Political News

మంత్రుల తగువుతో హీట్ పెరిగింది

తెలంగాణలో రెండు కీలక ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైన వేళ, కాంగ్రెస్ ప్రభుత్వం ఐక్యంగా ముందుకు సాగాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన సూచనలు ఇచ్చారు. కానీ పార్టీ నేతల మధ్య ఐక్యత నినాదం కొనసాగుతున్నా, మంత్రుల మధ్య మాత్రం విభేదాల మంటలు చెలరేగుతున్నాయి. తాజాగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మరియు సీనియర్ మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య వాగ్వాదం పెద్దదిగా మారింది. ఇటీవల మంత్రి వర్గ విస్తరణలో అడ్లూరికి అవకాశం …

Read More »

డిజిట‌ల్ బుక్ పెట్టాం.. ఎవ‌రూ రావొద్దంటే ఎలా

వైసిపి అధినేత జగన్ ఇటీవల డిజిటల్ బుక్ పేరుతో ఒక యాప్‌ను తీసుకువచ్చారు. వైసీపీ సమస్యలు, నాయకుల పై నమోదవుతున్న కేసులు, వారి విషయంలో ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అంశాలను కూడా ఈ యాప్‌లో నమోదు చేయాలని ఆయన పార్టీ కేడర్‌కు సూచించారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ, వాస్తవానికి ఒక యాప్ ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయని కానీ ఒక యాప్ ద్వారానే నాయకులపై ఒత్తిళ్లు …

Read More »

అలా కుద‌ర‌దు: జ‌గ‌న్‌కు షాకిచ్చిన పోలీసులు..!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌కు అన‌కాప‌ల్లి పోలీసులు.. భారీ షాక్ ఇచ్చారు. ఆయ‌న‌కు రోడ్డు మార్గం లో ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేద‌ని తేల్చి చెప్పారు. సుమార 63 కిలో మీట‌ర్ల మేర రోడ్ షో చేయాల‌ని జ‌గ‌న్ భావించార‌ని.. కానీ, త‌మిళ‌నాడులోని కరూర్‌లో జ‌రిగిన తొక్కిస‌లాటలో 41 మంది మృతి చెందార‌ని.. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌కు రోడ్ షో నిర్వ‌హించుకునేందుకు అనుమ‌తి ఇవ్వ‌బోమ‌ని తేల్చి చెప్పారు. ఆయ‌న విశాఖ‌ప‌ట్నం నుంచి …

Read More »

బీఆర్ఎస్‌లో కౌశిక్ రెడ్డి కుంప‌టి.. ఇన్ని చిందులా?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్‌లో ఆది నుంచి ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా గుర్తింపు కోసం త‌హ త‌హలాడుతున్న కౌశిక్ రెడ్డి.. తాజాగా మ‌రో కుంప‌టి నెత్తిన పెట్టుకున్నారు. తాను పెట్టుకున్న‌దే కాకుండా.. పార్టీని కూడా బ‌జారున ప‌డేశారు. గ‌త 2023 ఎన్నిక‌ల్లో హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలిసారి విజయం ద‌క్కించుకున్నారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న కుటుంబంతో స‌హా.. సెల్ఫీ వీడియో విడుద‌ల చేశారు. ఈ ద‌ఫా గెలిపించ‌క‌పోతే.. తాను పాడె …

Read More »

కూట‌మి ఉండ‌దు: జ‌గ‌న్ జోస్యం

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. తాజాగా త‌న పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ అబ్జర్వర్లతో తాడేప‌ల్లిలోని కేంద్ర కార్యాల‌యంలో భేటీ అయ్యారు. వ‌చ్చే స్థానిక సంస్థ‌ల ఎన్నిక ల ను దృష్టిలో పెట్టుకుని ఆయ‌న ఈ స‌మావేశాన్ని ఏర్పాటు చేసిన‌ట్టు చెప్పారు. గ‌త 2021లో జ‌రిగిన స్థానికం లో వైసీపీ భారీగా విజ‌యం ద‌క్కించుకుంది. ఈ నేప‌థ్యంలో అదే హ‌వాను కొన‌సాగించాల‌న్న‌ది జ‌గ‌న్ వ్యూహం. …

Read More »

బీహార్ ఎల‌క్ష‌న్‌: కుల‌మా-పొలిటిక‌ల్ బ‌ల‌మా?

