తేరుకోకముందే పార్టీకి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో తల బొప్పికట్టే పరిస్థితి వచ్చింది. మొత్తం నలుగురు క్రాస్ ఓటింగ్ చేయడంతో పార్టీ అభ్యర్థి కోలా గురువులు ఓడిపోయారు. టీడీపీ నిలబెట్టిన పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. ఇంకేముంది ప్రధాన ప్రతిపక్షం స్పీడు పెంచింది. రెండు …
Read More »కడప, అనంతలో భారీ మార్పులు..
తాజాగా వచ్చిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనంతపురం నేతలు సరిగా పనిచేయలేదని.. వైసీపీ ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. అదే సమయంలో కడపలోనూ జిల్లాల విభజన ఎఫెక్ట్ భారీగా పనిచేసిందని నేతలు భావిస్తున్నారు. ఈ రెండు జిల్లాల ప్రభావం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఉందని అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అనంతపురం, కర్నూలులో ముగ్గురు కీలక నేతల వ్యవహారం.. కడపలో జిల్లా విభజన వెరసి..ఇక్కడ గ్రాడ్యుయేట్ …
Read More »గన్నవరంలో వంశీకి ఎదురు గాలి.. రీజన్ ఇదే..!
అత్యంత కీలకమైన గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ వల్లభనేని వంశీకి ఎదురు గాలి వీస్తోందా? ఆయ న ఓటమిని ముందుగానే రాసిపెట్టుకునే పరిస్థితి వచ్చిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని అంచనా వేస్తున్న వారు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నారు. పార్టీ మార్పును మెజారిటీ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా 38 వేల వరకు ఉన్న యాదవుల ఓటింగ్ గత ఎన్నికల్లో వంశీకి పండింది. అయితే.. ఇప్పుడు …
Read More »ఇగో.. జగన్‌ను ముంచేయబోతోందా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఇగోయిస్ట్ అని ప్రతిపక్ష నేతలే కాదు.. సొంత పార్టీ నాయకులు కూడా ఆంతరంగిక సంభాషణల్లో చెబుతుంటారు. 151 స్థానాల్లో నాలుగేళ్ల కిందట వైఎస్సార్ కాంగ్రెస్ సాధించిన భారీ విజయంలో మేజర్ క్రెడిట్ తనదే అని మొదట్నుంచి ఫీలవుతుున్న జగన్.. ఎమ్మెల్యేలకు కనీస గుర్తింపు కూడా ఇవ్వలేదు. మంత్రులకే అక్కడ ప్రాధాన్యం లేదంటే.. ఇక ఎమ్మెల్యేలను పట్టించుకునేదెక్కడ? సొంత పార్టీ ఎమ్మెల్యేలకే అపాయింట్లు …
Read More »ఇప్పుడదో టెన్షన్ సేన
ఎమ్మెల్సీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేస్తున్నాయి. పట్టభద్రుల ఎన్నికల్లో మూడు చోట్ల గెలవడం, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనురాధ విజయం సాధించడంతో టీడీపీలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోయింది. గత ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు రావడం నాటి మాటేనని, ఇప్పుడు ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని టీడీపీ వర్గాలు అంటున్నాయి. రైజింగ్ స్టార్స్ గా ఉన్న టీడీపీ నేతల్లో ఇప్పుడో ధీమా కూడా కనిపిస్తోంది. …
Read More »మాతో చర్చించాకే.. హైకోర్టు తరలించాలి: కేంద్రం
ఏపీ హైకోర్టు మార్పుపై కేంద్ర ప్రభుత్వం సంచనల ప్రకటన చేసింది. మూడు రాజధానుల్లో భాగంగా కర్నూలును న్యాయ రాజధాని చేస్తామని.. వైసీపీ తరచుగా చెబుతున్న విషయం తెలిసిందే. అయితే.. దీనిపై పార్లమెంటులో టీడీపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం సంచలన ప్రకటన చేసింది. కేంద్రం-రాష్ట్రం కలిసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని.. తమతో చర్చించాకే హైకోర్టును తరలించాలని పేర్కొంది. హైకోర్టును కర్నూల్‌కు తరలిచాలంటే హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కలిసే నిర్ణయం తీసుకోవాలని …
Read More »