వైసీపీ సీనియర్ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు.. మోహిత్ రెడ్డిని ఏ క్షణమైనా పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీలో వైసీపీ పాలనా కాలంలో చోటు చేసుకున్న భారీ మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి తాజాగా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మోహిత్‌రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు.. ఈ కేసులో విచారణ జరకుండానే బెయిల్ …
Read More »జగన్‌ను ఊహకందని దెబ్బ కొట్టిన చంద్రబాబు!
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు తమకు మేలు చేస్తాయని ఆ పార్టీ నాయకులు పదేపదే చెప్పిన విషయం తెలిసిందే. తమకన్నా మించి ఎవరు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేరని, ప్రజలకు సొమ్ములు కూడా ఇవ్వలేరని వారు చెప్పుకొచ్చారు. ఇప్పటికీ అదే చెబుతున్నారు. అయితే అనూహ్యంగా సీఎం చంద్రబాబు వైసీపీ కన్నా ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు జగన్ హయాంలో ఇచ్చిన …
Read More »బీహార్‌లో మరింత వేడి.. ఎంట్రీ ఇచ్చిన ‘ఆప్’
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 6, 11 తేదీల్లో ఈ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. అయితే.. ఇప్పటి వరకు రెండు కూటములు.. ఒక ప్రాంతీయ పార్టీ మధ్య యుద్ధం జరుగుతుందని భావించగా.. మేం మాత్రం తక్కువ తిన్నామా? అంటూ.. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా బీహార్ ఎన్నికల్లో పోటీకి రెడీ అయింది. ఈ …
Read More »లోకేష్ అంటేనే.. వణికి పోతున్నారే..!
అవును.. నిజమే. వైసీపీ నాయకులకు ఇప్పుడు మంత్రి నారా లోకేష్ సింహ స్వప్నంగా మారిపోయారనే టాక్ వినిపిస్తోంది. ఏ ఇద్దరు నాయకులు కలిసినా నారా లోకేష్ గురించే చర్చిస్తున్నట్టు తెలిసింది. అంతేకాదు.. రెడ్‌బుక్‌పైనా.. ప్రస్తుతం సోషల్ మీడియా పై కూడా.. నాయకులు చర్చిస్తున్నారు. ఎన్నికలకు ముందు రెడ్ బుక్‌లో రాసుకుంటానని, వారి సంగతి చూస్తామని నారా లోకేష్ తన యువగళం పాదయాత్రలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే.. అప్పట్లో వైసీపీ …
Read More »ఎవరున్నా వదలద్దు: చంద్రబాబు
ఏపీలో నకిలీ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, ప్రజల ప్రాణాలకు చేటు చేసే నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువులో నకిలీ మద్యం వ్యవహారం వెలుగు చూసిన నేపథ్యంలో ఆయన తక్షణమే స్పందించారు. పార్టీ నాయకులపై వేటు వేశారు. ఇదే సమయంలో అధికారులతోను, మంత్రులతోనూ ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నకిలీ మద్యం తయారీ, విక్రయాల కేసులో …
Read More »ఇన్ని సార్లు బెంగళూరు వెళ్తే జనం మాత్రం ఎవరొస్తారు?
తెలుగు రాజకీయాల్లో అత్యధిక ప్రజాదరణ కలిగిన నాయకులలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు ముందు వరుసలో ఉంటుంది. జగన్ వస్తున్నారంటే చాలు, ఆయనను చూడటానికి జనం తారసపడటం సాధారణం. కానీ ఈ మధ్యకాలంలో ఆ దృశ్యం కనిపించడం లేదు. ఇటీవల బెంగళూరు నుంచి విజయవాడకు వచ్చిన జగన్‌కు స్వాగతం పలికేందుకు పెద్దగా జనసంద్రం కనిపించలేదు. పార్టీ నేతలు, ముఖ్యంగా దేవినేని అవినాష్ మరియు ఎమ్మెల్సీ తలశిల రఘురాం మాత్రమే …
Read More »ఎవరీ వాంగ్ చుక్: దేశాన్ని, కేంద్రాన్ని ఎందుకు కుదిపేస్తోంది!?
