Political News

సైకిల్ ఎక్కిన వైసీపీ భూమన

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగానే కాకుండా… జగన్ కోసం ఏమైనా చేసేందుకు అనునిత్యం సిద్ధంగా ఉండే తిరుపతి మాజీ ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో యమా ట్రెండ్ అవుతోంది. జగన్ ను ఎంతగా అభిమానిస్తారో, టీడీపీని.. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని, టీడీపీ నేతలను ఆయన …

Read More »

జాతీయ రాజకీయాలపై రేవంత్ కన్ను

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి…అనూహ్య రాజకీయ పరిణామాలను దాటుకుని మరీ తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగారు. తెలంగాణను సాధించిన బీఆర్ఎస్ ను గద్దె దించి… తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీని ఆయన అధికార పార్టీగా మలచారు. సీఎంగా రేవంత్ పదవీ బాధ్యతలు చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. ఈ క్రమంలో రాజకీయంగా రేవంత్ కాన్ఫిడెన్స్ రెట్టింపు అయ్యిందనే చెప్పాలి. 2034 వరకూ తెలంగాణ సీఎంగా …

Read More »

మీరంతా బొద్దింక‌లు.. ప‌రాన్న జీవులు: సీజేఐ తీవ్ర వ్యాఖ్య‌లు

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి(సీజేఐ) జ‌స్టిస్ సూర్య‌కాంత్‌.. సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్ల్యుయెన్స‌ర్లు, స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద ప్ర‌భుత్వాన్ని, కోర్టుల‌ను ప్ర‌శ్నించేవారిపై నిప్పులు చెరిగారు. మీరంతా బొద్దింక‌లు.. ప‌రాన్న జీవులుఅని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప‌నీ పాటా లేనివాళ్లు.. ఇన్ ఫ్య్ల‌యెన్స‌ర్లుగా అవ‌త‌రిస్తున్నార‌ని.. వ్యాఖ్యానించారు. స‌మ‌చార హ‌క్కు చ‌ట్టాన్ని అడ్డం పెట్టుకుని వ్య‌వ‌స్థ‌ల‌పై బొద్దింక‌ల్లా ఎగ‌బ‌డి దాడి చేస్తున్నార‌ని నిప్పులు చెరిగారు. కానీ.. ఇవి ఉన్న‌వి ప్ర‌జ‌ల కోసం కాబ‌ట్టి.. సంయ‌మ‌నం …

Read More »

పిఠాపురంలో ఈ సారి వార్ వ‌న్‌సైడే…!

జ‌నసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంలో మార్మోగుతోంది. ఎక్కడ చూసినా ఏ నలుగురు కలిసినా ఎమ్మెల్యే తీరును ప్రశంసిస్తున్నారు. ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ అండగా ఉంటున్నారని, అన్ని సామాజిక వర్గాలను పట్టించుకుంటున్నారని పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. నిజానికి ఈ తరహా చర్చ రాష్ట్రంలో జరగడం ఇదే తొలిసారి. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో నాయకులు -ఎమ్మెల్యేలకు మధ్య సంబంధం …

Read More »

పవన్ సర్జరీ వెనుక పెద్ద కారణమే ఉంది

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ గ‌త నెల‌లో హ‌ఠాత్తుగా అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డం, ఆయ‌న‌కు అత్య‌వ‌స‌రంగా శ‌స్త్ర చికిత్స జ‌ర‌గ‌డం చ‌ర్చ‌నీయాంశం అయిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న అనారోగ్యంపై ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌చ్చాయి. అంద‌రూ శ‌స్త్ర చికిత్స అని రిపోర్ట్ చేశారే కానీ.. అస‌లు స‌మ‌స్య ఏంటి, దేనికి స‌ర్జ‌రీ జ‌రిగింద‌నే విష‌యం మాత్రం ఎవ్వ‌రూ చెప్ప‌లేదు. త‌ర్వాత ఆస్త‌మాకు శ‌స్త్ర చిక‌త్స జ‌రిగిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి కానీ.. …

Read More »

విజయన్ తో సతీషన్.. మనకా భాగ్యం లేదంతే!

