Political News

బాల‌య్య‌పై ఫ‌స్ట్‌టైమ్‌.. జ‌గ‌న్ ఫైర్‌

న‌ట సింహం, టీడీపీ నాయ‌కుడు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌పై ఏపీ సీఎం జ‌గ‌న్ తొలిసారి తీవ్ర సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో వలంటీర్ వ్య‌వ‌స్థ‌పై రాజ‌కీయం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వ‌లంటీర్ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. హ్యూమ‌న్ ట్రాఫికింగ్‌లో వారి పాత్ర ఉంద‌ని ఆయ‌న చెప్పారు. అయితే.. దీనిపై ఇప్ప‌టికే వైసీపీ నాయ‌కులు …

Read More »

ఒక‌రితో పెళ్లి.. మ‌రొక‌రితో సంసారం: ప‌వ‌న్‌పై జ‌గ‌న్

ఏపీ సీఎం జ‌గ‌న్ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. “ఒక‌ళ్ల‌ను పెళ్లి చేసుకుని.. మ‌రొక‌రితో సంసారం చేసేవాడు” అని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త జీవితంతోపాటు. ఆయ‌న సంసారంపైనా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. తాజాగా వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన జ‌గ‌న్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కేంద్రంగా నిప్పులు చెరిగారు. “పెళ్లిళ్లు చేసుకోవడం, కాపురాలు చేయడం, వదిలేయడం ద‌త్త‌పుత్రుడి(పవన్‌ కల్యాణ్‌) క్యారెక్టర్‌. అలాంటి వ్యక్తా వలంటీర్ల గురించి …

Read More »

అందరికీ బీసీ ఓట్లే కావాలా ?

తెలంగాణాలో రాజకీయ పార్టీలన్నీ బీసీ సామాజికవర్గాలచుట్టూనే తిరుగుతన్నాయి. ముందుగా బీసీ డిక్లరేషన్ అని కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. తర్వాత బీజేపీ కూడా బీసీ డిక్లరేషన్ అన్నది. తాజాగా బీఆర్ఎస్ పార్టీలోని బీసీ ప్రజా ప్రతినిధులందరు ఎంఎల్ఏ క్వార్టర్స్ లో సమావేశమయ్యారు. తొందరలోనే బీసీ గర్జన పేరుతో భారీ బహిరంగసభ నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తోంది. తొందరలోనే పార్టీలోని బీసీ ప్రజాప్రతినిధులతో సమావేశమవ్వాలని కేసీయార్ అనుకుంటున్నారు. కొందరు మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్లను కూడా …

Read More »

కిషన్ రెడ్డి ప్లాన్ ఇదేనా ?

బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యూహాత్మకంగా వెళుతున్నట్లున్నారు. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. అన్నీ సవ్యంగా కుదిరితే డిసెంబర్లోనే ఎన్నికలు జరగాలి. బండి సంజయ్ నుండి కిషన్ బాధ్యతలు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. కిషన్ ప్రెసిడెంట్ గా నియమితులైనప్పటినుండి చాలామంది బండితో పోలికి చూసి చప్పరించేస్తున్నారు. దాంతో కిషన్ కు బాగా మండినట్లుంది. అందుకనే బాధ్యతలు తీసుకోగానే గోల మొదలుపెట్టేశారు. బాటసింగారంలో కేసీయార్ ప్రభుత్వం నిర్మించిన …

Read More »

ఎంఎల్ఏ ఆస్తులు వేలమా ?

వ్యాపారాలు, పరిశ్రమల పేరుతో బ్యాంకుల్లో అప్పులు తీసుకోవటం, తర్వాత వాటిని ఎగ్గొట్టడం ఇపుడు ఎక్కువైపోతున్నాయి. అప్పులు తీసుకుని ఎగ్గొట్టే వాళ్ళల్లో ఎక్కువగా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలే ఉంటున్నారు. తమ పలుకుబడితో తీసుకున్న అప్పులను చెల్లించకుండా రానిబాకీల ఖాతాలో వేయించేసుకుని బయటపడుతున్న వారు కూడా ఉన్నారు. ఇప్పుడింతా ఎందుకంటే వైసీపీ పుట్టపర్తి ఎంఎల్ఏ దుద్దుకుంట శ్రీధరరెడ్డి ఆస్తులు వేలానికి రావటమే కారణం. కెనరా బ్యాంకులో ఎంఎల్ఏ వ్యాపారాల కోసం …

Read More »

91 మంది ఎంపీలు దూరంగా ఉన్నారా ?

