Political News

ఎంపీ చెప్పిన ‘ముందస్తు’ జోస్యం 

రానున్న నవంబర్, డిసెంబర్లో ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగటం ఖాయమట. వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో జోస్యం చెప్పారు. మీడియాతో ఆయన మాట్లాడుతు తెలంగాణాలో డిసెంబర్లో జరగబోయే ఎన్నికలతోనే ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నట్లు చెప్పారు. తాజా ఢిల్లీ పర్యటనలో నరేంద్రమోడీ, అమిత్ షా తో ఈ విషయం మాట్లాడటానికే వచ్చుంటారని ఎంపీ అనుమానం వ్యక్తంచేశారు.మోడీ, అమిత్ షా తో భేటీపై అధికార …

Read More »

చంద్రబాబు ప్రకటించిన దత్తత పథకం

పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబునాయుడు కొత్త పథకాన్ని ప్రకటించినట్లే ఉన్నారు. ఇంతకీ ఆ కొత్త పథకం పేరు ఏమిటంటే పేదల దత్తత పథకం. మేథావులు, ఆర్ధికంగా పటిష్టంగా ఉన్నవారు, ఉన్నతస్ధాయిలో ఉన్నవారంతా తలా ఐదు పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలని పిలుపిచ్చారు. సమాజంలో ధనవంతులు మరింత ధనవంతులవుతుంటే, పేదలు మరింత పేదరికంలో కూరుకుపోతున్నట్లు చెప్పారు. సమాజంలో అసమానతలు పోవాలంటే అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. …

Read More »

వైసీపీపై బాల‌య్య హాట్ కామెంట్స్‌

తెలంగాణ‌లో తాజాగా నిర్వ‌హించిన టీడీపీ ఆవిర్భావ స‌ద‌స్సులో న‌టుడు, అన్న‌గారి కుమారుడు నంద మూరి బాల‌కృష్ణ హాట్ కామెంట్లు చేశారు. టీడీపీ స్థాపించ‌క‌పోతే.. తెలుగు వారు ఢిల్లీకి దాసోహం చేయాల్సి వ‌చ్చేంద‌ని వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న ప్ర‌తినాయ‌కుడు.. టీడీపీ గూటి నుంచి ఎగిరిపోయిన ప‌క్షే.. అని సంచ‌లన కామెంట్లు చేశారు. ఇక‌, టీడీపీ స్థాపించి.. అనతికాలంలోనే అధికారం చేపట్టి తెలుగువాడు ఎక్కడున్నా సగర్వంగా తలెత్తుకునేలా చేసిన ఘనత అన్న‌గారు ఎన్టీఆర్‌కే ద‌క్కుతుంద‌న్నారు. …

Read More »

మోదీ మొహం చాటేశారా?

ఏపీ సీఎం జగన్ పక్షంరోజుల్లో రెండో సారి ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఈ సారి అలా వెళ్లి ఇలా వచ్చారు. కేవలం అమిత్ షా ను కలిసేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లుగా కనిపిస్తోంది. మొత్తం 13 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని సరిగ్గా రాత్రి 11 గంటల సమయంలో అమిత్ షా కు జగన్ సమర్ఫించారు. జగన్ చేసిన విన్నపాల్లో చాలా వరకు పాతవే ఉన్నాయి. పోలవరం ప్రాజెకుకు సంబంధించిన డిమాండ్లలో …

Read More »

తెలంగాణ‌లో పోటీకి 100 మంది సిద్ధం

ఈ ఏడాది జ‌ర‌గ‌నున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీకి సిద్ధ‌మ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌కటించారు. తెలంగాణ‌ను అభివృద్ధి చేసిన పార్టీకి తెలంగాణ‌లో పోటీ చేసే అర్హ‌త ఉందని స్ప‌ష్టం చేశారు. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు ప్రాణ‌సంక‌టంగా ఉన్న ప‌టేల్ ప‌ట్వారీ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేసిన ఘ‌న‌త తెలుగు దేశం పార్టీ దేన‌ని ఆయ‌న తెలిపారు. అందుకే తాము ఇక్క‌డ పోటీకి అన్ని విధాలా అర్హుల‌మ‌ని తెలిపారు. ఇదేస‌మ‌యంలో చంద్ర‌బాబు రాష్ట్రంలోని …

Read More »

దిశ ఎన్ కౌంట‌ర్ త‌ప్పే.. కానీ, త‌ప్ప‌లేదు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గాన్ని మ‌హిళ‌కు కేటాయిస్తాన‌ని సీఎం కేసీఆర్ చెబితే.. తాను పోటీ నుంచి త‌ప్పుకొంటాన‌ని తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో 17 మంది మంత్రులుంటే.. వారిలో ఇద్దరు మహిళలున్నారని తెలిపారు. 119 మంది ఎమ్మెల్యేల్లో మహిళలు కేవలం ఆరుగురే ఉన్నారని చెప్పారు. దీనిని బ‌ట్టి శాసనసభలో మహిళలకు సీట్లు తక్కువ అని అంగీకరిస్తామ‌ని చెప్పారు. అయితే, …

Read More »

కాంగ్రెస్‌.. ఏపీ ఇప్పుడు గుర్తుకు వ‌చ్చిందే..