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. తమిళనాడు, కేరళలో ప్రభుత్వాలు మారినా… తాజా మాజీలతో కొత్త సీఎంలు భేటీ అయ్యారు. రాజకీయాలు ఎన్నికల వరకే… ఆ తర్వాత అంతా కలిసి పనిచేద్దామంటూ వారు ఆసక్తికర చర్చలు చేశారు. అయితే ఈ తరహా దృశ్యాలు మన తెలుగు రాష్ట్రాల్లో అసాధ్యమన్న మాట అయితే గట్టిగా వినిపిస్తోంది. ఓ పార్టీని మరో పార్టీ …

Read More »

పిఠాపురం వర్మకు పవన్ లేఖ?

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేరుతో రూపొందించిన ఓ ఫేక్‌ లెటర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మకు పవన్‌ కల్యాణ్‌ ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా ఈ లేఖను సృష్టించారు. ఈ లేఖలో.. “2024 ఎన్నికల్లో వర్మ గారు అందించిన సహకారం మరువలేనిది” అంటూ పేర్కొన్నారు. అలాగే పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తున్నానని తెలిసిన వెంటనే బలమైన క్యాడర్‌ ఉన్నప్పటికీ వర్మ తన సీటును …

Read More »

ఏపీ అంటే… అడ్వాన్స్ డ్ ప్రదేశ్!

నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత ముందుగానే అంచనా వేసే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లాంటి నేత ఏపీకి ముఖ్యమంత్రిగా ఉంటే… రాష్ట్రం అన్నింటా ముందే ఉంటోంది. అందుకే ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదని, అడ్వాన్స్ డ్ ప్రదేశ్ అని అంటున్నారు. ఇదేదో… టీడీపీ నేతలో, చంద్రబాబు అభిమానులో చెబుతున్న …

Read More »

ఇలాగైతే కష్టమంటున్న కేసీఆర్

తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ పార్టీ బొక్కబోర్లా పడిపోయింది. అయితే మరో రెండేళ్లలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి సత్తా చాటాలని ఆ పార్టీ సమాయత్తం అవుతోంది. అందులో భాగంగా గురువారం బీఆర్ఎస్ అదినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పార్టీ ముఖ్య నేతలతో తన ఫామ్ హౌస్ లో ప్రత్యేక …

Read More »

‘కరూర్’ మృతుడి తల్లి పాదాలు తాకిన విజయ్

తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో ఆయన నిర్వహించిన రోడ్ షో 41 మంది ప్రాణాలను బలిగొంది. ఈ ఘటనతో విజయ్ రాజకీయం ఇక ముగిసినట్టేనని అంతా అనుకున్నారు. అయితే ఏమాత్రం ధైర్యం వీడని విజయ్ అలా ముందుకు సాగారు. ఏకంగా తమిళనాడు సీఎంగా పదవి చేపట్టారు. అయితే కరూర్ ఘటన విజయ్ ని ఎంతగా …

Read More »

పీఎం పొదుపు మంత్రం… మహానాడుపై ఎఫెక్ట్?

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్‌ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు చేరే కీలక వేదికగా దీన్ని భావిస్తారు. ముఖ్యంగా లోకేష్‌ కొత్త బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఈసారి వేడుకలపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అయితే పెట్రోల్‌, డీజిల్‌ వినియోగాన్ని తగ్గించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నేపథ్యంలో మహానాడు నిర్వహణపై టీడీపీ అధిష్టానం కొత్త …

Read More »

ఇక పెట్రోల్ బాదుడేనా?

అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన చమురు సంస్థలు.. వాటిని ఏమాత్రం ఆలస్యం చేయకుండానే అమల్లోకి పెట్టేశాయి. పెట్రోల్, డీజిల్ పై లీటరు రూ.3 చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఇక సీఎన్జీ ధరలను కూడా కిలోకు రూ.2 చొప్పున పెంచుతూ గ్యాస్ …

Read More »