ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారనున్నారా? త్వరలోనే కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టనున్నారా? ఈ క్రమం లో మార్పులు, చేర్పుల దిశగా కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే దృష్టి పెట్టిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. రెండు రోజుల కిందట కేంద్రంలోని కాంగ్రెస్ అధిష్టానం.. ఏపీ రాజకీయాలపై ఆరాతీసింది. ఇక్కడ ఉన్న పరిస్థితిని అంచనా వేసింది. వచ్చే ఎన్నికల వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే కష్టమేనని తేల్చింది. ఈ క్రమంలోనే …
Read More »ప్రతిపక్షాలకు బీజేపీ బుద్ధులు చెబుతోందా ?
‘సభను మార్కెట్లాగ మార్చేద్దామా’ ? ఇది తాజాగా రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభ్యులను ఉద్దేశించి సంధించిన ప్రశ్న. గడచిన 12 రోజులుగా పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా ప్రముఖుల మొబైల్ ఫోన్లను కేంద్రప్రభుత్వం ట్యాపింగ్ చేయించిందనే ఆరోపణలపై పార్లమెంటు దద్దరిల్లిపోతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాలకు చెందిన ఎంపిలు ఒకవైపు లోక్ సభలోను అలాగే ఇటు రాజ్యసభలో కూడా పెగాసస్ ఆరోపణలపై విచారణ చేయాలని, ప్రధానమంత్రి సమాధానమివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే …
Read More »కరెన్సీ నోట్లపై అంబేద్కర్ బొమ్మ… కేసీఆర్ కొత్త ఉద్యమం
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలగాణ సీఎం కేసీఆర్ ఎంచుకునే అంశాలు, వాటిని ముందుకు తీసుకువెళ్లే విధానాలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణ రాష్ట్రం పోరాటం నుంచి ఇప్పుడు రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు పథకాల వరకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు తాజాగా అదే తరహా నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ బొమ్మ ముద్రించాలన్న నినాదాన్ని ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ …
Read More »ఆమంచికి వైసీపీ చెక్.. మరోదారి చూసుకోవడమేనా?
ప్రకాశం జిల్లా చీరాల రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఇటీవల కాలంలో తరచుగా చీరాల పాలిటిక్స్ లో కుంపటి రగులుతూనే ఉంది. వైసీపీ తరఫున ఇక్కడ పోటీ చేసి గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆమంచి కృష్ణమోహన్‌కు .. టీడీపీ తరఫున విజయం దక్కించుకుని కూడా.. 40 ఏళ్ల బంధాన్ని తెంచుకుని.. వైసీపీ పంచకు చేరిపోయిన.. కరణం బలరామకృష్ణమూర్తిల మధ్య రాజకీయ వైరం రోజుకో మలుపు తిరుగుతోంది. తనకే ఆధిపత్యం దక్కాలని.. ఇరువురు …
Read More »హరీశ్ రావుకు ఆ విషయంలో గుడ్ న్యూస్ చెప్తున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు, మంత్రి హరీశ్ రావుకు గత కొద్దికాలంగా టీఆర్ఎస్ పార్టీలో మునుపటి ప్రాధాన్యం దక్కుతున్న సంగతి తెలిసిందే. మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీకి గుడ్ బై చెప్పడం, హుజురాబాద్ లో ఉప ఎన్నికలు వస్తున్న తరుణంలో హరీశ్ రావుకు మునుపటి కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే, ఈ ప్రాధాన్యానికి తోడుగా మరింత జోష్ పెంచేలా త్వరలో హరీశ్ రావుకు ఇంకో తీపికబురు …
Read More »ఈటలపై హోరెత్తిన బ్యాడ్ ప్రచారం.. ఏం జరిగిందంటే!
ఆలు లేదు.. చూలు లేదు.. అన్నట్టుగా.. ఉంది ఉమ్మడి కరీంనగర్‌లోని హుజూరాబాద్ ఉప ఎన్నిక ఘట్టం. ఇక్కడ ఇంకా నోటిఫికేషన్ విడుదల కాలేదు. కానీ, అధికార పార్టీ నేతల దూకుడు, అదేసమయంలో ఇక్కడ నుంచి గెలిచి.. టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా అదే రేంజ్‌లో ప్రచారం ప్రారంభించారు. ఈటల పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు అధికార పార్టీ.. పథకాలతో ప్రజలకు చేరువ అవుతోంది. …
Read More »ఈ ఇద్దరూ జిల్లాకు చేసిందేమీ లేదా.. ?
