Political News

చంద్రబాబు రూ.30 కోట్ల ఆఫర్ చేశారు : ఏపీ మంత్రి

ఒక్కోసారి అంతే.. కొందరు నేతలు గతంలోకి వెళ్లిపోతుంటారు. అలాంటి వేళలో వారి గొంతులో నుంచి వచ్చే ముచ్చట్లు మహా ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా అలాంటి విషయాన్నే చెప్పుకొచ్చారు ఏపీ మంత్రి రాజన్న దొర. తాజాగా జిల్లాల స్థాయిలో నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీలో మాట్లాడిన సందర్భంగా.. పార్టీ విషయంలో తనకున్న కమిట్ మెంట్ ను చెప్పుకొచ్చారు. పార్టీ విషయంలో తానెంత విధేయుడిగా ఉన్నానన్న విషయం మీదనే ఆయన ఫోకస్ చేసినట్లుగా కనిపించింది. …

Read More »

ఊపందుకున్న అన్నక్యాంటీన్ల.. సెంటిమెంట్‌..!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌నిగ‌ట్టిగా నిర్ణయించుకున్న టీడీపీ.. ఆదిశ‌గా అనేక మార్గాల్లో ప‌రుగులు పెడుతోంది. ప్ర‌జ‌లకు చేరువ అయ్యేందుకు పార్టీ కార్య‌క్ర‌మాల‌ను ముమ్మ‌రం చేసింది. పార్టీ అధినేత చంద్ర‌బాబు.. జిల్లాల యాత్ర‌లు చేస్తున్నారు. అక్టోబ‌రు రెండు నుంచి పార్టీ యువ నాయ‌కుడు.. మాజీ మం త్రి నారా లోకేష్ పాద‌యాత్ర‌లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మినీ మ‌హానాడులు నిర్వ‌హించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే.. వీటితోపాటు.. …

Read More »

బీజేపీ ఇంతా చేస్తే కొండా ఒక‌రేనా.. కోమ‌టి రెడ్డి ఎప్పుడు..?

భార‌తీయ జ‌న‌తా పార్టీ మిష‌న్ తెలంగాణ మొదలుపెట్టింది. జాతీయ కార్య‌వ‌ర్గాల స‌మావేశాల లోపు కీల‌క నాయ‌కుల‌కు గాలం వేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇత‌ర పార్టీల్లో పేరున్న ప‌లువురిని క‌మ‌లం గూటికి చేర్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. బండి సంజ‌య్ టీం రాత్రి ప‌గ‌లూ ఇదే ప‌నిలో నిమ‌గ్న‌మైంది. త‌ద్వారా తెలంగాణలో తామే అస‌లైన ప్ర‌త్యామ్నాయం అని నిరూపించుకునేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. అందుకు అనుగుణంగా టీఆర్ఎస్‌, కాంగ్రెస్ లో ఉన్న అసంతృప్త నేత‌ల‌తో …

Read More »

బ్యాడ్ టైం : రఘురామరాజుకు హైకోర్టు అక్షింతలు

రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు దాఖలు చేస్తున్న నరసాపురం తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజుకు హైకోర్టు అక్షింతలు వేసింది. ఎంపీ దాఖలు చేసిన కేసు సంక్షేమ ఫలాలు అందుకుంటున్న పేదల సంక్షేమానికి వ్యతిరేకంగా ఉందని తీవ్రంగా ఆక్షేపించింది. ఎంపీ వేసిన కేసు పేదల సంక్షేమానికి వ్యతిరేకంగా ఉందని తేల్చి చెప్పేసింది. ఆయన ఉద్దేశ్యం ప్రజా ప్రయోజనాలకు పూర్తి వ్యతిరేకం కాబట్టే కేసును కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపించి …

Read More »

వివాదాల్లో కీల‌క నేత‌లు.. వైసీపీ ప‌వ‌ర్ త‌గ్గుతోందా?

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ మ‌రింత బ‌లోపేతం అయ్యేలా ఉండాలి. ఇదే వైసీపీ అధినేత‌… సీఎం జ‌గ‌న్ కూడా కోరుకున్నారు. అయితే.. దీనికి భిన్నంగా వైసీపీలో వివాదాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. అంతేకాదు.. కీల‌క‌ నేతలను కూడా వివాదాల్లోకి లాగుతున్నారు. కొన్ని చోట్ల పరిస్థితి చేయి దాటి దాడులు, ప్రతిదాడులు చేసుకునే వరకు వెళ్తోంది. నిన్న మొన్నటి వ‌ర‌కు మంత్రులుగా ఉన్న‌వారు. కీల‌క …

Read More »

మోడీ స‌భ‌కు బాబుకు ఆహ్వానం

ఏపీలో మార్పు రానుందా? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. బీజేపీతో టీడీపీ.. టీడీపీతో బీజేపీ క‌లిసి ప‌నిచేసేందు కు మార్గం సుగ‌మం కానుందా? ఈ క్ర‌మంలో వ‌డివ‌డిగా అడుగులు ప‌డుతున్నాయా..? అంటే.. ఔన‌నే అం టున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక ప్ర‌చారంగానే ఉన్న బీజేపీ-టీడీపీ క‌ల‌యిక‌.. సాధ్యం కాద‌ని.. కొంద‌రు ప్రచారం చేస్తున్నారు. అయితే… దీనికి భిన్న‌మైన ప‌రిస్థితి తాజాగా వెలుగు చూసింది. ఏకంగా.. కేంద్ర మంత్రి, సీనియ‌ర్ నాయ‌కుడు …

Read More »

ఏపీలో జ‌గ‌న‌న్న బ‌స్సు బాదుడు.. కేసీఆర్ ఎఫెక్టేనా!