దేశరాజకీయాల్లోని రాజకీయ పార్టీల్లో దాదాపు స్పష్టమైన విభజన వచ్చేసింది. ఒకటి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే. రెండోది కొత్తగా ఏర్పడిన ఇండియా కూటమి. మూడోది కూటమిగా కాకుండా దేనికదే విడివిడిగానే ఉంటున్న పార్టీలు. అంటే పై రెండు కూటములకు సంబంధంలేకుండా ఉంటున్న పార్టీల సంఖ్య 11. ఈ 11 పార్టీల్లో 91 మంది ఎంపీలున్నారు. ఎన్డీయేలో 38 పార్టీలున్నాయి. ఇండియా కూటమిలో 26 పార్టీలుండగా రెండు కూటములతో సంబంధంలేని పార్టీలు 11. …

Read More »

పవన్ పై కోర్టుకు ఏపీ ప్రభుత్వం

ఏపీలో వాలంటీర్ల పై, వాలంటీర్ల వ్యవస్థ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ప్రజల సున్నితమైన డేటాను వాలంటీర్లు సేకరించి ప్రైవేటు వ్యక్తులకు చేరవేస్తున్నారని, ఏపీలో వాలంటీర్లు సేకరించిన డేటా హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడాలో ఉందని పవన్ ఆరోపించడం కలకలం రేపింది. ఆ డేటానుపయోగించి హ్యూమన్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతోందని పవన్ చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. …

Read More »

జగన్..రా చూసుకుందాం: పవన్

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన వాడీవేడిగా సాగిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరైన పవన్ బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యి ఏపీ రాజకీయాలపై చర్చలు జరిపారు. ఈ రోజు మధ్యాహ్నం ఏపీకి తిరిగి వచ్చిన పవన్…తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లపై వ్యాఖ్యల నేపథ్యంలో తనను ప్రాసిక్యూట్ చేయాలని జగన్ ప్రభుత్వం జీవో ఇచ్చిందని, తాను దేనికైనా రెడీ …

Read More »

జగన్ పై చెక్ బౌన్స్ కేసు?

అమ్మఒడి పథకాన్ని సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని చెప్పిన జగన్…సీఎం అయిన తర్వాత మాట మార్చారు. ప్రతి తల్లికి అమ్మఒడి కాస్తా..ప్రతి పిల్లవాడికి అమ్మఒడి అంటూ జగన్ మాట తప్పి మడమ తిప్పారని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇక, ఆ పథకం నిధులైనా సరిగ్గా ఇస్తున్నారా అంటే ..అదీ లేదు. అమ్మఒడి పథకం …

Read More »

జంపిగుల జాబితా పెరుగుతోంది.. జాగ్ర‌త్త ప‌డండి కేసీఆర్ స‌ర్‌!

కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యం దూసుకు వ‌స్తోంది. ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘం కూడా కార్యాచ‌ర‌ణ ప్రారంభించింది. మ‌రో మూడు మాసాల్లో ఎన్నిక‌ల ముఖ‌చిత్రంపై స్ప‌ష్ట‌త వ‌చ్చేస్తోంది. మ‌రి ఇలాంటి స‌మ‌యంలో ఏ పార్టీలో అయిన‌ చేరిక‌లే ఉండాలి. ముఖ్యంగా మూడో సారి కూడా తెలంగాణ కోట‌లో కారును ప‌దిలంగా ప‌రుగులు పెట్టించాల‌ని, రికార్డు సృష్టించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న బీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ కు అప్ర‌క‌టిత సెగ త‌గులుతోంది. పైకి …

Read More »

కిషన్ రెడ్డి అరెస్టు… హై టెన్షన్

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే బాటసింగారంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన కార్యక్రమానికి బీజేపీ పిలుపునిచ్చింది. అయితే, ఆ వ్యవహారం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆ పరిశీలనకు వెళ్లకుండా బీజేపీ నేతలు ఈటల రాజేందర్, డీకే అరుణ తదితరరులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. …

Read More »

తన జాతకం తానే రాసుకుంటున్న కేతిరెడ్డి

నిత్యం అక్క‌డ రాజ‌కీయం ర‌గులుతూనే ఉంది. నువ్వురెండంటే.. నేను నాలుగంటా.. అంటూ.. అధికార, విప‌క్ష నాయ‌కులు ఢీ అంటే ఢీ అన్న‌ట్టుగా రాజ‌కీయ విమర్శ‌లు చేసుకుంటున్నారు. రోడ్డున ప‌డుతున్నారు. నువ్వా-నేనా సై! అంటూ.. కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆ నియోజ‌క‌వ‌ర్గ‌మే.,. ఉమ్మ‌డి అనంత‌పురంలోని తాడిప‌త్రి. అప్ర‌తిహ‌త విజ‌యంతో 35 సంవ‌త్స‌రాల పాటు జేసీ కుటుంబం ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్కింది. అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో తొలిసారి వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. కేతిరెడ్డి …

Read More »