రాజకీయాల్లో ఉన్నవారు.. గెలవొచ్చు.. ఓడొచ్చు. ప్రజా తీర్పు. ప్రజాభిప్రాయమే ప్రజాస్వామ్యానికి గీటు రాయి కనుక.. ఎంతటి వారైనా.. దీనికి బద్ధులు కావాల్సిందే. నా మాటనే ఎదిరిస్తారా అంటూ.. దేశాన్ని తన చేతిలోకి తీసుకుని నల్లచట్టాన్ని ప్రయోగించి ఇందిరమ్మ సైతం.. ప్రజాభిప్రాయ తుఫాను కెరటాల్లో కొట్టుకుపోయిన సంగతి .. ఈ దేశం ఒక చరిత్ర.
ఆమె అక్కడితో కుంగిపోలేదు.. రాటు దేలారు.. తప్పులు తెలుసుకున్నారు. ఎమర్జెన్జీ వంటి కీచక చట్టం తన పతనానికి కారణమని తెలుసుకుని లెంపలేసుకుని తర్వాత విజయం దక్కించుకున్నారు.
ఇలాంటి ఉదాహరణలు ఈ దేశంలో కోకొల్లలు. భిన్నమైన వ్యక్తలు.. భిన్నమైన మనస్తత్వాల కలగాపులగం గా ఉన్న భారత ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోనవసరం లేదు. ఎవరికీఅర్థం కూడా కాదు. అదే అర్థమై ఉంటే.. మోడీకి 400 సీట్లు దక్కేవేమో.
అందుకే ప్రాప్తకాలజ్ఞతగా వ్యవహరించాలి. ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం అయినా..చేయాలి. ఈ విషయంలోనే వైసీపీ అధినేతగా జగన్ విఫలమయ్యాను. “నేను చేసిం ది మంచి!“ అని ఇప్పటికీ చెప్పుకోవడం వెనుక .. లోపించిన ప్రాప్తకాలజ్ఞత స్పష్టంగా గోచరమవుతోంది.
“ఎవరి కోసం.. అధికారంలోకి వచ్చాం.. ఎవరు ఈ అధికారాన్ని అప్పగించారు? అనే రెండు సూత్రాలే ప్ర భుత్వానికి ప్రామాణికత“ అంటూ.. పార్లమెంటు వేదికగా.. వాజపేయి చేసిన సూచన అక్షర సత్యం. ఆనాడు.. `ఒక్క ఎంపీ` లోటుతో అధికారం కోల్పోయిన క్షణంలో ఆయన చేసి ఈవ్యాఖ్యలే తర్వాత కాలంలో ఆయనను తిరుగులేని మెజారిటీతో అధికారం దక్కించుకునేలా చేశాయి.
`అధికారం ఐదేళ్ల అవధి. జనజీవన సాంగత్యం జీవిత పర్యంతం`- అంటూ.. తొలి పలుకుల్లో పార్లమెంటుకు హితవు పలికిన నెహ్రూ.. జీవితకాలంలో ఏ నాడూ ఓడింది లేదంటే.. ఎంత దూరదృష్టితో ఆయన ప్రజలకు చేరువయ్యారో చూడొచ్చు.
లోపాలు ఉండొచ్చు.. తప్పులు కూడా చేయొచ్చు. పాలకులు కూడా మనుషులే. కానీ, వాటిని తెలుసుకోగ లిగిన నాడే.. నాయకుడు జననేత అవుతాడు. ఈ లోపం జగన్ ను ఇంకా వెంటాడుతూనే ఉంది.
ఇంకా.. నేను చేసిన చట్టాలు మంచివి.. అణిచివేతలు మంచివి.. మద్యం మంచిది.. పన్నులు మంచివి.. ప్రజలే నన్ను అర్ధం చేసుకోలేకపోయారని ఆయన చెబుతున్న తీరును చూస్తే.. ఇంకా జగన్ బయటకు రాలేదా? లేక ఆయన చుట్టూ ఉన్నవారే.. బయటకు రానివ్వడం లేదా? ఏదేమైనా.. గెలుపు-ఓటమి.. సహజం.. తేడా తెలుసుకోవడమే ముఖ్యం జగన్!!
Gulte Telugu Telugu Political and Movie News Updates