Political News

త్వరలో జగన్‌కు షాక్ ఇవ్వనున్న బీజేపీ

బీజేపీ, వైసీపీల మధ్య బంధం బ్రదర్ ఫ్రం ఎనదర్ మదర్ అన్నట్లుగా సాగుతోంది ఇంతవరకు. ఒకరికొకరు సహకరించుకుంటూ సాగిపోతున్నారు. కానీ, వచ్చే ఎన్నికల నాటికి ఈ అన్యోన్య బంధంలో ఆటుపోట్లు తప్పవని తెలుస్తోంది. జగన్ ఎంత అణకువగా ఉన్నప్పటికీ ఏపీలో పట్టు కోసం కాచుక్కూచున్న బీజేపీ తన పని మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. ఆ క్రమంలోనే ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలతో బీజేపీ టచ్‌లో ఉందని.. కొద్దిరోజులలో ఆ వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో …

Read More »

దసరాకు కేసీఆర్ మేనిఫెస్టో.. ఏమేం ఉంటాయంటే

జాతీయ రాజకీయాలలో అంతుచిక్కని వ్యూహాలతో వెళ్తున్న బీఆర్ఎస్ నేత లోక్ సభ ఎన్నికల కోసం చాలా స్ట్రాంగ్ మేనిఫెస్టో తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలోని రాజకీయ అనుభవజ్ఞులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో చర్చలు జరుపుతూ మేనిఫెస్టో రూపకల్పన పనిలో ఆయన బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. మేనిఫెస్టో స్ట్రక్చర్ ఎలా ఉండాలనే విషయంలో క్లారిటీతో ఉన్న కేసీఆర్.. అందులో ఏమేం ఉండాలనే విషయంలో వర్క్ చేయిస్తున్నారట. తెలంగాణలో పెద్ద పండగగా …

Read More »

విజయసాయి మారాడు.. వైసీపీ మారలేదు

వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా మైక్ అందుకున్నారంటే చాలు.. రాజకీయాలు దిగజారిపోయాయి అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. అలాగే విలువల గురించి కూడా ఆయన మాట్లాడని రోజంటూ ఉండదు. ప్రతిపక్షంలో ఉన్నపుడు, అలాగే అధికారంలోకి వచ్చాక కూడా ఆయనది ఇదే పాట. ఆయన మైక్ పట్టుకుని ఇలా సూక్తులు వల్లిస్తుంటే.. ఇంకో పక్క సోషల్ మీడియాలో వైసీపీ మద్దతుదారులు బూతు పురాణంతో ప్రత్యర్థులను టార్గెట్ చేస్తుంటారు. …

Read More »

కేఏ పాల్..జేడీ ఏకమయ్యారా ?

సమాజంలో కొందరు వ్యక్తుల వ్యక్తిత్వం మీద మాట్లాడే విధానంపైన జనాల్లో ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్, సీబీఐ జేడీగా పనిచేసిన వీవీ లక్ష్మీనారాయణ మీద కూడా జనాల్లో కచ్చితమైన అభిప్రాయాలుంటాయి. అలాంటిది వీళ్ళద్దరి కలిసి మీడియా సమావేశంలో పాల్గొనటమే చాలా విచిత్రంగా ఉంది. కేఏ పాల్ అంటే తెలుగురాజకీయాల్లో ఒక హస్యపాత్రగా జనాలు చూస్తున్నారు. నోటికేదొస్తే అది మాట్లాడేసే పాల్ తన చేష్టలతో జనాల …

Read More »

రంగంలోకి వివేకా రెండో భార్య‌.. తెర‌వెనుక చ‌క్రం తిప్పుతోందెవ‌రు?

రెండు తెలుగు రాష్ట్రాల‌నే కాదు..దేశాన్ని సైతం ఉలిక్కిప‌డేలా చేసిన 2019 నాటి.. వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌లో భారీ ట్విస్ట్ తెర‌మీదికి వ‌చ్చింది. ఇన్నాళ్లుగా ఎక్క‌డ ఉన్నారో.. ఏం చేస్తున్నారో కూడా తెలియ‌ని.. వివేకా రెండో భార్య‌, ముస్లింమైనారిటీ వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి ఇప్పుడు అకస్మాత్తుగా తెర‌మీదికి వ‌చ్చారు. వివేకా కుటుంబానికి చెందిన ఆస్తిలో త‌న‌కు భాగం కావాల‌ని.. దానిని వివేకా కుమార్తె.. సునీతా రెడ్డి తొక్కి పెడుతున్నార‌ని.. దీనిపై న్యాయ‌పోరాటానికి …

Read More »

జగన్ రేఖను సాయిరెడ్డి దాటేసినట్లేనా?