“మేం బ‌స్సు చార్జీలు పెంచుతున్నాం.. మీరు కూడా చార్జీలు పెంచండి!”అంటూ కొన్నాళ్ల కింద‌ట‌.. తెలంగాణ ప్ర‌భుత్వం ఏపీకి లేఖ రాసింది. అయితే.. అప్ప‌ట్లో దీనిని ప‌క్క‌న పెట్టిన ఏపీ ప్ర‌భుత్వం.. తాజాగా ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచేందుకు రెడీ అయింది. జూలై 1 నుంచి బస్సు ఛార్జీలు పెంచాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. డీజిల్‌ సెస్‌ పెంపు వల్ల ఛార్జీలు పెంచక తప్పలేదని అధికారులు చెబుతున్నారు. వాస్త‌వానికి డీజిల్‌ సెస్‌ …

Read More »

అటు రేవంత్‌.. ఇటు సంజ‌య్‌.. ఎవ‌రిది పైచేయి..!

చేరిక‌ల విష‌యంలో జాతీయ‌ పార్టీలు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పోటాపోటీగా వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నారు. రేవంత్ రెడ్డి అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఏడాది త‌ర్వాత వ‌ల‌స‌ల గేట్లు ఎత్తారు. దీంతో ఒకేసారి ప్ర‌వాహంలా ముంచెత్తుతోంది. బండి సంజ‌య్ ఈట‌ల‌తో మొద‌లుపెట్టి సంచ‌ల‌నం సృష్టించారు. కానీ త‌ర్వాత చేరిక‌లు నెమ్మ‌దించాయి. ఇపుడు ఆయా పార్టీల కీల‌క నేత‌ల‌కు గాలం వేసి మోదీ …

Read More »

మంత్రులు-మౌనాలు.. అస‌లేంటి క‌థ‌…!

వైసీపీ మంత్రులు ఉల‌క‌రు.. ప‌ల‌క‌రు. పోనీ.. ఎక్క‌డైనా పెద‌వి విప్పారా.. వివాదాల‌కు కేంద్రాలు అవుతున్నారు. దీనిని స‌రిదిద్దుకోవ‌డం.. పార్టీకి, పార్టీ అధినేత జ‌గ‌న్‌కు త‌ల‌కు మించిన భారంగా మారుతోంది. దీంతో మంత్రులు మౌనంగా ఉంటున్నారా? లేక‌.. ఉద్దేశ పూర్వ‌కంగానే మౌనం పాటిస్తున్నారా? అంటే.. ఉద్దేశ పూర్వ‌కంగానే మౌనంగా ఉంటున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితి తిర‌గ‌బడితే.. త‌మ దారి తాము చూసుకునేందుకు చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు.. …

Read More »

ఏపీలో న‌యా పొలిటిక‌ల్ గేమ్‌… ఏకం కాలేని నేత‌లు…!

రాష్ట్రంలో రెండు ప్ర‌ధాన ప‌క్షాల మ‌ధ్యే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ ఉండ‌నుంది. ఈ విష‌యం బ‌హిరంగ ర‌హ‌స్యం. అవే.. టీడీపీ, వైసీపీ, మ‌ధ్య‌లో పొత్తు రాజ‌కీయాలు పొడిచినా.. కొన్ని జిల్లాల్లోనే అవి ప‌రిమితం అవుతాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. దీంతో.. ఈ రెండు పార్టీల విష‌యంలోనే క్రేజీ రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయి. అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రికి ఎక్క‌డ టికెట్ ఇవ్వాల‌నే విష‌యంలో నాయ‌కులు నోరు విప్ప‌డం లేదు. పైగా.. నియోజ‌క‌వ‌ర్గాల్లో …

Read More »

బాదుడే.. బాదుడు అంటే ఇది క‌దా

దేశ ప్ర‌జ‌ల‌పై మ‌రిన్ని భారాలు ప‌డ‌నున్నాయి. ఇప్ప‌టికే పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల పెంపుతో అన్ని ర‌కాల వ‌స్తువుల ధ‌ర‌లు పెరిగి ప్ర‌జ‌లు అల్లాడి పోతున్నారు. రుణాల‌పై వ‌డ్డీలు బాదేశారు. ఇలాంటి స‌మ‌యంలో అంతో ఇంతో ఉప‌శ‌మ‌నం ఇస్తుంద‌ని భావించిన జీఎస్టీ మండ‌లి స‌మావేశం.. ప్ర‌జ‌ల‌పై మ‌రిన్ని బాదుళ్లు బాదేసింది. అప్ప‌డాల నుంచి గోధుమ పిండి వ‌రకు, చేప‌ల నుంచి మ‌జ్జిగ వ‌రకు బ్యాంకులో డ‌బ్బులు బ‌దిలీ చేసినా.. వేసినా.. పెన్సిళ్ల …

Read More »

మిమ్మ‌ల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నార‌ని ఏబీని అడిగితే..

మూడేళ్ల కింద‌ట వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఇంట‌లిజెన్స్ బ్యూరో చీఫ్‌గా ప‌ని చేసిన ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును ఎలా టార్గెట్ చేస్తోందో అంద‌రికీ తెలిసిందే. అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోప‌ణ‌ల‌తో ఆయ‌న మీద స‌స్పెన్ష‌న్ వేటు వేసి సుదీర్ఘ కాలం ప‌క్క‌న‌పెట్ట‌డం.. చివ‌రికి కోర్టు ఉత్త‌ర్వుల‌తో ఇటీవ‌లే ప్రింటింగ్ అండ్ స్టేష‌న‌రీ క‌మిష‌న‌ర్‌గా నియ‌మించ‌డం తెలిసిందే. కానీ రెండు వారాలు తిర‌క్క‌ముందే …

Read More »