ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య కొద్దిరోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీ సోషల్ మీడియా వేదికగా పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి. అక్టోబర్ 24 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు పెద్ద బాంబు పేలుతుందంటూ ఇటు టీడీపీ, అటు వైసీపీ నిన్న పోస్టులు పెట్టాయి. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ సోషల్ మీడియా ఖాతా నుండి ఓ పోస్ట్ వెలువడడం సంచలనం రేపింది. మీడియా ముసుగు వేసుకొని డ్రగ్స్ మాఫియా నడిపించే వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవా అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.
కొనేళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రోజువారీ వ్యవహారాలు నడుపుతూ దొరికిపోయిన ఎల్లో న్యూస్ ఛానల్ అధినేతకు టిటిడి చైర్మన్ పదవి అంటూ వైసీపీ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. అందుకు సంబంధించిన సాక్షాలు ఇవిగో అంటూ వైసీపీ పోస్ట్ చేసింది. ఎల్లో మీడియా డ్రగ్స్ మాఫియా అంటూ వైసీపీ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ ఛైర్మన్ పదవిని భర్తీ చేయలేదు. ఓ మీడియా ఛానల్ అధినేతకు ఈ పదవి దక్కబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆ విషయంపై వైసీపీ ట్వీట్ చేయడం సంచలనం రేపుతోంది. మరి, టీడీపీ ఈ రోజు ఎటువంటి సంచలన బాంబ్ పేల్చబోతోంది అన్నది తేలాల్సి ఉంది.