ఏపీలోను, కేంద్రంలోనూ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పార్టీల ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిం దే. కొందరు కూటమి నాయకులు ఆదర్శంగా నిలుస్తున్నారు. మూలాలను మరిచి పోకుండా వ్యవహరిస్తు న్నారు. తమ వృత్తిని మరిచిపోనివారు ఒకరైతే..తమకు రాజకీయంగా ప్రాధాన్యం పెంచిన పార్టీని మరిచి పోని వారు మరొకరు. తమ మాతృభాషకు పట్టం కడుతున్నవారు ఇంకొకరు. ఇలా.. మొత్తంగా నాయకులు.. మూలాలు మరవకుండా ముందుకు సాగుతున్నారు.
కింజరాపు రామ్మోహన్ నాయుడు: ఈయన కేంద్ర విమానయానశాఖ మంత్రి. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి విజయం దక్కించుకున్న నాయకుడు. తాజాగా పార్లమెంటులో ఆయన ఎంపీగా ప్రమాణం చేశారు. అయితే.. ఈ ప్రమాణం.. అచ్చమైన తెలుగు భాషలో చేయడం విశేషం. అంటే.. ఆయన తన మాతృభాషను మరిచిపోలేదన్న మాట.
కలిశెట్టి అప్పలనాయుడు: ఈయన విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ టికెట్‌పై తొలిసారి విజయం దక్కించుకున్నారు. అనూహ్యంగా టికెట్ దక్కించుకున్న ఈయన ఆర్థికంగా అంతంత మాత్రమే నని ఇటీవల చంద్రబాబు కూడా చెప్పారు. అంతేకాదు.. ఆయనకు పార్టీ సింబల్ సైకిల్ అంటే ఎనలేని ప్రేమ. తాజాగా ఈ ప్రేమను ఆయన చేతల్లో నిరూపించారు. సోమవారం ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలకు ఆయన సైకిల్‌పై వచ్చి.. అందరినీ ఆశ్చచకితులను చేశారు.
పంతం నానాజీ: ఈయన జనసేనకు చెందిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే. మత్స్యకార సామాజిక వర్గానికిచెందిన నాయకుడు. ఇటీవల అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసేందుకు వచ్చారు. అయితే.. అందరిలా కాకుండా.. డిఫరెంట్‌గా మత్స్యకార వేషంలో రావడం గమనార్హం. చేతిలో చేప, వీపుకు మత్సకార బుట్ట, చేతిలో గేలం పట్టుకుని అసెంబ్లీలో ప్రత్యక్ష మయ్యారు. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఏదేమైనా.. వీరంతా తమ మూలాలను.. మరిచిపోకుండా.. ఉన్నతస్థాయిలో ఉన్నా సగౌరవంగా వ్యవహరించడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates