Political News

10 నుంచి ప్ర‌జ‌ల్లోకి కేసీఆర్‌!

బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్‌.. ఈ నెల 10వ తేదీ నుంచి ప్ర‌జ‌ల్లోకి రానున్నారు. వినాయ‌క చ‌వితి ప‌ర్వ‌దినం ముగిసిన త‌ర్వాత ఆయ‌న ప్ర‌జ‌ల‌ను నేరుగా క‌లుసుకునేందుకు.. ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు బీఆర్ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను కేసీఆర్ ఎండ‌గ‌డ‌తార‌ని.. ప్ర‌జ‌ల‌తో క‌లిసి ఉద్య‌మానికి రెడీ అవుతార‌ని బీఆర్ఎస్ నాయ‌కులు తెలిపారు. తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. ప్రజా సమస్యలపై పోరాడేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నట్లు …

Read More »

కమలదళంలో ‘హైడ్రా’ కలకలం !

హైడ్రా ఇప్పుడు హైదరాబాద్ లో అక్రమ నిర్మాణదారులను, అందరు రాజకీయ నాయకులను వణికిస్తున్న సంస్థ. చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను గుర్తించి తొలగించేందుకు ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు చాలా కట్టడాలు కూల్చివేసింది. ఇక నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసిన నేపథ్యంలో అది పెద్ద చర్చకు దారితీసింది. ఏకంగా రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు దుర్గం చెరువులో, మంత్రి పొంగులేటి ఇల్లు హిమాయత్ …

Read More »

పులివెందుల‌కు జ‌గ‌న్‌.. మూడు రోజులు అక్క‌డే?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. శ‌నివారం నుంచి మూడు రోజుల పాటు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో ప‌ర్య‌టించనున్నారు. స్థానికుల‌తో ఆయ‌న భేటీ అవుతార‌ని పార్టీ కార్యాల‌యం తెలిపింది. ఎన్నిక‌ల త‌ర్వాత‌.. పులివెందుల ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌డం..ఇది నాలుగోసారి. అయితే.. ఈసారి అచ్చంగా.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుని వాటికి ప‌రిష్కారం చూపించే ప్ర‌య‌త్నం చేస్తార‌ని పార్టీ నాయ‌కులు తెలిపారు. శ‌నివారం ఉద‌యం గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం నుంచి ఆయ‌న స‌తీస‌మేతంగా పులివెందుల …

Read More »

వైసీపీ విష‌యంలో బాబు వ్యూహం ఇదేనా..!

చంద్రబాబు వ్యూహంతో వైసిపి ఖాళీ అయిపోతుందా? ఇదీ ఇప్పుడు జరుగుతున్న ప్రధాన చర్చ. రాజకీయాల్లో ప్రత్యర్థులను దెబ్బతీయ‌డం, పార్టీలను ఖాళీ చేయటం అనేది ఆది నుంచి ఉన్న సమస్య కాదు. ఒకప్పుడు ప్రతిపక్షాలను గౌరవించే పద్ధతి, పరిస్థితి ఉండేది. అంతేకాదు అసలు ప్రతిపక్షాల నుంచి నాయకులు తీసుకునే సంస్కృతి కూడా ఒకప్పుడు ఉండేది కాదు. కానీ గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో పరిస్థితి మారిపోయింది. ఒక్క‌ రాష్ట్రంలోనే కాదు. దేశవ్యాప్తంగా …

Read More »

వెళ్ల‌ద్దు ఉండండి.. : జ‌గ‌న్ విన్న‌పాలు

వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు ఒక్కొక్క‌రుగా జారుకుంటున్నార‌న్న వార్త‌లు ఒక‌వైపు, ఇప్ప‌టికే ఇద్ద‌రు స‌భ్యులు రాజీనామాలు చేయడం, పార్టీకి కూడా రాం రాం చెప్పిన నేప‌థ్యంలో వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. శుక్ర‌వారం రాష్ట్రంలో అందు బాటులో ఉన్న రాజ్య‌స‌భ స‌భ్యుల‌ను తాడేప‌ల్లికి ఆహ్వానించి.. వారితో సుదీర్ఘ చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ భేటీకి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్ర‌బోస్ మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. మిగిలిన వారిలో ప‌రిమ‌ళ్ న‌త్వానీ.. …

Read More »

పార్టీని న‌డ‌ప‌డం క‌ష్టంగా ఉంది: వైసీపీ ఎంపీ

పార్టీని న‌డ‌ప‌డం చాలా క‌ష్టంగా ఉంద‌ని వైసీపీ ముఖ్య‌నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తం 11 మంది పార్టీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుల్లో 10 మంది వ‌ర‌కు పార్టీ మారుతారంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అలాంటి ప‌రిస్థితి రాద‌న్నారు. అంద‌రూ జ‌గ‌న్‌కు విధేయులేన‌ని.. అయితే, ఒక‌రిద్ద‌రు దారి త‌ప్పినంత మాత్రాన అంద‌రినీ అదే రాటన క‌ట్ట‌వ‌ద్ద‌ని ఆయ‌న పేర్కొన్నారు. మీడియా సంయ‌మ‌నం …

Read More »

ఎవ‌రున్నా వ‌ద‌లద్దు.. ప్ర‌తి 3 గంట‌ల‌కూ రిపోర్టు ఇవ్వండి: చంద్ర‌బాబు

కృష్ణా జిల్లా గుడ్లవ‌ల్లేరులోని శేషాద్రి ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో విద్యార్థినుల మ‌రుగు దొడ్ల‌లో హిడెన్ కెమెరాలు పెట్టి.. రికార్డు చేశా ర‌న్న తీవ్ర ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో విద్యార్థినులు ఆందోళ‌న‌కు దిగారు. ఈ విష‌యంపై హుటాహుటిన స్పందించిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ఉన్న‌తాధికారుల‌తో ప్ర‌తి 3 గంట‌ల‌కు ఒక‌సారి మాట్లాడుతున్నారు. ఈ ఘ‌ట‌న వెనుక ఎవరున్నా.. వ‌దిలి పెట్ట‌రాదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. శుక్ర‌వారం ఉదయం 11గంట‌ల స‌మ‌యంలో ఘటన విషయం తెలిసిన విష‌యం …

Read More »

వివాదాస్ప‌ద మొక్క‌ల‌పై ప‌వ‌న్ కామెంట్స్‌!

