Political News

డేటా ఆధారంగానే… ప్రతి ఇంటికీ ఒక ప్రభుత్వ ఉద్యోగం

బీహార్ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష కూటమి అయిన రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నాయకుడు తేజస్వీ యాదవ్ ఎన్నికల ప్రచారంలో ఒక సంచలన ప్రకటన చేశారు. తమ కూటమి అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో కచ్చితంగా ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 20 రోజుల్లోనే చట్టాన్ని తీసుకొస్తామని, 20 నెలల్లో ఈ హామీని పూర్తి చేస్తామని తేజస్వీ స్పష్టం …

Read More »

సునీతకు కలిసివస్తున్న సెంటిమెంట్ పాలిటిక్స్!

తెలంగాణలో కీలకమైన జూబ్లీహిల్స్ (నగరానికి నడిబొడ్డున ఉన్న నియోజకవర్గం) నియోజకవర్గంలో ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ నెల 13 నుండి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. సాధారణంగా జూబ్లీహిల్స్ నుంచి ప్రధాన పార్టీలతో పాటు చిన్న చిత్కా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీగా పోటీకి దిగుతుంటారు. గతంలోనూ ఇదే పరిస్థితి ఉన్నది. అయితే, ప్రస్తుతం ట్రెండ్‌ను చూస్తే, కేవలం 22 నెలల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెరమీదకు వచ్చిందన్నది …

Read More »

దేశంలోనే ఏపీ ఫ‌స్ట్‌.. ఏ రాష్ట్రానికీ ద‌క్క‌ని ల‌క్‌!

దేశంలోనే ఏపీ ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలోని ఏ రాష్ట్రానికీ ద‌క్క‌ని ల‌క్కును చేజిక్కించుకుని.. స‌గ‌ర్వంగా నిలిచింది. ఈ రికార్డుకు కార‌ణం సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌య‌త్న‌మేన‌ని తెలుస్తోంది. రాష్ట్రానికి పెట్టుబ‌డుల వేట‌లో ఉన్న సీఎం చంద్ర‌బాబు.. ఇప్ప‌టికి గ‌త 15 మాసాల్లో 9 ల‌క్ష‌ల కోట్ల మేర‌కు పెట్టుబ‌డులు తెచ్చారు. వీటి వ‌ల్ల 4 ల‌క్ష‌ల ఉద్యోగాలు, ఉపాధి అవ‌కాశాలు కూడా …

Read More »

జూబ్లీహిల్స్ పోరు: బీసీకి కాంగ్రెస్ టికెట్‌.. నవీన్ సత్తా ఏంటి ?

హైద‌రాబాద్‌లోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఎన్నిక‌ల పోరుకు రంగం రెడీ అయింది. ఈ నెల 13 నుంచి నామినేష‌న్ ప్ర‌క్రియ కూడా ప్రారంభం కానుంది. వ‌చ్చే నెల 11 న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అదే నెల 14న రిజ‌ల్ట్ రానుంది. ఈ క్ర‌మంలో కీల‌క‌మైన అధికార పార్టీ కాంగ్రెస్‌.. త‌న అభ్య‌ర్థిని ప్ర‌క‌టించింది. బుధవారం రాత్రి చాలా పొద్దు పోయాక ఈ స్థానం నుంచి న‌వీన్ యాద‌వ్‌ను …

Read More »

వర్మగారూ.. కొంచెం గ్యాప్ ఇవ్వండి సర్..!

అనేక సార్లు వేచి చూసి తొలిసారి అవకాశం దక్కించుకున్న వేగేశ్న నరేంద్ర వర్మ దూకుడు మామూలుగా లేదన్న టాక్ వినిపిస్తోంది. దీంతో నారా లోకేష్ స్వయంగా “వర్మగారూ.. కొంచెం గ్యాప్ ఇవ్వండి సర్..!” అనే పరిస్థితి వచ్చిందట. మరి దీని వెనుక ఏం జరిగింది? ఆయన ఏం చేస్తున్నారు? అనేది వెరీ ఇంట్రస్టింగ్‌గా ఉందని అంటున్నారు. టీడీపీ నాయకుడిగా అవతరించిన ఎన్నారై నాయకుడు వేగేశ్న నరేంద్ర వర్మ. ఉమ్మడి గుంటూరు …

Read More »

మ‌హిళా నేత‌లు: అతి చేశారు.. అడ్ర‌స్ కోల్పోయారు.. !

రాజకీయాల్లోకి రావటమే కాదు వచ్చిన తర్వాత వారి హవాను నిలబెట్టుకోవడం అనేది నాయకులకు చాలా ముఖ్యం. ఏ చిన్న తేడా చేసిన అటు ప్రజల్లోనూ ఇటు రాజకీయంగా కూడా విశ్వసనీయత కోల్పోవ‌డం ఖాయం. ఇప్పుడు అలాంటి మ‌హిళా నాయకులు చాలా మందే కనిపిస్తున్నారు. ఉదాహరణకు కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక పరిస్థితి అగమ్య‌ గోచరంగా మారింది. ప్రస్తుతం ఆమె ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఇటీవల కొన్ని బ్యాంకులు వారి …

Read More »

పవన్ టూర్ తో ఉప్పాడకు ఊపిరొచ్చినట్టే!

నిజమే. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వేస్తున్న నిర్మాణాత్మక అడుగులతో ఉప్పాడకు ఊపిరి వచ్చేసినట్టే. అదేదో ఏడాదో, రెండేళ్లో కాదు… శాశ్వతంగా ఉప్పాడ సమస్యకు పరిష్కారం లభించినట్టేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దాదాపుగా నెల రోజుల క్రితం ఉప్పాడలో పడిపోయిన కొబ్బరి తోటలను తాను అక్టోబర్ 9న పరిశీలిస్తానని పవన్ గత నెలలోనే ప్రకటించారు. ఆ ప్రకటన మేరకు పవన్ గురువారం కోనసీమ పరిధిలోని ఉప్పాడలో పర్యటించనున్నారు. …

Read More »

కోనసీమ పేలుడులో 6 మంది మృతి… బాబు, పవన్ దిగ్భ్రాంతి

ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. దీపావళి సమీపిస్తున్న తరుణంలో ఎక్కడికక్కడ టపాసుల తయారీ ఊపందుకుంది. ఈ క్రమంలో ఈ మధ్యే జిల్లాలోని రాయవరంలో ఏర్పాటు అయిన గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. కంపెనీ యజమాని సత్తిబాబు మరణించిన వారిలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా …

Read More »

సుప్రీంకోర్టు మెట్లెక్కిన టీవీకే చీఫ్ విజయ్

తమిళనాడులోని కరూర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన ఆ రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తోంది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రముఖ సినీనటుడు విజయ్… తమిళ వెట్రిగ కళగం (టీవీకే) పేరిట పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయన రాష్ట్రవ్యాప్త పర్యటన చేపట్టారు. అందులో భాగంగా గత నెల కరూర్ లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. అందులో 41 మంది చనిపోయారు. ఈ ఘటన …

Read More »

తిట్లు, ఆపై సారీ, ఆనక బంతి భోజనం!… కాంగ్రెస్ బలం ఇదే!

దేశంలోనే గ్రాండ్ ఓల్డ్ పార్టీగా ముద్ర పడిన కాంగ్రెస్ పార్టీ అంటేనే… అదోక అగూర గంప. వయసు ఉఢిగిన సీనియర్లతో పాటుగా అప్పుడప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన కుర్ర నేతల సమాహారం కాంగ్రెస్. అలాంటి పార్టీలో నిత్యం వివాదాలు రేగుతూ ఉంటాయి. వాటికవే సమసిపోతూ ఉంటాయి. ఎవరైనా కీలక నేత తన సహచర నేతను అదాటుగా ఓ బూతు అన్నాడుకో అదో పెద్ద రచ్చ. అయితే అలాంటి రచ్చలు కూడా కాంగ్రెస్ …

Read More »

అమరావతి ప‌రుగుల‌కు.. ఎస్పీవీ ఇంధనం.. ఏంటిది?

ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గతానికి ఇప్పటికి ఆయన చాలా తేడా చూపిస్తున్నారు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని బలంగా చెబుతున్నా, ఏమో ఏదైనా తేడా జరిగినా, అమరావతి విషయంలో గతంలో అంటే 2019-24 మధ్య జరిగినట్టుగా జరగకూడదని ఆయన భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో అమరావతి నిర్మాణాలపై అనేక లక్ష్యాలు, నిర్దేశిత గడువులు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. దీనిలో భాగంగానే 2027 చివరి నాటికి …

Read More »

జూబ్లీహిల్స్‌కు టీడీపీ దూరం.. అంతేకాదు..!

ఏపీ అధికార కూటమిని ముందుండి నడిపిస్తున్న టీడీపీ.. తెలంగాణ విషయంలో కీలక, సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతంలో అన్ని రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నుంచి తక్కువగా దూరం ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నేతృత్వంలో తెలంగాణ టీడీపీ నేతల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి, గత ఏడాది, ఈ ఏడాది కూడా.. తెలంగాణలో పార్టీని విస్తరించేందుకు కృషి …

Read More »