కర్ణాటకలోని సిద్ధరామయ్య నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం.. రాష్ట్రంలో చిచ్చు పెట్టిం ది. రాత్రికి రాత్రి ఎలాంటి ముందస్తు చర్చా లేకుండానే.. సిద్దరామయ్య.. సంచలన ప్రకటన చేశారు.
రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ సంస్థలు.. ఇతర ప్రైవేటు సంస్థలు కూడా.. 75 శాతం ఉద్యోగాలను కన్నడిగులకే కేటాయించాలని ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ఒకరిద్దరు మంత్రులతో మాత్రమే ఆయన చర్చించినట్టు సమాచారం. నిజానికి ఇలాంటి విధానపరమైన నిర్ణయా లు తీసుకునేందుకు మంత్రివర్గంతో చర్చించాల్సి ఉంది.
పైగా జాతీయ పార్టీ అయిన. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో ఆ పార్టీ అధిష్టానంతోనూ సీఎం సిద్దరామయ్య చర్చించి ఉండాలి. కానీ, అలాంటిదేమీ లేకుండా.. సిద్దరామయ్య ఒక నోట్ ఇచ్చేసి.. దీనినే జీవోగా మార్చాలంటూ.. అదికారులను పురమాయిం చారు. దీంతో మంగళవారం రాత్రి దీనికి సంబంధించిన జీవో వచ్చింది.
అయితే.. ఈ జీవోపై ప్రైవేటు సంస్థలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం “నాస్‌కామ్” సంస్థ ప్రబుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. ఒక లేఖను సంధించింది. రాష్ట్ర జీడీపీలో 25 శాతం వాటాగా ఉన్న కార్పొరేట్ సంస్థను ప్రభుత్వం ఇరుకున పెడుతోందని పేర్కొంది.
అంతేకాదు.. టాలెంట్ ఉన్న వారిని తామే నియమించుకుంటామని.. ఇలా 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలన్న నిబంధన అసంబద్ధమని స్పష్టం చేసింది. దీనిని వెనక్కి తీసుకునే విషయంలో ప్రభుత్వం ఆలోచించుకోవాలని సూచించింది. అంతేకాదు.. ఇదే కొనసాగిస్తామని తేల్చి చెబితే.. తమ మున్ముందు ప్రాజెక్టులను వేరే రాష్ట్రాలకు తరలించే ప్రయత్నం కూడా చేస్తామని పేర్కొంది. మరో సంస్థ.. ఇన్‌ఫోసిస్ సైతం.. ఇదే ప్రకటన చేయడం గమనార్హం. స్థానికంగా 75 శాతం ఉద్యోగులను నియమించుకోవడం.. సాఫ్ట్ వేర్ రంగంలో కుదిరే పనికాదని కార్పొరేట్ సంస్థలు కుండబద్దలు కొట్టాయి.
ఇదిలావుంటే.. ఈ విషయంపై ప్రతిపక్షాలు నోరు మెదిపేందుకు జంకుతున్నాయి. స్థానికంగా యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో తాము సంచలన నిర్ణయం తీసుకున్నామని సీఎం సిద్దరామయ్య ప్రకటించినా.. ఆ వెంటనే ఎదురైన సంస్థల ఒత్తిడి.. విమర్శల నేపథ్యంలో ఆయన ఆ ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. మరోవైపు.. స్థానికులకు ఉపాధి కల్పించే సున్నిత వ్యవహారం కావడంతో.. బీజేపీ నాయకులు మౌనంగా ఉన్నారు. ఈ జీవోను వెనక్కి తీసుకున్నాక స్పందిద్దాదమనే ధోరణిలో ఉన్నారు. ఎలా చూసుకున్నా.. స్థానికం 75 శాతం ఉద్యోగాలు కల్పించాలనే నిబంధన గతంలోనూ ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఫలితంగా పెట్టుబడి దారులు వెనక్కి వెళ్లిపోయారు. ఇప్పుడు ఇదే పరిస్థితి కర్ణాటకకు ఎదురు కానుంది.