జాతీయ కాంగ్రెస్ పార్టీకి అనూహ్యంగా ఇప్పుడు ఏపీ గుర్తుకు వ‌చ్చింది. ఏపీ అనే రాష్ట్రం ఒక‌టి ఉంద‌ని.. ఇక్క‌డ కొన్ని రాజ‌కీయ పార్టీలు ఉన్నాయ‌ని.. వాటికి కూడా స్పందించే గుణం ఉంద‌ని.. పాపం.. కాంగ్రెస్‌కు ఇప్పుడు గుర్తుకు వ‌చ్చింది. తాజాగా కాంగ్రెస్ అగ్ర‌నేత‌.. రాహుల్ గాంధీ ఇరుకున ప‌డి…పార్ల‌మెంటు స‌భ్య త్వం కోల్పోయి.. కోర్టు నుంచి జైలు శిక్ష ప‌డి.. ఉన్న‌ ఇంటిని కూడా ఖాళీ చేయాల‌నే వ‌ర‌కు ప‌రిస్థితి …

Read More »

జ‌గ‌న్‌లో అనూహ్య మార్పు.. కార‌ణాలు ఇవేనా?!!

Y S Jagan

ఏపీ సీఎంజ‌గ‌న్‌లో అనూహ్య‌మైన మార్పులు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌కు త‌న సంక్షేమ ప‌థ‌కా ల‌కు కూడా తిరుగులేద‌ని భావించిన ఆయ‌న.. అప్పులు చేసైనా కూడా.. ఆయా ప‌ప‌థ‌కాల‌ను అమ‌లు చేశారు. అయితే.. తాజాగా జ‌రిగిన గ్రాడ్యుయేట్‌, ఎమ్మెల్యే కోటా  ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఎదురైన ప‌రాభ‌వాల నుంచి జ‌గ‌న్ పాఠాలు నేర్చుకున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి.. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌కు కార‌ణాలు వంటివి ఆయ‌న‌ను మార్పు దిశ‌గా అడుగులు వేసేలా …

Read More »

గొడ్డలి, గన్, గంజాయి…

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడేం జరుగుతోంది. పాలన ఎలా ఉంది.. పైకి వెళ్తోందా.. కిందకు వెళ్తుందా.. ఇలాంటి ప్రశ్నలకు స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు సమాధానం చెప్పారు. తెలుగుదేశం 41వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభకు భారీగా పార్టీ శ్రేణులు, అభిమానులు తరలి వచ్చారు. బాలయ్య మార్క్ ప్రసంగం తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు గంటన్నర పాటు మాట్లాడారు. జగన్ ప్రభుత్వ తీరును ఆయన …

Read More »

క‌ర్ణాట‌క‌లో మోడీకి ఎదురు గాలి.. స‌ర్వే ఏం చెబుతోందంటే!

బీజేపీ అధికారంలో ఉన్న క‌ర్ణాట‌క‌ను మ‌రోసారి ద‌క్కించుకోవాల‌ని.. ఆ పార్టీ పెద్ద‌లు విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది ఇప్ప‌టికి మూడు మాసాలు కూడా గ‌డ‌వ‌క‌ముందే.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అభివృద్ధి ప‌నుల పేరిట‌.. ఐదు సార్లు వ‌చ్చి వెళ్లారు. వ‌చ్చిన ప్ర‌తిసారీ.. ఆయ‌న ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాలు కూడా చేశారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీకి అనుకున్న విధంగా ప‌రిస్థితి ఉండ‌ద‌ని.. తాజాగా వెలుగు చూసిన …

Read More »

అవినాశ్ రెడ్డి.. నెల రోజుల గడువు పెట్టిన సుప్రీంకోర్టు

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు ఊహించని రీతిలో ఆదేశాలు జారీచేసింది. ఈ కేసు విచారణ ఏప్రిల్ 30 లోగా పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. దీంతో ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డి భవిష్యత్తు ఏంటనేది ఈ గడువుతో తేలనుంది. అయితే… సుప్రీంకోర్టు ఏప్రిల్ 30 వరకు గడువు ఇవ్వగా సీబీఐ అంతకంటే రెండు వారాల ముందు .. అంటే, ఏప్రిల్ 15కే …

Read More »

జగన్ కేబినెట్లోకి కొడాలి, బాలినేని?

ఏపీలో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. మంత్రి పదవులు ఎవరికి వస్తాయి.. ఎవరి పదవులు ఊడుతాయనే విషయంలో రోజురోజుకీ అంచనాలు, ఊహాగానాలు మారిపోతున్నాయి. నిజానికి పార్టీ అధిష్టానం వద్ద దీనిపై జరుగుతున్న ఎక్సర్‌సైజ్‌లోనూ అనేక ఈక్వేషన్లు చెక్ చేస్తుండడంతో ఆ ప్రకారమే పార్టీవర్గాల నుంచి బయటకు లీకులొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వినిపిస్తున్న పేర్లుపై ఆ పార్టీ ఆశావహులు నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. అందుకు కారణం.. జగన్ తొలి …

Read More »