సోనమ్ వాంగ్ చుక్!. ఇప్పుడు జాతీయ స్థాయిలో జోరుగా వినిపిస్తున్న పేరు. అంతేకాదు.. సోమవారం సుప్రీంకోర్టు ఈయన వ్యవహారంపై దాదాపు గంట సేపు విచారించింది. అంతేనా.. “ఇతర కేసులు పక్కన పెట్టి మరీ ఈ కేసును విచారించేస్థాయికి తీసుకువచ్చారు. దీనికి గాను.. మేం సమయం కేటాయిస్తాం. వచ్చే మంగళవారం దీనిపై పూర్తిస్తాయి విచారణ చేపడతాం.“ అంటూ.. సుప్రీంకోర్టు పేర్కొందంటే.. ఈ కేసు ప్రాధాన్యం ఎలా ఉందో అర్థమవుతుంది. ఇక్కడితో కూడా.. …
Read More »చంద్రబాబుకు `టమాటా` పరీక్ష!
ఏపీలో అనునిత్యం ఏదో ఒక సమస్య సీఎం చంద్రబాబుకు ఇబ్బందిగా మారుతోంది. ముఖ్యంగా రైతులకు సంబంధించిన సమస్యలు.. కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయి. గత ఆరు మాసాల్లో .. పొగాకు, మామిడి, మిర్చి, ధాన్యం, ఉల్లిపాయలు, యూరియా, అకాల వరద నష్టాలు.. ఇలా.. అనేక అంశాల్లో సర్కారు ఇరుకున పడుతూనే ఉంది. రైతులకు గిట్టుబాటు ధరలు రాకపోవడం… కేంద్రం నుంచి సరైన సహకారం లేకపోవడం వంటివి ఇబ్బందిగానే ఉన్నాయి. దీంతో చంద్రబాబు …
Read More »ముంబైలో లోకేష్ బిజీ బిజీ: పెట్టుబడుల వేట!
టీడీపీ యువ నాయకుడు, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మహారాష్ట్ర రాజధాని ముంబైలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు పారిశ్రామిక వేత్తలతో చర్చలు జరుపుతున్నారు. పెట్టుబడులకు సంబంధించి ఆయన ఒకరకంగా వేట చేపట్టారు. ప్రస్తుతం ముంబైలో పలువురు పారిశ్రామిక వేత్తలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కూడా.. ఈ భేటీకి హాజరయ్యారు. ఆయన వెంట మంత్రి టీజీ భరత్ కూడా ఉన్నారు. పెట్టుబడుల విషయంలో …
Read More »జూబ్లీహిల్స్‌పై కమలనాథుల దృష్టి… టికెట్ ఎవరికి?
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఘట్టం తెరమీదికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు తమ తమ అభ్యర్థుల ఎంపికై కసరత్తును ముమ్మరం చేశాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నలుగురి పేర్లతో పార్టీ అధిష్టానానికి నివేదిక పంపించింది. ఇక, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ కూడా తన అభ్యర్థిని ప్రకటించేసింది. మాజీ ఎమ్మెల్యే, దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు బీఆర్ ఎస్ టికెట్ …
Read More »బిహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం రెండు దశలలో నిర్వహించనున్న ఈ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఢిల్లీలో తాజాగా వెల్లడించారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకుగాను.. రెండు దశల్లో ఎన్నికల్లో నిర్వహించనున్నారు. నవంబరు 6, 11న ఈ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఇక, సోమవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి …
Read More »నేను ఓడిపోయినప్పుడు ఆయన వెన్నంటి ఉన్నారు: పవన్
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కీలక వ్యాఖ్యలు చేశారు. తాను 2019 ఎన్నికల్లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటి చేసినా.. ఓడిపోయానని తెలిపారు. ఆ సమయంలో చాలా నిర్వేదానికి..నిరాశకు గురైనట్టు చెప్పారు. అలాంటి సమయంలో తనకు వెన్నంటి ఉండి.. ధైర్యం చెప్పి.. భవిష్యత్తుపై ఆశలు చిగురించేలా చేసిన వ్యక్తి .. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి. గోపాల గౌడేనని పేర్కొన్నారు. తన రాజకీయ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates