మాజీ ఎంపీ రమేష్ రథోడ్ ఎంపీ కన్నుమూత

ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రథోడ్ కన్నుమూశారు. నిన్న రాత్రి ఉట్నూర్ లోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఆదిలాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన మృతి చెందారు. రమేష్ రథోడ్ 1999 లో టిడిపి నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యేగా, 2009 లో ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం బిజెపి లో కొనసాగుతున్నారు.

రమేశ్ రాథోడ్ తొలి సారిగా తెలుగుదేశం పార్టీ నుండి నార్నూర్ జడ్పీటిసిగా గెలిచాడు.ఖానాపూర్ నియోజకవర్గం టీడీపీ శాసనసభ్యునిగా 1999లో 20 వేల మెజారిటితో గెలిచాడు. 2006 నుండి 2009 వరకు అదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా, 2009 లో ఆదిలాబాద్ లోక్ సభకు పోటీచేసి పార్లమెంటు సభ్యుని గా ఎన్నికయ్యాడు.

ఆ తర్వాత కాంగ్రెస్, అనంతరం బీఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన ఇటీవల బీజేపీ నుండి ఖానాపూర్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయాడు. ఈ సారి ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ టికెట్ కోసం చివరి వరకు పోరాడినా చివరి నిమిషంలో పార్టీలో చేరిన గోడెం నగేష్ కు పార్టీ టికెట్ దక్కింది.