రాజ‌కీయాల‌కు -కులాల‌కు మ‌ధ్య సంబంధం గురించి ఇటీవ‌ల ఓ కీల‌క మీడియాలో వ‌చ్చిన క‌థ‌నం.. అంతా ఏపీలోనే ఉంద‌ని! కులాలు.. రాజ‌కీయాల క‌ల‌గాపులగం అంతా.. ఏపీ నుంచే ప్రారంభ‌మైంద‌ని.. స‌ద‌రు మీడియా తీర్మానం చేసింది. కానీ.. ఉత్త‌రాదిన ఉన్న కుల రాజ‌కీయాలు మ‌రెక్కడా లేవ‌న్న‌ది స‌ర్వేలు చెబుతున్న మాట‌. అందునా.. బీహార్‌లో అయితే.. కీల‌క‌మైన యాద‌వ సామాజిక వ‌ర్గం.. కుర్మీ సామాజిక వ‌ర్గం… నాయి సామాజిక వ‌ర్గాలు.. మూడుగా చీలి.. …

Read More »

బాబు విజ‌న్‌: ఏపీకి మరో ప్రముఖ అంతర్జాతీయ సంస్థ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు విజ‌న్‌-2047తో ముందుకు సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో పెట్టుబడుల‌కు భారీ స్థాయిలో ఆయ‌న ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో ఉన్న అపార అవ‌కాశాలను వివ‌రించి.. పెట్టుబ‌డి సంస్థ‌ల‌ను ఆయ‌న ఆహ్వానిస్తున్నారు. తాజాగా ఈ క్ర‌మంలో ఓ అంత‌ర్జాతీయ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. రాష్ట్రంలోని సముద్రతీర రంగంలో వ్యాపార వృద్ధికి అవకాశం.. వ్యాపార విస్తరణ వ్యూహంలో భాగంగా పెట్టుబడులు పెట్టేందుకు …

Read More »

ఏ క్ష‌ణ‌మైనా మోహిత్ రెడ్డి అరెస్టు!

వైసీపీ సీనియ‌ర్ నేత‌, చంద్ర‌గిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి కుమారుడు.. మోహిత్ రెడ్డిని ఏ క్ష‌ణమైనా పోలీసులు అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఏపీలో వైసీపీ పాల‌నా కాలంలో చోటు చేసుకున్న భారీ మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి తాజాగా హైకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. మోహిత్‌రెడ్డి దాఖ‌లు చేసుకున్న‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు.. ఈ కేసులో విచార‌ణ జ‌ర‌కుండానే బెయిల్ …

Read More »

జ‌గ‌న్‌ను ఊహ‌కంద‌ని దెబ్బ కొట్టిన చంద్ర‌బాబు!

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు తమకు మేలు చేస్తాయని ఆ పార్టీ నాయకులు పదేపదే చెప్పిన విషయం తెలిసిందే. తమకన్నా మించి ఎవరు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేరని, ప్రజలకు సొమ్ములు కూడా ఇవ్వలేరని వారు చెప్పుకొచ్చారు. ఇప్పటికీ అదే చెబుతున్నారు. అయితే అనూహ్యంగా సీఎం చంద్రబాబు వైసీపీ కన్నా ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు జగన్ హయాంలో ఇచ్చిన …

Read More »

బీహార్‌లో మ‌రింత వేడి.. ఎంట్రీ ఇచ్చిన ‘ఆప్‌’

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌లైంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల‌కు రెండు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. న‌వంబ‌రు 6, 11 తేదీల్లో ఈ ఎన్నిక‌ల పోలింగ్‌కు రంగం సిద్ధ‌మైంది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు కూట‌ములు.. ఒక ప్రాంతీయ పార్టీ మ‌ధ్య యుద్ధం జ‌రుగుతుంద‌ని భావించ‌గా.. మేం మాత్రం త‌క్కువ తిన్నామా? అంటూ.. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా బీహార్ ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ అయింది. ఈ …

Read More »

లోకేష్ అంటేనే.. వ‌ణికి పోతున్నారే..!

అవును.. నిజ‌మే. వైసీపీ నాయ‌కుల‌కు ఇప్పుడు మంత్రి నారా లోకేష్ సింహ స్వ‌ప్నంగా మారిపోయారనే టాక్ వినిపిస్తోంది. ఏ ఇద్దరు నాయ‌కులు క‌లిసినా నారా లోకేష్ గురించే చ‌ర్చిస్తున్న‌ట్టు తెలిసింది. అంతేకాదు.. రెడ్‌బుక్‌పైనా.. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా పై కూడా.. నాయ‌కులు చ‌ర్చిస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు రెడ్ బుక్‌లో రాసుకుంటాన‌ని, వారి సంగ‌తి చూస్తామ‌ని నారా లోకేష్ త‌న యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే.. అప్ప‌ట్లో వైసీపీ …

Read More »

ఎవ‌రున్నా వదల‌ద్దు: చంద్ర‌బాబు

ఏపీలో నకిలీ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, ప్రజల ప్రాణాలకు చేటు చేసే నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువులో నకిలీ మద్యం వ్యవహారం వెలుగు చూసిన నేప‌థ్యంలో ఆయ‌న త‌క్షణ‌మే స్పందించారు. పార్టీ నాయ‌కుల‌పై వేటు వేశారు. ఇదే సమయంలో అధికారుల‌తోను, మంత్రుల‌తోనూ ఆయ‌న ప్రత్యేకంగా సమావేశమయ్యారు. న‌కిలీ మ‌ద్యం త‌యారీ, విక్ర‌యాల కేసులో …

Read More »