విశాఖ జిల్లా అనంగానే ఇద్దరు మాజీ మంత్రులు గుర్తుకువస్తారు. ఇక తెలుగుదేశం ఏలుబడి కూడా సుదీర్ఘంగా సాగింది. ఏకంగా 22 ఏళ్ల పాటు టీడీపీ ఉమ్మడి ఏపీని, విభజన ఏపీని ఏలింది. విశాఖ జిల్లాలో చూసుకుంటే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఎపుడు గెలిచినా కూడా మంత్రిగానే పనిచేసేవారు. ఆయన నాడు ఎన్టీఆర్ ప్రభుత్వంలోనూ, తరువాత చంద్రబాబు జమానాలోనూ కూడా కీలకమైన శాఖలు అన్నీ కూడా చేపట్టారు. అదే విధంగా విశఖ …
Read More »ఇటు దళితుడు అటు రెడ్డి.. కేసీఆర్ కొత్త ఎజెండా
హుజురాబాద్ ఉప ఎన్నికను తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మాజీ సహచరుడికి మైండ్ బ్లాంకయ్యే ఓటమిని రుచి చూపించేందుకు కేసీఆర్ అన్ని అస్త్రాలు వాడుతున్నారు. ఇందులో భాగంగా పలు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ దీనికి తోడుగా రాజకీయ పాచికలు సైతం వేస్తున్నారు. తాజాగా హుజురాబాద్ లో కీలకమైన రెడ్డి, దళిత సామాజాకి వర్గం ఓట్లకు కొత్త ప్రణాళిక రచించి అమలు చేస్తున్నారు. …
Read More »‘పోలవరం’పై సాయిరెడ్డి ఎత్తుగడ వికటించిందా..?
రాష్ట్రానికి జీవనాడి అయిన.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రాజకీయం చేయాలని భావించిన వైసీపీ ఎదురు దెబ్బతగిలిందా ? ఆ పార్టీ ఎంపీ.. పార్టీ ప్రధాన కార్యదర్శి.. విజయసాయిరెడ్డి ఒకటి తలిస్తే.. మరొకటి జరిగిందా ? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ సీనియర్లు. పోలవరం విషయాన్ని గత చంద్రబాబు సర్కారు సీరియస్‌గానే తీసుకుంది. ఈ క్రమంలో వారం వారం పోలవరం పనులను చంద్రబాబు సమీక్షించేవారు. అవసరమైన ప్రతిసారీ.. ఆయనే నేరుగా ప్రాజెక్టు …
Read More »విశాఖ ఉక్కు.. ఎలా కవర్ చేద్దాం.. వైసీపీలో హీటెక్కిన చర్చ
వైసీపీలో నేతల మధ్య చర్చలు వేడెక్కాయి. ఇప్పుడు ఎలా ముందుకు సాగుదాం.. ప్రజలను ఎలా నమ్మిద్దాం! అంటూ.. నేతలు తర్జన భర్జన పడుతున్నారు. ఇంతకీ ఏవిషయం అంటే.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశమే! ఈ విషయంలో “మేం ఆపుతున్నాం.. కేంద్రాన్ని వేలు పెట్టనివ్వం. మా ముఖ్యమంత్రి ఇప్పటికే లేఖలు సంధించారు. ప్రతిపక్షాలు అనవరంగా రాజకీయం.. రాద్ధాంతం చేస్తున్నాయి. మాకు మాత్రం విశాఖ ఉక్కుపై ప్రేమ లేదా? రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత …
Read More »మోత్కుపల్లి దూకుడు బాగానే ఉంది కానీ అక్కడుంది కేసీఆర్
తెలంగాణ రాజకీయాల్లోని సీనియర్ నేతల్లో ప్రస్తుతం ఏ పార్టీలో లేని మోత్కుపల్లి నర్సింహులు ఒకరు. ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన ఆయన టీఆర్ఎస్ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఓ వైపు ఈ ఎపిసోడ్ ఇలా ఉంటే మోత్కుపల్లి మాత్రం ఊహించని రీతిలో ముందుకు సాగుతున్నారంటున్నారు. దానికి కారణం తాజాగా మోత్కుపల్లి చేసిన కామెంట్లు. టీఆర్ఎస్ నేతగానే, ఇంకా చెప్పాలంటే …
Read More »జగన్ కు కేంద్రం షాకిచ్చేలా ఉందే…
పార్లమెంటులో కేంద్రమంత్రి చెప్పిన ఓ జవాబు విన్న తర్వాత జగన్ కు కేంద్రప్రభుత్వం షాకిచ్చేట్లే ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే టీడీపీ ఎంపి కనకమేడల రవీంద్రకుమార్ వేసిన ఓ ప్రశ్నకు కంద్రమంత్రి కిరణ్ రిరిజు సమాధానమిస్తు ఏపిలో శాసనమండలి రద్దు అంశం కేంద్రం పరిశీలనలో ఉందన్నారు. మండలిలో రాష్ట్రప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నయాన్న కారణంతో ఏకంగా మండలినే రద్దు చేయాలంటు ఈ ఏడాది జనవరిలో జరిగిన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి తీర్మానం …
Read More »