ఏపీలో వివాదాస్ప‌దంగా మారిన ‘కోనోకార్ప‌స్‌’ మొక్క‌ల వ్య‌వ‌హారంపై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. ఈ మొక్క‌ల‌ను పెంచొద్ద‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. అంతేకాదు.. విదేశాల్లోనూ ఈ మొక్క‌ల‌ను పెంచ‌డం లేద‌ని.. వీటి వ‌ల్ల మేలు జ‌ర‌గ‌క‌పోగా.. కీడు జ‌రుగుతుంద‌ని చెప్పారు. శుక్ర‌వారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హించి ‘మ‌నం-వ‌నం’ కార్య‌క్ర‌మానికి సంబంధించి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ వీడియో సందేశం విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌తి …

Read More »

వైసీపీకి మామూలు షాక్ కాదు!

ప్ర‌తిప‌క్ష వైసీపీకి అలాంటి ఇలాంటి షాక్ కాదు.. పెద్ద‌ భారీ షాకే త‌గిలింది. ఆయ‌న ఏరికోరి ఎంచుకుని మ‌రీ శాస‌న మండ‌లికి పంపించిన ఇద్ద‌రు తాజాగా రిజైన్ చేశారు. అది కూడా ఎలాంటి హ‌డావుడీ లేకుండా.. ఎలాంటి వార్త‌లు లీక్ చేయ‌కుండా.. సైలెంట్‌గా త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసేశారు. వారు నేరుగా శాస‌న మండ‌లికి వ‌చ్చి.. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 1 గంట స‌మ‌యంలో చైర్మ‌న్‌.. మోషేన్‌రాజుకు త‌మ రాజీనామా ప‌త్రాల‌ను …

Read More »

ఇలా ఘ‌ట‌న‌.. అలా రియాక్ష‌న్‌: ష‌ర్మిలకు జ‌గ‌న్‌కు తేడా ఇదే!

ఏపీలో జ‌రుగుతున్న ఘ‌ట‌న‌ల‌పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల వెంట‌నే స్పందిస్తున్నారు. నిజానికి 11 మంది ఎమ్మెల్యేల‌తో ఉన్న జ‌గ‌న్ వెంట‌నే రియాక్ట్ అవ్వాలి. కానీ, తాడేప‌ల్లి ప్యాలెస్ గ‌డ‌ప దాటి రావ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పోనీ.. ట్విట్ట‌ర్‌లో అయినా.. స్పందిస్తున్నారా? అంటే.. ప్ర‌జలు త‌న‌ను గెలిపించ‌లేద‌న్న ఆవేద‌న నుంచి ఆయ‌న ఇంకా కోలుకున్న‌ట్టు లేరు. అందుకే చాలా నిదానంగా.. రియాక్ట్ అవుతున్నారు. కానీ, ష‌ర్మిల మాత్రం ప్రజాప్ర‌తినిధులు …

Read More »

ఐదేళ్ల నిర్ల‌క్ష్యం.. పాతికేళ్ల ఎఫెక్ట్‌..

ఏపీలో చంద్ర‌బాబు ఎక్క‌డికి వెళ్లినా.. వ్య‌వ‌స్థ‌ల‌ను బాగు చేస్తున్నామ‌నే మాట వినిపిస్తున్నారు. ఇక‌, ఆయ‌న మంత్రివ‌ర్గంలోని వారు కూడా ఇదే చెబుతున్నారు. వ్య‌వ‌స్థ‌ల‌ను బాగు చేస్తున్నామ‌ని.. చెబుతున్నారు. దీనికి కార‌ణం.. ఐదేళ్ల వైసీపీ పాన‌ల‌లో అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నాశ‌నం చేశార‌న్న‌ది టీడీపీచెబుతున్న మాట‌. అంతేకాదు.,. మ‌ద్యం, విద్య‌త్ వంటి కీల‌క విష‌యాల్లో అయితే.. పాతికేళ్ల‌కు స‌రిప‌డా వైసీపీ ఒప్పందాలు చేసుకుని.. అప్పులు తెచ్చుకుంది. ఇప్పుడు వాటిని స‌రిచేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న‌ది …

Read More »

వైసీపీకి ఎమ్మెల్యేలు సేఫే రీజ‌న్ ఇదే!

ఏపీలో ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయాలు ఏక్ష‌ణంలో ఎలా మారుతాయో.. చెప్ప‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు రాజ్య‌స‌భ స‌భ్యులు, ఒక ఎమ్మెల్సీ ఇప్ప‌టికే వైసీపీకి దూర‌మ‌య్యారు. వారి ప‌ద‌వుల‌కు, పార్టీకి కూడా రిజైన్ చేశారు. ఇక ముందు కూడా మ‌రింత మంది పార్టీ మారే అవ‌కాశం ఉంద‌ని పెద్ద ఎత్తున విశ్లేష‌ణ‌లు , వార్త‌లు వ‌స్తున్నాయి. సాధార‌ణంగా ఒక పార్టీ ప్ర‌భుత్వం పోయి.. మ‌రో పార్టీ అధికారంలోకి వ‌స్తే.. …

Read More »