చంద్రబాబు పుట్టిన రోజు వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ నేతల సోషల్ మీడియా అకౌంట్లు అన్నీ అభినందన సందేశాలతో నిండిపోతాయి. వాట్సాప్‌లలో స్టేటస్‌లు, డీపీలలో చంద్రబాబుతో తాము ఉన్న ఫొటోలతో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు టీడీపీ నేతలు ఆనందం షేర్ చేసుకుంటారు. సొంత పార్టీ వారే కాదు చంద్రబాబు స్థాయి రీత్యా, ఆయనకు ఉన్న పరిచయాల రీత్యా దేశంలోని ఇతర పార్టీల నేతలు, ప్రధాని, ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా …

Read More »

మళ్లీ వార్తల్లోకి నన్నపనేని రాజకుమారి

రాజకీయం అంటే అదో ఉత్సాహం, అదో ఆరాటం, ఖచితంగా చెప్పాలంటే అదో వ్యసనం. రాజకీయాలు అలవాటైన వాళ్లు అది మానుకోవడం చాలా కష్టం. రాజకీయ సన్యాసం చేస్తామని చెప్పుకున్న వాళ్లే మళ్లీ వెనక్కి వస్తారు. మహతీర్ మహ్మద్ తన 94వ ఏటా మలి దఫా మలేషియా ప్రధాని అయ్యారు.. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే ఓ మాజీ మంత్రి రాజకీయాల్లో అంతర్ధానమై పోయారనుకుంటే ఆమె స్వయంగా పునరాగమనానికి ప్రయత్నిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి.. …

Read More »

ఎన్నికల కోసం హెలికాప్టర్లే తీసేసుకున్నారు

చూస్తుంటే దేశంలోని అత్యంత ఖరీదైన ఎన్నికలుగా కర్నాటక ఎన్నికలే నిలుస్తాయేమో. ఎందుకంటే కన్నడ పార్టీల్లో డబ్బుకు కొదవలేని పార్టీలు దాదాపు లేవు. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్, గాలి పార్టీ అన్న తేడా లేకుండా చాలామంది అభ్యర్ధులు వేల కోట్ల రూపాయల ఆస్తులు, వ్యాపారాలున్నవారే. కాబట్టి ఎన్నికల్లో వందల కోట్ల రూపాయల ఖర్చులన్నది వీళ్ళకు అసలు లెక్కే కాదు. ఎన్నికల కమీషన్ పరిమితి కన్నడ నాట ఎందుకు పనికిరాదు. …

Read More »

టీడీపీకి అంబ‌టి రాయుడు షాక్

అంబ‌టి రాయుడు.. క్రికెట్ పాలో అయ్యేవారికి ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేని పేరు. అంత‌ర్జాతీయ క్రికెట్లో, అలాగే ఐపీఎల్‌లో ఎన్నో మెరుపు ఇన్నింగ్స్‌లతో మంచి పాపులారిటీనే సంపాదించాడు ఈ టాలెంటెడ్ క్రికెట‌ర్. 37 ఏళ్ల వ‌య‌సులో ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో చెన్నైకి ఆడుతూ. కెరీర్ చ‌ర‌మాంకంలో ఉన్న అత‌ను త్వ‌ర‌లో ఆట‌కు టాటా చెబుతాడ‌నే అంచ‌నాలున్నాయి. క్రికెట్ నుంచి తప్పుకోగానే అత‌ను రాజ‌కీయాల్లోకి వ‌స్తాడ‌నే సంకేతాలు బ‌లంగా వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఆంధ్ర‌ప్ర‌దేశ్ …

Read More »

ఎవ్రీ టైమ్ ఆన్ డ్యూటీ @ 73

పడిలేచే కడలి తరంగం ఆయన. ఓడిన ప్రతీసారీ గెలిచి జనం హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నాయకుడాయన. అభివృద్ధి అంటే గుర్తుకొచ్చే మొదటి పేరు ఆయనది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ, శాస్త్ర, సాంకేతిక, సాఫ్ట్‌వేర్ విస్తరణకు ఆయన సేవలు నభూతోనభిష్యతీ అని చెప్పక తప్పదు. ఆయనే రికార్డు కాలం ఏపీకి ముఖ్యమంత్రిగా సేవలందించిన నారా చంద్రబాబు నాయుడు. నేడు ఆయన 73వ పుట్టినరోజు.. ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం అంటూ …

Read More »

‘ఒక బాబాయి హ‌త్య‌.. మ‌రో బాబాయి జైలుకు’

వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసుకు సంబంధించి టీడీపీ యువ‌నేత‌, మాజీ మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఒక బాబాయి(వివేకా) హ‌త్య కేసులో మ‌రో బాబాయి(వైఎస్ భాస్క‌ర‌రెడ్డి) జైలు వెళ్లార‌ని.. ఇదంతా ఏంటి జ‌గ‌నూ అంటూ స‌టైర్లు కుమ్మ‌రించారు. జగన్‌ అండ్‌ కో డ్రామా కంపెనీ ఆడిన నాటకాలు ముగింపు దశకు వచ్చాయని చెప్పారు. చేసిన తప్పు నుంచి తప్పించుకునేందుకు ఎన్ని కొత్త ఎత్తులు వేసిన లాభం లేదన్నారు. తండ్రి …

Read More »

విచారణలో ముగ్గురినీ కలుపుతారా ?

వివేకానందరెడ్డి హత్యకేసులో ముగ్గురిని కలిపి విచారించేందుకు సీబీఐ రెడీ అవుతోందా ? జరుగుతున్న పరిణామాలను చూస్తే అవుననే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అరెస్టయిన డాక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డిని ఐదురోజుల పాటు సీబీఐ కస్టడీకి హైకోర్టు అనుమతించింది. తాజాగా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని 25వ తేదీవరకు అరెస్టు చేయద్దని సీబీఐని ఆదేశించిన హైకోర్టు విచారణలో సహకరించాలని ఎంపీకి చెప్పింది. బుధవారం అవినాష్ ను సీబీఐ ప్రశ్నించబోతోంది. …

Read More »